TechnologyChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/citytransformer-a8d27745-ef49-422c-bed4-a8c29bcf4013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/citytransformer-a8d27745-ef49-422c-bed4-a8c29bcf4013-415x250-IndiaHerald.jpgసాంకేతికత పెరిగిన తరువాత మనిషి ప్రయాణించడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయం పెరుతున్నవారు సొంత వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వాహనాలు ఎలాగూ ఉంటూనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి బాగా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. దీనితో వీలైనంత చిన్న కార్లను అదికూడా పార్కింగ్ కు సమస్యలేని అంత చిన్న కార్లను రూపొందించడంలో అనేక సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నానో కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలలో కూడా అనేక సంస్థలు ఈ తరహా అతిచిన్న కార్ల తయారీ చేస్తున్నాయి. తద్వారా వాహనదారులకు పార్కింగ్citytransformer;{#}Denmark;Europe countries;pollution;vehicles;Car;Coronavirusసిటీ ట్రాన్స్.. బుల్లి కారు..!సిటీ ట్రాన్స్.. బుల్లి కారు..!citytransformer;{#}Denmark;Europe countries;pollution;vehicles;Car;CoronavirusSun, 24 Oct 2021 17:08:17 GMTసాంకేతికత పెరిగిన తరువాత మనిషి ప్రయాణించడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయం పెరుతున్నవారు సొంత వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వాహనాలు ఎలాగూ ఉంటూనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి బాగా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. దీనితో వీలైనంత చిన్న కార్లను అదికూడా పార్కింగ్ కు సమస్యలేని అంత చిన్న కార్లను రూపొందించడంలో అనేక సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నానో కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలలో కూడా అనేక సంస్థలు ఈ తరహా అతిచిన్న కార్ల తయారీ చేస్తున్నాయి. తద్వారా వాహనదారులకు పార్కింగ్ సమస్య నుండి ప్రయాణ సమస్య ఉండకుండా ఉంటుందని వారి అంచనా.

కానీ రోడ్డుపైకి సొంత వాహనాలు ఎక్కువ అవడం ద్వారా కూడా ట్రాఫిక్ సమస్య వస్తుందని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి. అందుకే వారంలో  రెండు రోజులైనా ప్రభుత్వ వాహనాలను వదలని ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సరికొత్త నిబంధనలు కూడా తీసుకువచ్చారు. తద్వారా ఇంధన వినియోగం తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది. రోడ్డుపై వాహనాల సంఖ్య తగ్గుతుంది, అదే ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది అనేది ఆయా ప్రభుత్వాల ఆలోచన. అయితే కొన్ని కారణాల వలన సొంత వాహనాలకు అలవాటు పడిన వారు ప్రభుత్వ వాహనాలను ఆశ్రయించలేకపోతున్నారు. ఇక కరోనా వచ్చాక సొంత వాహనాలు మేలు అనే ఆలోచనలోకి వచ్చేశారు వాహనదారులందరు.

ఈ కారణం చేత ట్రాఫిక్ ఒక మోస్తరుగా పెరిగిపోతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే, ఈ బుల్లి కారు తయారు చేసింది మాత్రం డెన్మార్క్ కు చెందిన  ఒక కార్ల తయారీ సంస్థ. ఈ కారు పేరు సిటీ ట్రాన్స్ ఫార్మర్ అని పెట్టారు. ఇందులో ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. అతిత్వరలో యూరప్ లో విడుదల చేయనున్నారు. ఈ వాహనం గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగంతో వెళ్తుంది. కేవలం ఐదు సెకండ్లలో 50 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. బ్యాటరీని ఒక్కసారి రీఛార్జి చేస్తే 180 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు చాసిస్ ను మడత పెట్టుకోవచ్చు. అంటే దానిని పార్క్ చేయడానికి కేవలం 100 సెం.మీ. వెడల్పు స్థలం సరిపోతుంది. ఇలాంటివి ఎక్కువైతేనే పార్కింగ్ సమస్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరికొందరు నిపుణులు.



ప్ర‌భాస్ అభిమానుల్లో ఎందుకు ఈ ద‌డ‌.. తేడా కొడుతోందా..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>