Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-5f025e6d-a41f-45d7-8180-8ea5a8ec7eb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-5f025e6d-a41f-45d7-8180-8ea5a8ec7eb8-415x250-IndiaHerald.jpgదక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సాయి పల్లవి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే అన్న భావనను పటాపంచలు చేస్తూ తన నటనతోనే ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం సాయిపల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది అన్న భావన తెలుగు ప్రేక్షకులందరూ వచ్చేసింది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు వెండి తెరపై చూపిTollywood {#}Hushaaru;college;Premam;V;Fidaa;Silver;Sai Pallavi;Love Story;Blockbuster hit;Audience;bhavana;Girl;Heroine;Telugu;Cinemaమొటిమల గురించి భయపడేదాన్ని.. ఓపెన్ అయిన సాయి పల్లవి?మొటిమల గురించి భయపడేదాన్ని.. ఓపెన్ అయిన సాయి పల్లవి?Tollywood {#}Hushaaru;college;Premam;V;Fidaa;Silver;Sai Pallavi;Love Story;Blockbuster hit;Audience;bhavana;Girl;Heroine;Telugu;CinemaSun, 24 Oct 2021 16:15:00 GMTదక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సాయి పల్లవి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే అన్న భావనను పటాపంచలు చేస్తూ తన నటనతోనే ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం సాయిపల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది అన్న భావన తెలుగు ప్రేక్షకులందరూ వచ్చేసింది.  ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఈ అమ్మడు వెండి తెరపై చూపించే అభినయం హుషారు మామూలుగా ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నేచురల్ బ్యూటీగా కూడా సాయి పల్లవి పేరు తెచ్చుకుంది. ఫిదా అనే సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలు అందుకుంది. ఇటీవలే లవ్ స్టోరీ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ సొగసరి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు వెంటాడే వి అంటూ చెప్పుకొచ్చింది.



 తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని.. ఇక అప్పుడు తాను ఓ వైపు చదువు కొనసాగిస్తూనే..  సినిమాలు చేస్తూ వచ్చాను అంటూ తెలిపింది. ఇక ఆ సమయంలో ఒక సగటు అమ్మాయి లాగానే తనకు కూడా  అందం విషయంలో కొంత భయం ఉండేదని.. మనసులో మాట బయట పెట్టింది. అప్పటి వరకు తాను చూసిన హీరోయిన్లు మొత్తం ముఖం పై ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఎంతో అందంగా కనిపించే వారిని.. అలాంటిది తన ముఖం పై మొటిమలు ఉండడంతో భయమేసింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ముఖం పై ఉన్న మొటిమలు గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకుంటారో అని అనుకున్నాను. కానీ ప్రేమమ్ సినిమా విడుదలైన తర్వాత ఆలోచనలన్నీ కూడా తప్పు అన్నది అర్థమైంది. ప్రేక్షకులు చూసేది నటన కానీ మొటిమలు కాదు అన్న విషయం అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.



'పెళ్లి సందD' హీరోయిన్ కు వరుస అవకాశాలు?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>