PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huzurabad-by-elections6ecd93ff-877d-4b57-968b-650b3a4a332c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huzurabad-by-elections6ecd93ff-877d-4b57-968b-650b3a4a332c-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌చారానికి చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌ధాన పార్టీల నేత‌లు ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. దీంతో ఎలాగైనా గెల‌వాల‌ని చూస్తున్నాయి ప్ర‌ధాన పార్టీలు. ముఖ్య‌మంగా సీఎం కేసీఆర్ హుజురాబాద్‌ను టీఆర్ఎస్ ఖాతాలో వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ప్ర‌తిప‌క్షాలు ఈ ఉప ఎన్నిక‌లో కేసీఆర్‌కు షాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి 20 మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు హుజురాబాద్‌లో ప్ర‌చారం నిర్వ‌huzurabad bi pole{#}KCR;srinivas;Congress;Huzurabad;Telangana;Telangana Rashtra Samithi TRS;Minister;CM;Party;Bharatiya Janata Partyకేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ పోరు.. ఓట‌ర్ తీర్పు ఎటువైపు..?కేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ పోరు.. ఓట‌ర్ తీర్పు ఎటువైపు..?huzurabad bi pole{#}KCR;srinivas;Congress;Huzurabad;Telangana;Telangana Rashtra Samithi TRS;Minister;CM;Party;Bharatiya Janata PartyWed, 27 Oct 2021 07:53:08 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌చారానికి చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌ధాన పార్టీల నేత‌లు ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. దీంతో ఎలాగైనా గెల‌వాల‌ని చూస్తున్నాయి ప్ర‌ధాన పార్టీలు. ముఖ్య‌మంగా సీఎం కేసీఆర్ హుజురాబాద్‌ను టీఆర్ఎస్ ఖాతాలో వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ప్ర‌తిప‌క్షాలు ఈ ఉప ఎన్నిక‌లో కేసీఆర్‌కు షాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి 20 మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు హుజురాబాద్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.


  మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు కూడ గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కోసం పార్టీ నేత‌లే కాకుండా ఆమె స‌తీమ‌ణీ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి సీఎం కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు మాజి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకువెళ్తున్న ఈట‌ల.. హుజురాబాద్ ప్ర‌జ‌లంతా త‌న‌తోనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇక బండి సంజ‌య్ కూడా హుజురాబాద్‌ను బీజేపీ ఖాతాలో వేయ‌డానికి వ్యూహాలు ర‌చించి అమలు చేస్తున్నారు. బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు బండి సంజ‌య్‌.


 ఇక అంద‌రికంటే ఆఖ‌రుగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. హుజురాబాద్‌లో ఓటుబ్యాంకు సంపాదించుకోవ‌డానికి బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు బ‌ల్మూరి వెంక‌ట్‌. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంద‌ని వెంక‌ట్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది విద్యార్థులు, నిరుద్యోగుల కోసం అని కానీ, నేడు వారికి అన్యాయం జ‌రుగుతుంద‌ని వెంక‌ట్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక వెంక‌ట్ త‌ర‌ఫున ఆయన తల్లి బ‌ల్మూరి ప‌ద్మ ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.


 ఇలా ఎవ‌రికి వారే ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ప్ర‌చారానికి ఈ రోజే ఆఖ‌రు రోజు కావ‌డంతో ఓట్ల కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. హోరామోరీ ప్ర‌చారాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే ఓట‌ర్ల నాడి ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఈ పోరులో ఓట‌ర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.




 






కేసీఆర్ vs ఈటెల : కేసీఆర్ సభ లేదు.. ఇది ఇతర పార్టీలకు ప్లస్ అవుతుందా..?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>