WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4454ce79-f68f-49dd-a4d1-f541a1643e9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4454ce79-f68f-49dd-a4d1-f541a1643e9e-415x250-IndiaHerald.jpgజీవితమనే పయనంలో ప్రతి మనిషికి నిరంతరం ఏవో ఒక బంధాలు పెనవేసుకొంటాయి. ఆ బంధాలు మన జీవిత గమ్యాన్ని భవిష్యత్తును నిర్ణయిస్తాయి అనడంలో అనుమానం లేదు. బంధాలు అనేవి ఎంతకొంత వ్యక్తి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. మొదట తల్లి తండ్రులు, స్నేహితులు, భార్య భర్తలు, పిల్లలు ఇలా ఎన్నో బంధాలు మన చుట్టూ అల్లుకుంటాయి. ఏ బంధమైనా సరే అది మనకు బలం కావాలి.VIJAYAM MEEDHE{#}jeevitha rajaseskhar;Wifeవిజయం మీదే: బంధువులకు మీ వల్ల బాధ కలుగుతోందా?విజయం మీదే: బంధువులకు మీ వల్ల బాధ కలుగుతోందా?VIJAYAM MEEDHE{#}jeevitha rajaseskhar;WifeMon, 25 Oct 2021 21:31:18 GMTజీవితమనే పయనంలో ప్రతి మనిషికి నిరంతరం ఏవో ఒక బంధాలు పెనవేసుకొంటాయి. ఆ బంధాలు మన జీవిత గమ్యాన్ని భవిష్యత్తును నిర్ణయిస్తాయి అనడంలో అనుమానం లేదు. బంధాలు అనేవి ఎంతకొంత వ్యక్తి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. మొదట తల్లి తండ్రులు, స్నేహితులు, భార్య భర్తలు, పిల్లలు ఇలా ఎన్నో బంధాలు మన చుట్టూ అల్లుకుంటాయి. ఏ బంధమైనా సరే అది మనకు బలం కావాలి. కానీ మన బలహీనం మాత్రం కాకూడదు. అప్పుడే కోరుకున్న గమ్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకోగలం. మన ప్రయత్నం, కష్టం ఎంత ఉన్నా మన వెన్నంటే ఉండే వారు మనకు తోడుంటూ దైర్యం చెబుతూ ప్రోత్సాహం అందించకపోతే ఆ లోటు అలానే ఉంటుంది. వారు మనకు సహాయం చేయక పోయినా పర్వాలేదు. కానీ వారి మాటలతో, చేస్టలతో మన మానసిక స్థితిని డిస్టర్బ్ చేస్తే మాత్రం అది వారి లక్ష్యంపై ప్రభావం చూపుతుంది.

ఇది చాలామంది ఇళ్ళల్లో జరిగేదే, కానీ దాని పర్యవసానం తెలియక చాలా మంది చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చేసి వారి సొంత వారికే ఆటంకాలు తెచ్చిపెడుతుంటారు. ఉదాహరణకు చాలామంది ఇళ్ళల్లో తరచూ ఇంటి సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతుంటాయి ఇవి చాలా సర్వ సాధారణం. కానీ అప్పటికి ఇవి చాలా చిన్నవి అనిపించినా రేపటి రోజున మళ్ళీ పెద్ద సమస్యలుగా మారే అవకాశం లేకపోలేదు. కొన్ని సార్లు మన విజయానికి ఆటంకం కూడా కలిగిస్తాయి. తద్వారా మన భవిష్యత్తు కూడా అదుపుతప్పి  నాశనం అయిపోయే అవకాశం ఉంది. బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చాక ఒక చిన్న చిరునవ్వు, ఆనందంగా పలకరించే పలకరింపు కాస్త ప్రోత్సాహం లేకపోతే ఇక ఆ వ్యక్తి మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది.

ఇదలా ఉంచితే వారు మీతో సన్నిహితంగా, సానుకూలంగా లేకపోయినా పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా విసుక్కుంటూ నిందిస్తూ పోతే అది ఎదుటి వారి మనసుని, మానసిక స్థితిని చాలా కృంగదీస్తుంది. అలాంటి సమయంలో ఇక వారు ఎలా తమ భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ వారికి మీరు బలం అవ్వాలి. మీ మాటలు వారికి స్ఫూర్తిని అందించాలి అంతే కానీ  అసంతృప్తి మిగిల్చకూడదు. అనవసరమైన ఆలోచనలతో బాధపడేలా చేయకూడదు. వీలైనంత వరకు వారికి అండగా నిలవండి. సంతోషంగా ఉండడానికి కారణం అవ్వండి.



భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయుష్మాన్ ఖురానా భార్య !!

కష్టాల కడలిలో వరంగల్ పత్తి రైతులు.. ఏం..?

చైనా నుంచి ఎగిరే సూపర్ కార్..

BB5: ఆరు వారాలకు ప్రియా అంత రెమ్యూనరేషన్ తీసుకుందా !!

రజనీ సర్... దాదాయే మరి... ?

ఈసారి ఎన్సిబి విచారణకు రాని అనన్య..

అసలు కొత్త బట్టలు, నగలు ఎప్పుడు కొనాలో తెలుసా ?

స‌మంత తీర్పు మ‌ళ్లీ వాయిదా..!

బ్రేకింగ్: వాలంటీర్ రేప్ పై... వాసిరెడ్డి పద్మ స్పీడ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>