Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-41039fbf-4458-467c-99ff-3c444224fa3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-41039fbf-4458-467c-99ff-3c444224fa3f-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏ విషయం కావాలన్నా కూడా సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు. కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా ఎంతో ప్రమాదకరం గా మారిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియడం లేదు. అంతేకాదు ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న కొన్ని వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే సోషల్ మీడియాలో వార్తలు ప్రజలలో మరింతVaccine {#}Telangana;News;Coronavirus;mediaటీకా వేసుకోకపోతే రేషన్, పింఛన్ బంద్.. క్లారిటీ వచ్చేసింది?టీకా వేసుకోకపోతే రేషన్, పింఛన్ బంద్.. క్లారిటీ వచ్చేసింది?Vaccine {#}Telangana;News;Coronavirus;mediaTue, 26 Oct 2021 15:06:37 GMTనేటి రోజుల్లో   సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏ విషయం కావాలన్నా కూడా సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు. కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా ఎంతో ప్రమాదకరం గా మారిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియడం లేదు. అంతేకాదు ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న కొన్ని వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే సోషల్ మీడియాలో వార్తలు ప్రజలలో మరింత భయాందోళనలు పెంచాయి.



 ఇక వ్యాక్సిన్ విషయంలో ప్రజలందరిలో అనుమానాలు అపోహలు పెరిగి పోవడానికి కూడా అటు సోషల్ మీడియానే కారణం అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు ప్రసారం కావడంతో ఇక అది నిజమే అని నమ్మి వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎంతో మంది ప్రజలు ఇప్పటికీ కూడా దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవలే ఇక వ్యాక్సిన్ కు సంబంధించి ఒక వార్తా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక వ్యాక్సినేషన్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి రేషన్, పెన్షన్ కూడా నిలిపి వేయాలి అని అనుకుంటుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.



 సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్త ప్రజలందరినీ కాస్త భయాందోళనకు గురి చేసింది అని చెప్పాలి. అయితే వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్, పింఛన్ నిలిపివేయడం ఏంటి అని కొంతమంది ఆశ్చర్యపోయారు కూడా. ఇక తాజాగా ఈ విషయంపై తెలంగాణ డి హెచ్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. టీకా తీసుకోకపోతే రేషన్ పింఛన్ నిలిపివేస్తామని అంటూ వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మి భయాందోళనకు గురి కావద్దు అంటూ సూచించారు. ఇక ఈ విషయంపై క్లారిటీ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



హీరోయిన్ సిల్క్ స్మిత తనకిష్టమైన ఫోటో వైరల్..?

ఢిల్లీ డ్రామాలో గెలుపు బాబుదే!

RRR స్పెషల్ సర్ప్రైజ్ ఏరోజు అంటే?

జ‌గ‌న్‌కు కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌..!

రంగస్థలం హ్యాంగోవర్ లోనే సుకుమార్!!

చైనాలో.. పిల్లలకు మొదలైన టీకాలు.. !

"సాహో" డైరెక్టర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవేనా ?

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

షోలో షకీలా కాళ్ళు పట్టుకున్న సంపూర్ణేష్ బాబు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>