MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/omkar3746be3a-d03c-4a71-8f2d-7c9ac69603df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/omkar3746be3a-d03c-4a71-8f2d-7c9ac69603df-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై యాంకర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎలాంటి కార్యక్రమమైనా.. ఈ యాంకర్స్ ఉంటే చాలు షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. దశాబ్దకాలంలో అద్భుతమైన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఓంకార్ ఒకరు. ఓంకార్.. యాంకర్, నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.omkar{#}Ohmkar;you tubeఓంకార్ విశ్వరూపం తెలిస్తే షాక్.. వినోద్ షాకింగ్ కామెంట్స్..!ఓంకార్ విశ్వరూపం తెలిస్తే షాక్.. వినోద్ షాకింగ్ కామెంట్స్..!omkar{#}Ohmkar;you tubeMon, 25 Oct 2021 10:28:35 GMTతెలుగు బుల్లితెరపై యాంకర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎలాంటి కార్యక్రమమైనా.. ఈ యాంకర్స్ ఉంటే చాలు షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. దశాబ్దకాలంలో అద్భుతమైన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఓంకార్ ఒకరు. ఓంకార్.. యాంకర్, నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి.. ఇండస్ట్రీకి చాలా మంది ఆర్టిస్టులను, డ్యాన్సర్లను అందించారు. ఓంకార్‌ ‘ఆట’ అనే షోకి యాంకర్‌గా నిర్వహించిన విషయం విదితమే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా షో ద్వారా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ సెటిల్ అయిన వారిలో వినోద్ ఒకరు.

కొరియోగ్రాఫర్‌గా వినోద్ మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌లో వినోద్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో వినోద్.. ఓంకార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఓంకార్‌తో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. రానురాను తనకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కారణాన్ని తెలిపారు. ఓంకార్ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం తన స్వార్థం కోసమే బంధాలను కొనసాగిస్తాడని పేర్కొన్నారు. అవసరం ఉన్నంతవరకే అనుబంధాలను కలిసి ఉంటాడని.. అవసరం లేనప్పుడు పట్టించుకోడన్నారు. ఇలా తనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

ఓంకార్ తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటాడని వినోద్ తెలిపారు. అలాంటి వారిలో తాను ఒక్కడినని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇద్దరి మధ్య మాటలు లేవన్నారు. కాగా.. ఓంకార్‌పై వినోద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న వాళ్లు ఓంకార్ నిజంగా ఇలాంటి వారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కామెంట్‌పై ఓంకార్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఓంకార్ పలు కార్యక్రమాల్లో యాంకర్‌గా రాణిస్తున్నారు. అలాగే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కేటిఆర్ అందుకే పెట్టారా ...?

ఆంధ్రా ద్వేషం పోయిందా కేసీఆర్?

రేవంత్ రెడ్డి.. మరో రాజశేఖర్‌రెడ్డి అవగలరా..?

భర్త : నన్ను జైల్లో పెట్టండి.. మహాప్రభో..!

హుజూరాబాద్ లో గులాబీ వికసిస్తుందా..?

పాక్ తో ఓటమి తర్వాత.. టీమిండియాకు మరో షాక్?

అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

ఉల్లిద్వారా.. ఉలిక్కిపడ్డ అమెరికా..!

కేసీఆర్ గుండెలపై తన్నాడు : ఈటలపై హరీష్ ఫైర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>