PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-eetelarajendarf6006b78-19da-43f3-9d6e-3d123e6c6c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-eetelarajendarf6006b78-19da-43f3-9d6e-3d123e6c6c6b-415x250-IndiaHerald.jpgఅవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారని పేర్కొంటూ.. టీఆర్‌ఎస్‌కు స్వ‌స్తీ చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కమలం ‘ఉప’ ఎన్నిక సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా.? అన్నది ఇప్పుడు ర‌స‌వ‌త్తంగా మారింది. 2012లో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున యెన్నెం శ్రీనివాసరెడ్డిని అనూహ్యంగా కమలం పార్టీ బరిలోకి దింపింది. ఈ ఉత్కంఠ పోరులో యెన్నెం శ్రీనివాసరెడ్డి 1,779 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇబ్రహీంపై ఘ‌న‌విజయం సాధించారు. 2020లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట ర#eetelarajendar{#}Telangana;lotus;2020;Assembly;MLA;Elections;Mahabubnagar;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Ministerఆ సెంటిమెంట్ ఈటల కొనసాగించేనా..?ఆ సెంటిమెంట్ ఈటల కొనసాగించేనా..?#eetelarajendar{#}Telangana;lotus;2020;Assembly;MLA;Elections;Mahabubnagar;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;MinisterWed, 27 Oct 2021 06:50:21 GMTమ‌లిద‌శ తెలంగాణ ఉద్యమ స‌మయంలో క్రియాశీలకంగా వ్యవహరించి, కేసీఆర్‌తో విభేదించి టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారులకు కమలం పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీచేయడం కలిసివస్తోందా అనేది ఎంతో ఆస‌క్తిగా మారింది.  గతంలో మహబూబ్‌నగర్‌, దుబ్బాక ఉపఎన్నికల్లో విజ‌యం సాధించిన మాదిరిగానే ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ బీజేపీ విజయం గెలుస్తుందా అంటే బీజేపీ వర్గాలు అవుననే పేర్కొంటున్నాయి. అంతేకాకుండా  హుజూరాబాద్‌లో భారీ మెజారిటీ కూడ సాధిస్తామని చెబుతున్నాయి.  అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు  తన ఎత్తుగడలతో ఈ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేస్తారా..? అనే అంశం చాలా చర్చనీయాంశమైంది.

అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారని పేర్కొంటూ.. టీఆర్‌ఎస్‌కు స్వ‌స్తీ చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కమలం ఉపఎన్నిక సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా.? అన్నది ఇప్పుడు ర‌స‌వ‌త్తంగా మారింది. 2012లో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున యెన్నెం శ్రీనివాసరెడ్డిని అనూహ్యంగా  కమలం పార్టీ బరిలోకి దింపింది. ఈ ఉత్కంఠ పోరులో యెన్నెం శ్రీనివాసరెడ్డి 1,779 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇబ్రహీంపై ఘ‌న‌విజయం సాధించారు. 2020లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో  దుబ్బాక ఉప ఎన్నికలు జ‌రిగాయి. అక్క‌డ కూడ  బీజేపీ నుంచి పోటీ చేసి రఘునందన్‌రావు  టీఆర్ఎస్ తో హోరాహోరీగా త‌ల‌ప‌డి విజ‌యం సాధించిన విష‌యం విధిత‌మే.

అంత‌కు ముందు బీజేపీ అభ్య‌ర్థిగానే నాలుగుసార్లు దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ర‌ఘునంద‌న్‌రావు విజ‌యానికి ఆమ‌డ‌దూరంలో నిలిచారు. 2020 ఉపఎన్నిక‌లో మాత్రం అనూహ్యంగా పుంజుకొని విజ‌యం సాధించారు. తొలుత యెన్నెం శ్రీ‌నివాస‌రెడ్డి, ర‌ఘునంద‌న్‌రావులు ఇద్ద‌రూ టీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ కూడ టీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, దుబ్బాక ఉపఎన్నిక‌ల‌తో పోల్చితే హుజూరాబాద్‌లో తాము అధిక మెజార్టీ సాధిస్తామ‌నే ధీమాలో ఉన్నారు బీజేపీ నేత‌లు.  మ‌రోవైపు  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, దుబ్బాక ఫ‌లితం ఇక్క‌డ పున‌రావృతం కాద‌ని టీఆర్ఎస్ పేర్కొంటుంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ ద‌ళిత‌బంధు  ప‌థ‌కం  ప్ర‌వేశ‌పెట్టి ద‌ళిత ఓట‌ర్ల‌ను ఆక‌ర్శించింది. హుజూరాబాద్‌లో ఉద్య‌మ‌కారుడు గెల్లు శ్రీ‌నివాస్ భారీ మెజార్టీతో గెలుస్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేత‌లు. హుజూరాబాద్‌లో ఎవ‌రు గెలుస్తారో తెలియాలంటే న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాలి మ‌రి.






ఆ సెంటిమెంట్ ఈటల కొనసాగించేనా..?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>