PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a46988da-5c1f-44e9-b87d-5af782c953f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a46988da-5c1f-44e9-b87d-5af782c953f0-415x250-IndiaHerald.jpgసస్యశ్యామలం చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్ట్ ను రికార్డు ఈ సమయంలో పూర్తి చేశారు. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మరోసారి అధికార పగ్గాలు దక్కించుకున్నారు. ఈసారి ప్రభుత్వ అధినేతగా వారి సంస్కరణలకు తెరలేపారు. ధరణి,దళిత బందు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు. పార్టీపరంగా సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్గా ఫోకస్ పెట్టారు. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు కమిటీలను నియమించి రాబోయే ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ రోజు నిర్వహించే ప్లీనరీ ద్వారా పార్టPolitical {#}HOSTA;Success;Prasthanam;Congress;Andhra Pradesh;November;Telangana;KCR;Partyతెరాస 20 ఏళ్ల ప్రస్థానం.. జరిగిందేమీ..!తెరాస 20 ఏళ్ల ప్రస్థానం.. జరిగిందేమీ..!Political {#}HOSTA;Success;Prasthanam;Congress;Andhra Pradesh;November;Telangana;KCR;PartyMon, 25 Oct 2021 09:05:00 GMT ఉద్యమ పోటీగా పురుడు పోసుకుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ కలను సాకారం చేసుకుంది. అనంతరం రెండుసార్లు అధికారాన్ని హస్త గతం చేసుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.  ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న హైదరాబాదులోని జలదృశ్యం లో తెలంగాణ రాష్ట్ర సమితి ని ప్రకటించారు. తెలంగాణ సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

 చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో టిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అలా ఉద్యమ పార్టీగా మొదలైన టిఆర్ఎస్ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తిచేసుకుని ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. టిఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్  ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాజకీయంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. కానీ ఆరు నెలలు తిరక్కుండానే యూపీఏకు గుడ్ బై చెబుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేశారు. సెంటిమెంట్ను రగిలించేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు. ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ సెంటిమెంటును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకొని బరిలోకి దిగారు కేసీఆర్. ఆ ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర సాధన ఉద్యమ గతిని మార్చింది. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు,రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్ట్ ను రికార్డు ఈ సమయంలో  పూర్తి చేశారు. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మరోసారి అధికార పగ్గాలు దక్కించుకున్నారు. ఈసారి ప్రభుత్వ అధినేతగా వారి సంస్కరణలకు తెరలేపారు.

ధరణి,దళిత బందు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు. పార్టీపరంగా సంస్థాగతంగా  బలోపేతం చేసే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్గా ఫోకస్ పెట్టారు. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు  కమిటీలను నియమించి రాబోయే ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ రోజు నిర్వహించే ప్లీనరీ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ఎన్నిక కానున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా కార్యకర్తలు వ్యవహరించాల్సిన తీరు పై సూచనలు చేయనున్నారు.



ఆంధ్రా ద్వేషం పోయిందా కేసీఆర్?

భర్త : నన్ను జైల్లో పెట్టండి.. మహాప్రభో..!

హుజూరాబాద్ లో గులాబీ వికసిస్తుందా..?

పాక్ తో ఓటమి తర్వాత.. టీమిండియాకు మరో షాక్?

అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

ఉల్లిద్వారా.. ఉలిక్కిపడ్డ అమెరికా..!

కేసీఆర్ గుండెలపై తన్నాడు : ఈటలపై హరీష్ ఫైర్

హుజురాబాద్‌ గులాబీదళంలో సిలివేరు గుబులు!?

వైరల్ : మ్యాచ్ అనంతరం.. పాక్ క్రికెటర్ల తో మాట్లాడిన ధోని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>