PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan6cf67473-cd80-4c9a-9e49-e54d0c1c9f0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan6cf67473-cd80-4c9a-9e49-e54d0c1c9f0d-415x250-IndiaHerald.jpgపవన్ చాలా కాలం తరువాత ఉత్తరాంధ్రా రూట్ పట్టారు. పవన్ ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని అంతా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎట్టకేలకు ఇపుడు విశాఖ బాట పట్టారు. పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో పర్యటిస్తారు. ఆయన తొలి రోజు అంటే ఈ నెల 31న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా అక్కడ గేట్ దగ్గర జరిగే మీటింగులో పాల్గొంటారు pawan{#}Vishakapatnam;YCP;war;kalyan;Governmentవిశాఖలో పవన్ పొలిటికల్ వార్... ?విశాఖలో పవన్ పొలిటికల్ వార్... ?pawan{#}Vishakapatnam;YCP;war;kalyan;GovernmentTue, 26 Oct 2021 19:46:08 GMTపవన్ చాలా కాలం తరువాత ఉత్తరాంధ్రా రూట్ పట్టారు. పవన్ ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని అంతా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎట్టకేలకు ఇపుడు విశాఖ బాట పట్టారు.  ఈ నెల 31వ తేదీ నుంచి పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో పర్యటిస్తారు.

ఆయన తొలి రోజు అంటే ఈ నెల 31న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా అక్కడ గేట్ దగ్గర జరిగే మీటింగులో పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. పవన్ ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇపుడు పెద్ద రాజకీయ చర్చగా ఉంది. ఈ నెల 2న ఆయన రాజమండ్రిలో చేసిన ఉపన్యాసం చూసిన తరువాత పవన్ సీరియస్ నెస్ ఏంటో అందరికీ తెలిసింది. అదే విధంగా చూస్తే పవన్ మరో మారు తన బాణాలను ఎక్కుపెడతారు అంటున్నారు. ఆయన ఈసారి కూడా వైసీపీనే టార్గెట్ చేసుకుంటారు అని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంతా సిధ్ధమవుతూంటే ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నదే పవన్ మార్క్ ప్రశ్నించడం గా ఉంటుంది అంటున్నారు.

ఇక పవన్ ఉత్తరాంధ్రాలో పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారుల సమస్యల మీద తరువాత రెండు రోజుల పర్యటనలో మాట్లాడతారు. వారి సమస్యల మీద వైసీపీ సర్కార్ ని నిలదీస్తారు అని చెబుతున్నారు. జీవో  217 ని రద్దు చేయాలన్న మత్య్సకారుల డిమాండ్ కి పవన్ మద్దతు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి పవన్ ఓటమి చెందిన రెండున్నరేళ్ల తరువాత విశాఖ గడ్డ మీద నుంచి గట్టిగా గర్జించనున్నారు. ఆయన ఈసారి పేల్చే పొలిటికల్  డైలాగులు ఎలా ఉంటాయి. అవి ఏపీలో రాజకీయ మంటలను ఎలా రాజేస్తాయి అన్నది చూడాల్సిందే. మొత్తానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ వార్ ని విశాఖ నుంచే స్టార్ట్ చేశారు అంటున్నారు.





జగన్ : అయ్యగారి అపాయింట్మెంట్ దొరికిందోచ్!

ఇండియన్ నావిలో సైలర్ పోస్టులు.. ఖాళీలు, వివరాలు..

దేవరకొండ బ్రదర్ కోసం అల్లు అర్జున్!!

హుజూర్ ఉప ఎన్నిక రేపటితో ప్రచారం ముగింపు.. గెలుపెవరిది..?

పదిరోజుల గ్యాప్ లో రెండు.. నాగ శౌర్య కు వర్కౌట్ అయ్యేనా!!

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది.. ఉద్యోగం ఊడింది?

రుతు రాజ్ కు ప్ర‌మోష‌న్ ! ఏకంగా కెప్టెన్

ఫ్యాన్స్ ర‌గ‌డ : ష‌మీ నుంచి కోహ్లి పైకి?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడినట్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>