PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-and-bjp-war-ganesh-chaturdasi-issue24c090de-bed3-49b1-9ce7-f31ed31f11e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-and-bjp-war-ganesh-chaturdasi-issue24c090de-bed3-49b1-9ce7-f31ed31f11e5-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో బద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. రేప‌టితో ప్ర‌చార గ‌డువు ముగుస్తుంది. ఇక్క‌డ గెలుపు ఎవ‌రిది ? అన్న దానిపై అంద‌రికి ఇప్ప‌టికే ఓ క్లారిటీ ఉంది. అధికార వైసీపీ వ‌న్ సైడ్ గా గెలిచేస్తోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన దివంగ‌త మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ గెలుపు పై ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాండెట్ ఎంత మెజార్టీతో గెలుస్తారు ? ఇక్క‌డ రెండో స్థానంలో బీజేపీ ఉంటుందా ? కాంగ్రెస్ ఉYsrcp Bjp{#}Proddatur;sudha;Assembly;Congress;YCP;Bharatiya Janata Party;District;MLA;Party;Minister;CMబ‌ద్వేల్ బెట్టింగ్స్‌: వైసీపీ మెజార్టీ ఎంత‌... బీజేపీకి ఎన్ని ఓట్లు..!బ‌ద్వేల్ బెట్టింగ్స్‌: వైసీపీ మెజార్టీ ఎంత‌... బీజేపీకి ఎన్ని ఓట్లు..!Ysrcp Bjp{#}Proddatur;sudha;Assembly;Congress;YCP;Bharatiya Janata Party;District;MLA;Party;Minister;CMTue, 26 Oct 2021 17:57:42 GMTఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో బద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. రేప‌టితో ప్ర‌చార గ‌డువు ముగుస్తుంది. ఇక్క‌డ గెలుపు ఎవ‌రిది ? అన్న దానిపై అంద‌రికి ఇప్ప‌టికే ఓ క్లారిటీ ఉంది. అధికార వైసీపీ వ‌న్ సైడ్ గా గెలిచేస్తోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన దివంగ‌త మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ గెలుపు పై ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాండెట్ ఎంత మెజార్టీతో గెలుస్తారు ? ఇక్క‌డ రెండో స్థానంలో బీజేపీ ఉంటుందా ? కాంగ్రెస్ ఉంటుందా ? బీజేపీకి ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌నే దానిపై ఇక్క‌డ ప్ర‌ధానంగా బెట్టింగ్ లు న‌డుస్తున్నాయి.

వైసీపీ వాళ్లు త‌మ పార్టీ కి వ‌చ్చే మెజార్టీ మీద బెట్టింగులు క‌డుతున్నారు. ఇక బీజేపీ వాళ్ల‌కు గెలుపు ఆశ‌లు ఎలాగూ లేవు.. ఉండ‌వు కూడా..  అందుకే  బీజేపీ నేత‌లు త‌మ పార్టీ సాధించే ఓట్ల‌పైనే పందెం క‌డుతున్నారు. విచిత్రం ఏంటంటే బీజేపీ అగ్ర నేత‌లు ఇక్క‌డ మ‌కాం వేసి మ‌రీ గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు. ఇక కాంగ్రెస్ ఇక్క‌డ పోటీలో ఉన్నా అది మొక్కుబ‌డే అంటున్నారు. ఆ పార్టీ నుంచి ఇక్క‌డ 2009 లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే క‌మల‌మ్మ పోటీ చేస్తున్నారు.

ఇక బీజేపీ వాళ్లు అయితే త‌మ పార్టీ అభ్య‌ర్థికి ఇక్క‌డ 18,500 ఓట్ల‌కు పైనే వ‌స్తాయ‌ని పందేలు కాస్తున్నారు. ఇక వైసీపీ వాళ్లు అయితే వైసీపీకి 80 వేల మెజార్టీ వ‌స్తుంద‌ని భారీగా పందేలు క‌డుతున్నారు. క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల మ‌డుగు - ప్రొద్దుటూరు కేంద్రాలుగా ఈ బెట్టింగ్‌లు న‌డుస్తున్నాయంటున్నారు. ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో వైసీపీకి 4 ల‌క్ష‌ల మెజార్టీ రాద‌ని బీజేపీకి చెందిన ఓ మాజీ మంత్రి బెట్టింగ్ కాసి ఏకంగా రు. 5 కోట్లు గెలుపొందార‌ట‌. ఇప్పుడు ఆయ‌న కూడా ఇక్క‌డ బీజేపీకి 18500 ఓట్లు వ‌స్తాయ‌ని పందేలు కాస్తున్నార‌ట‌.

 



మెగా వేరు... అల్లు వేరు.. క్లారిటీ ఇచ్చేశారుగా...!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?

బ్రేకింగ్: మాల్దీవుల టూర్ పై పట్టాభి రియాక్షన్

బిగ్ బాస్ 5 : ప్రియా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>