MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanide6fc9b7-0c51-44f9-b6ca-3c529f9476d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanide6fc9b7-0c51-44f9-b6ca-3c529f9476d6-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి గత కొంతకాలంగా సరైన హిట్ లేదు అన్నది తెలిసిందే. రోబో లాంటి బ్లాక్ బస్టర్ ని చూసి చాలా కాలమే అయింది. రజనీకాంత్ ఈ మధ్య చేసిన అనేక సినిమాలు అంచనాలు ఆకాశాన్ని అంటాయి కానీ రిజల్ట్ మాత్రం చాలా చేదుగా ఉంది. ఈ నేపధ్యంలో రజనీ కసిగా చేసిన సినిమాగా పెద్దన్నను చెబుతున్నారు. rajani{#}Teluguటాలీవుడ్ లో రజనీ మ్యాజిక్ స్టార్ట్... ?టాలీవుడ్ లో రజనీ మ్యాజిక్ స్టార్ట్... ?rajani{#}TeluguSun, 24 Oct 2021 19:12:36 GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి గత కొంతకాలంగా సరైన హిట్ లేదు అన్నది తెలిసిందే. రోబో లాంటి బ్లాక్ బస్టర్ ని చూసి చాలా కాలమే అయింది. రజనీకాంత్ ఈ మధ్య చేసిన అనేక సినిమాలు అంచనాలు ఆకాశాన్ని అంటాయి కానీ రిజల్ట్ మాత్రం చాలా చేదుగా ఉంది. ఈ నేపధ్యంలో రజనీ కసిగా చేసిన సినిమాగా పెద్దన్నను చెబుతున్నారు.

పెద్దన్న మూవీ తమిళ డబ్బింగ్ అన్నాత్తె. ఈ మూవీ కచ్చితంగా హిట్ అయి రజనీకి టాలీవుడ్ లో గత ప్రాభవాన్ని తెస్తుంది అంటున్నారు. అప్పట్లో అంటే ఫ్లాష్ బ్యాక్ లో రజనీ ప్రతీ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భాషా కానీ నరసింహ కానీ రజనీ అంటే ఏంటో చెప్పాయి. ఇక రోబో తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో వరసపెట్టి వచ్చిన 2.0, దర్బార్ వంటి మూవీస్ నిరాశ పరచాయి. అలాగే మాస్ ని అట్రాక్ట్ చేస్తుంది అనుకున్న కబాలీ, లింగా  వంటి మూవీస్ ఫ్లాప్ అయ్యాయి.

దీంతో టాలీవుడ్ లో ఒక్కసార్గా రజనీ మార్కెట్ డౌన్ అయింది. అన్నాత్తే మొత్తం షూటింగ్ అయి రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక కానీ తెలుగు రైట్స్ తీసుకున్న వారు లేరు. అంటే సూపర్ స్టార్ మూవీ అంటే లైట్ గా తీసుకునే సీన్ ఉందన్న మాట. అయితే అన్నాత్తె మూవీ మీద మాత్రం అంచనాలు ఉన్నాయని అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ రూరల్ బేస్డ్  రోల్ ని రజనీ ప్లే చేశారు. ఇక స్టారింగ్ చూస్తే నయనతార, ఖుష్బూ, కీర్తి సురేష్, మీనా, ప్రకాష్ రాజ్, జగపతిబాబు వంటి వారు ఉన్నారు. మొత్తం మీద ఈ మూవీ హిట్ అనే అంటున్నారు. ఇంకో శుభ సూచకం ఏంటి అంటే దీపావళి వేళ పెద్దన్నగా తెలుగులో డబ్ అయి  నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ మూవీకి పోటీగా మరో సినిమా లేకపోవడం. సో ఈ మూవీ ఏ మాత్రం టాక్ బాగున్నా టాలీవుడ్ మరో మారు రజనీ మ్యాజిక్ స్టార్ట్ అయినట్లే అంటున్నారు.
 







నాగ్ అశ్విన్ ఆలోచనలు మామూలుగా లేవు!!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>