TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-559fdcb90-91ef-40b2-88b6-13dd6d44a389-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-559fdcb90-91ef-40b2-88b6-13dd6d44a389-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఇపుడు 7 వ వారం కూడా పూర్తయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ కి వచ్చిన నటి ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో మరో లేడీ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకు వెళ్ళగా మెల్ల మెల్లగా హౌజ్ లో మహిళల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒక్క నట్ రాజ్ మాస్టర్ తప్ప మిగిలిన 6 మంది మహిళలే కావడం గమనార్హం. TELUGU-BIGG-BOSS-SEASON-5{#}jagapati babu;maanas;swetha;Film Industry;Winner;Amitabh Bachchan;ravi anchor;Episode;sree;Bigboss;Master;raj;Hindi;Teluguబిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?బిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}jagapati babu;maanas;swetha;Film Industry;Winner;Amitabh Bachchan;ravi anchor;Episode;sree;Bigboss;Master;raj;Hindi;TeluguMon, 25 Oct 2021 11:00:00 GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఇపుడు 7 వ వారం కూడా పూర్తయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ కి వచ్చిన నటి ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో మరో లేడీ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకు వెళ్ళగా మెల్ల మెల్లగా హౌజ్ లో మహిళల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒక్క నట్ రాజ్ మాస్టర్ తప్ప మిగిలిన 6 మంది మహిళలే కావడం గమనార్హం. సరయు, ఉమ దేవి, హామీద, లహరి, శ్వేత వర్మ ఇపుడు ప్రియ ఇలా మొత్తం ఆరు మంది మహిళలు హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్ సీక్వెన్స్ చూస్తుంటే చివరకు గెలిచేది మేల్ కంటెస్టెంట్ నే అని ఆలోచన అందరికీ వస్తోంది. యాని మాస్టర్ చెప్పినట్టు హౌజ్ లో మేల్ కంటెస్టెంట్స్ ను టార్గెట్ చేయాల్సిందే.

అలా చూస్తే బిగ్ సీజన్ 5 విజేత ఎవరు అన్న ప్రశ్న వేస్తే...మొదట శ్రీ రామ్,  సన్ని, రవి ల పేర్లు వినిపిస్తుండగా ఆ తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ లో యాని మాస్టర్ ఇంకా మానస్ ల పేర్లు విపిస్తున్నాయి. మరి సీజన్ 5 విన్నర్ ఎవరన్న విషయంపై ఓ క్లారిటీ రావాలంటే ఇంకో మూడు, నాలుగు వారాలు గడవాల్సిందే. ఈ విషయం అలా ఉంచితే నిన్న ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటకు వెళ్లిన ప్రియ నటిగా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితురాలే. ఇక ఈమె రియల్ లైఫ్ విషయానికి వస్తే...ఈమె సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు. 1997 సంవత్సరం లో జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన "దొంగాట" చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు ప్రియ.

ఇక అప్పటి నుండి ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో నటిస్తూ అవకాశాలను అందుకుంటున్నారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి హీరోల చిత్రాలలో ఈమె ప్రముఖ పాత్రలు పోషించారు. హిందీలోనూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 60 కు పైగా సినిమాల్లో నటించారు ప్రియ. ఈమె అసలు పేరు శైలజ ప్రియ.



కార్తీక‌దీపం మోనిత పెళ్లి ఫిక్స్‌.. వ‌రుడు ఆ హీరోనే..!

అదే చంద్రబాబుకు మైనస్సా ?

బిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?

తెలంగాణ‌-ఛ‌తీస్‌గ‌డ్‌ స‌రిహ‌ద్దుల్లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మృతి

భార్య కాపురానికి రాలేదని.. భర్త చేసాడో తెలుసా?

హుజురాబాద్‌లో అభివృద్ధి Vs సానుభూతి!

మా గొడవలు సమసిపోయినట్టేనా..?

ఆంధ్రా హీరో కేసీఆర్ ?

నాలో నాకు నచ్చేది అదే : శృతిహాసన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>