CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cheating-e8582985-7e2e-46b4-8412-e9aeb8703edc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cheating-e8582985-7e2e-46b4-8412-e9aeb8703edc-415x250-IndiaHerald.jpgఓ కానిస్టేబుల్ ప్రేమిస్తున్నానని చెప్పి యువతిని లోబర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని శారీరంగా కలిశాడు. చివరకు ఇంట్లో పెళ్లి సంబంధం వచ్చిందని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.cheating {#}sathish;Traffic police;Police Station;police;Father;marriageప్రియురాలిని మోసం చేసిన కానిస్టేబుల్.. మరొకరితో పెళ్లికి రెడీ..!ప్రియురాలిని మోసం చేసిన కానిస్టేబుల్.. మరొకరితో పెళ్లికి రెడీ..!cheating {#}sathish;Traffic police;Police Station;police;Father;marriageTue, 26 Oct 2021 11:15:00 GMTఓ కానిస్టేబుల్ ప్రేమిస్తున్నానని చెప్పి యువతిని లోబర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని శారీరంగా కలిశాడు. చివరకు ఇంట్లో పెళ్లి సంబంధం వచ్చిందని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూల్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువారూల్ జిల్లాలోని ఇళవన్‌కారాకుడి గ్రామానికి చెందిన సతీష్ (24 ఏళ్లు) కానిస్టేబుల్. తిరువారూర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

పెట్రోలింగ్ విధులు నిర్వహించేటప్పుడు వానమికపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిని. సతీష్‌కు ఆస్పత్రి దగ్గర డ్యూటీ వేయడంతో సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సతీష్ ఆ యువతిని పెళ్లి చేసుకుందామనని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాడని చెప్పేసరికి యువతి కూడా సతీష్‌కు శారీరకంగా సహకరించింది. అయితే.. ఇటీవల సతీష్ తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చారు. ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో సతీష్‌ను నిలదీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో అమ్మాయితో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావని అడిగింది. దీంతో సతీష్ ఆమెను బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని హెచ్చరించాడు.

దీంతో ఆ యువతి తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే తిరువారూర్ మహిళా పోలీస్ట్ స్టేషన్‌ను వెళ్లి సతీష్‌పై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. సతీష్‌పై తగిన చర్యలు తీసుకుని తనతో పెళ్లి జరిపించాలని యువతి పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సతీష్ పరారీలో ఉన్నాడు. త్వరలో నిందితుడిని అదుపులో తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, నిందితుడి తండ్రి కూడా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు.



ష‌ర్మిల‌ను బాబాయ్ వైవి క‌లిసింది అందుకేనా... !

బ్రేకింగ్: వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్ కట్, కేసీఆర్ సంచలనం...!

ప్రభాస్‌కు పెళ్లయినా.. పిల్లలు పుట్టరంట..!?

ఆ కంటెస్టెంట్ నామినేషన్స్ కోసమే వచ్చాడా..??

బద్వేలు : వైసీపీ నాటకం..ఎందుకు?

బ్రహ్మీ మళ్లీ బిజీ...? శ్రీను వైట్ల నుంచి ఫోన్...?

అమ్మాయి+ బాబాయ్ = రహస్య భేటీ ఆంతర్యం ఏమి..?

అనసూయ ఎంపిక పై తమ్మన్న అసంతృప్తి !

హుజురాబాద్ లో బీజేపీ బిజీ బీజీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>