PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19af92a3-05e9-443b-b5e6-2e92cee94252-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19af92a3-05e9-443b-b5e6-2e92cee94252-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయినా సరే వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల నిరసన చేసే రైతులపై దారుణం జరిగిన నేపధ్యంలో దీనిపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లఖింపుర్‌ ఖేరి ఘటన పై సుమోటో గా నమోదు చేసిన కేసు విచారించిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన సీజేఐ ధర్మాసనం... నాలుగైదు వేల మంది ఉంటే 23 మంది సాక్షులే దొరికారా అని నిలదీసింది. 164 నిబcourt{#}central government;Wife;Lawyer;Governmentరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్...?రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్...?court{#}central government;Wife;Lawyer;GovernmentTue, 26 Oct 2021 13:07:17 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయినా సరే వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల నిరసన చేసే రైతులపై దారుణం జరిగిన నేపధ్యంలో దీనిపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లఖింపుర్‌ ఖేరి ఘటన పై సుమోటో గా నమోదు చేసిన కేసు విచారించిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన సీజేఐ ధర్మాసనం... నాలుగైదు వేల మంది ఉంటే 23 మంది సాక్షులే దొరికారా అని నిలదీసింది.

164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారని ప్రశ్నలు వేసింది. సాక్షుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న సుప్రీంకోర్టుకు... 60 మందిని సాక్షులుగా గుర్తించినట్లు యూపీ ప్రభుత్వ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చారని అన్నారు. గాయపడిన వారెవరైనా సాక్షుల్లో ఉన్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విలేకరి కశ్యప్‌, శ్యామ్‌సుందర్‌ మృతిపై విచారణ నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ముగ్గురు కీలక నిందితుల పేర్లను శ్యామ్‌సుందర్‌ భార్య కోర్ట్ కి చెప్పింది.

కీలక నిందితుల విషయం ఏం చేశారో చెప్పాలన్న సుప్రీంకోర్టు... విచారణ వేగవంతం చేస్తారా? లేదా ఉత్తర్వులు ఇవ్వాలా?  అని సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షులకు పూర్తి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తగిన నియమావళి అనుసరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాక్షుల వాంగ్మూలాలను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. 164 కింద వాగ్మూలం నమోదు వేగవంతం చేయాలని... ఫోరెన్సిక్ ల్యాబ్ లు కూడా తమ పరిశోధన వేగవంతంగా నిర్వహించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.



శ్రీ‌కాకుళం వార్త : ఆ సీఐ కు అంతా తెలుసు

బిగ్ బాస్ 5: గుండెల్లో అంత బాధ పెట్టుకుని "ఎలా నవ్వుతున్నావ్ షన్నూ" ?

చంద్రబాబు ఎగ్గొట్టిన లెక్కలు చెప్పిన జగన్...?

కేసీఆర్‌కు ఏపీ మంత్రి కౌంట‌ర్‌

భారత్ - పాక్ మధ్య టీ20 సిరీస్.. 15 మిలియన్ డాలర్ల ప్రైజ్ : పీటర్సన్

షారుక్ టార్గెట్‌.. స‌మీర్ వాంఖ‌డే?

జగన్ : అడ్డంగా బుక్కయిపోయాడే!

పెళ్లి విషయంలో త్రిష ఎందుకు వెనకడుగు వేస్తోంది?

ష‌ర్మిల‌తో వైసీపీ నేత‌ల వ‌రుస భేటీలు... ఏదో తేడా కొడుతోంది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>