PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendra2848f13d-6fa7-490d-84ac-ba171f3c3806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendra2848f13d-6fa7-490d-84ac-ba171f3c3806-415x250-IndiaHerald.jpg మ‌రో నాలుగు రోజుల్లో ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికి ఏపీతో లింకులు ఉన్నాయ‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ నుంచి గెలిచి.. మంత్రి ప‌ద‌విని పొందిన ఈట‌ల రాజేంద‌ర్‌కు.. అధికార పార్టీకి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం నేప‌థ్యంలో.. ఈట‌ల రాజీ నామా చేయ‌డం.. బీజేపీలోకి చేర‌డం.. ద‌రిమిలా ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు.. ఏపీకి మ‌ధ్య లింకేంటి? అనేది ఆసక్తిగా మారింది. ఒక‌వైపు ఈ ప‌రిణామంపై ఇక్క‌డ పోటీ చేసKCR Etela Rajendar{#}Guntur;Allu Sneha;Andhra Pradesh;Minister;Party;Bharatiya Janata Partyకేసీఆర్ VS ఈటెల: హుజూరాబాద్‌తో ఏపీకి లింకు.. ఏం జ‌రుగుతోంది..?కేసీఆర్ VS ఈటెల: హుజూరాబాద్‌తో ఏపీకి లింకు.. ఏం జ‌రుగుతోంది..?KCR Etela Rajendar{#}Guntur;Allu Sneha;Andhra Pradesh;Minister;Party;Bharatiya Janata PartyWed, 27 Oct 2021 09:12:30 GMTతెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లాలో ఉన్న‌ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ నెల 30న అంటే.. మ‌రో నాలుగు రోజుల్లో ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికి ఏపీతో లింకులు ఉన్నాయ‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ నుంచి గెలిచి.. మంత్రి ప‌ద‌విని పొందిన ఈట‌ల రాజేంద‌ర్‌కు.. అధికార పార్టీకి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం నేప‌థ్యంలో.. ఈట‌ల రాజీ నామా చేయ‌డం.. బీజేపీలోకి చేర‌డం.. ద‌రిమిలా ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు.. ఏపీకి మ‌ధ్య లింకేంటి? అనేది ఆసక్తిగా మారింది.

ఒక‌వైపు ఈ ప‌రిణామంపై ఇక్క‌డ పోటీ చేస్తున్న కీల‌క‌మైన పార్టీ బీజేపీ  ఒక వాద‌న వినిపిస్తుండ‌గా.. అధికార పార్టీ.. మ‌రో వివాదం తీసుకువ‌చ్చింది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీకి చెందిన బెట్టింగు రాయుళ్లు హుజూరాబాద్లో తిష్ఠ‌వేశార‌ని టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు. త‌ద్వారా.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయించేందుకే.. ఏపీలోని ఒక కీల‌క బీజేపీ నేత క‌నుస‌న్న‌ల్లో.. ఉభ‌య గోదావ‌రులకు చెందిన వ్యాపారాలు.. హైద‌రాబాద్‌లో కూర్చుని.. ఇక్క‌డ బెట్టింగులు న‌డిపిస్తూ.. ఈట‌ల‌వైపు మొగ్గు చూపేలా చ‌క్రం తిప్పుతున్నార‌ని.. టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. అయితే.. దీనిపై ఆధారాల‌ను మాత్రం వారు చూపించ‌లేక పోతున్నారు.

ఇక‌, బీజేపీ మ‌రో వాద‌న చేస్తోంది. ఏపీలో టీఆర్ ఎస్‌కు ఉన్న స్నేహ సంబంధాలు వినియోగించుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేలా.. వ్యూహ‌లు ర‌చిస్తోంద‌ని.. దీనికి ఏపీ నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని.. ప్ర‌చారం చేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో బీజేపీ కూడా ఎలాంటి ఆధారాల‌ను చూపించ‌లేక పోతోంది. కానీ, ఈ రెండు పార్టీలు చేస్తున్న ప్ర‌చారం మాత్రం వినేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ముందుకు వ‌స్తున్నారు. మ‌రోవైపు బెట్టింగులు జ‌రుగుతున్న‌ది వాస్త‌వ‌మేన‌ని.. ఒక్క ఉభ‌య గోదావ‌రి జిల్లాలే కాకుండా.. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాల‌కు చెందిన వారు కూడా వీటిలో ఉన్నార‌ని కొంద‌రు అంటున్నారు.

ఈ ప‌రిణామాలు.. ఇప్ప‌టికే ఉన్న హుజూరాబాద్ సంగ్రామ వేడిని మ‌రింత పెంచుతున్నాయి. ఇదే కొన‌సాగితే.. ప్ర‌జ‌లు అయోమ‌యానికి గురికావ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. చివ‌రి నిముషం వ‌ర‌కు.. ఎవ‌రికి వారు.. గెలుపు కోసం ప్ర‌య‌త్నించ‌డం త‌ప్పుకాద‌ని.. అయితే.. ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న విమ‌ర్శ‌ల కార‌ణంగా.. ఓట‌ర్ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తే.. ప్ర‌మాద‌మ‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో ఓటింగ్ శాతం పెరిగేలా.. బీజేపీ.. త‌గ్గేలా టీఆర్ ఎస్‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే మ‌రో వాద‌న కూడా వ‌స్తోంది.

 



బద్వేలు : వైసీపీ పై బీజేపీ గెలుస్తుందా ?

ఆ ఏడుగురితో మోడీ సమావేశం.. ఎందుకోసం?

చైనా నమ్మక ద్రోహం.. శ్రీలంక ఆగ్రహం?

ఈట‌ల‌కు అమిత్ షా భ‌రోసా..!

దెబ్బకు దెబ్బ కొట్టిన.. సైన్యం..!

కేసీఆర్ vs ఈటెల: ఓటుకు 20 వేలు... ఈటలకు నిరాశే?

కేసీఆర్ Vs. ఈటెల : హుజురాబాద్ లో ఆ పార్టీదే గెలుపా.. ?

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>