PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-433fcf88-9ff6-4010-8b20-d1aa6d2b4583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-433fcf88-9ff6-4010-8b20-d1aa6d2b4583-415x250-IndiaHerald.jpgతారహితంగా జనాన్ని ఫీల్చేస్తున్నాయి. దేశంలో ఒక్క కేరళలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో ధరల మంటలు ఇక ఏ మాత్రం భరించలేని స్థితికి సామాన్యుడి చేరుకున్న వాస్తవాన్ని కూడా గుర్తించ నిరాకరిస్తున్నాయి. దేశంలో ఒక కేరళ రాష్ట్రం మాత్రమే వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల భారం పడుతున్నా లెఫ్ట్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంప్రదింపులు తీసుకొని ఇంధన ధరల పెరుగుదల , తగ్గPolitical {#}Maha;Kerala;Bharatiya Janata Party;Diesel;Government;Minister;central governmentపెట్రో మంట మండిస్తున్న ప్రభుత్వాలు.. కారణం..!పెట్రో మంట మండిస్తున్న ప్రభుత్వాలు.. కారణం..!Political {#}Maha;Kerala;Bharatiya Janata Party;Diesel;Government;Minister;central governmentWed, 27 Oct 2021 21:42:00 GMT2014 ముందు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల విషయంలో ఖాళీ గ్యాస్ మొద్దులను ప్రదర్శిస్తూ , ఆటోలను,మోటార్ సైకిళ్లను తాళ్లతో లాగుతూ, రాస్తారోకో,భారత్ బంద్ లాంటి అస్త్ర శస్త్ర కార్యక్రమాలతో ధరల పెరుగుదలపై గగ్గోలు పెట్టిన మోడీ,స్మృతి ఇరానీ ఇలాంటి అనేక మంది బిజెపి నేతలు అధికారానికి రాచబాట లు వేసుకొని నేడు అంతకుమించిన ధరా  భారాలుమోపుతున్నారు. లీటర్ పెట్రోలు 111.18కి, లీటర్ డీజిల్ ధర104.32 కి పెంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండగా, ప్రజల ఆదాయాలు మాత్రం పాతాళానికి చేరుతున్నాయి. ఇవేమీ భారాలు మహా ప్రభో అంటూ జనాలు విలపిస్తుంటే, ఇంధనం పై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బుతోనే ప్రజలకు ఉచిత బియ్యం, వంటగ్యాస్, కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి  పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం విధించడం సరైందేనని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. మోడీ ఏలుబడికి ఏడేండ్లు  గడిచిపోయిన ఇంకా ఎంతకాలం తమ వైఫల్యాలకు సాకులు చెబుతారు.

చమురును జీఎస్టీ పరిధిలోకి తెస్తే తమ నిరవధిక దోపిడి సాగదు కనుక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం మానేసి వేర్వేరు పేర్లతో పన్నులు, సుంకాలు వడ్డించేస్తున్నాయి. ఏం చేసినా రాష్ట్రాలే చేయాలని కేంద్రం, ఆ పాపం మొత్తం పూర్తిగా కేంద్రానిదేనని రాష్ట్రాలు బాధ్యతారహితంగా జనాన్ని ఫీల్చేస్తున్నాయి. దేశంలో ఒక్క కేరళలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో ధరల మంటలు ఇక ఏ మాత్రం భరించలేని స్థితికి సామాన్యుడి చేరుకున్న వాస్తవాన్ని కూడా గుర్తించ నిరాకరిస్తున్నాయి. దేశంలో ఒక కేరళ రాష్ట్రం మాత్రమే వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల భారం పడుతున్నా లెఫ్ట్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంప్రదింపులు తీసుకొని ఇంధన ధరల  పెరుగుదల , తగ్గుదలను అదుపు చేయాలని వామపక్షాలు గతంలో రెండుసార్లు దేశ వ్యాప్త బంద్ ను విజయవంతంగా నిర్వహించాయి. ఇంతటి నిరంకుశత్వాన్ని పాలకులు ప్రజల పట్ల ప్రయోగిస్తే భవిష్యత్ ప్రజాగ్రహానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.



అభిమానులు మెచ్చేలా బాలకృష్ణ కొత్త గెటప్.. మాస్ కా బాప్..

ఆ విషయంలో తండ్రిని మించిన ఆకాష్ పూరీ..!!

ధీమాతో ఉన్న అంబటి...?

వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు

ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>