MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies-e20c1a93-5238-4071-b64c-72263b3ab04f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies-e20c1a93-5238-4071-b64c-72263b3ab04f-415x250-IndiaHerald.jpg"బిచ్చగాడు" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సౌత్ చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిపోయింది. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించారు. ఆయన దీనిని తన హోమ్ బ్యానర్‌లో అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెలుగులో డబ్ చేయబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బిచ్చగాడు 20 కోట్ల షేర్ సాధించి, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సెtollywood dubbing movies;{#}rachana;vijay antony;Joseph Vijay;Remake;House;Blockbuster hit;Music;March;Tamil;Chitram;Telugu;Love;Cinema"బిచ్చగాడు" అన్ని భాషల్లో మెప్పించాడు"బిచ్చగాడు" అన్ని భాషల్లో మెప్పించాడుtollywood dubbing movies;{#}rachana;vijay antony;Joseph Vijay;Remake;House;Blockbuster hit;Music;March;Tamil;Chitram;Telugu;Love;CinemaSun, 24 Oct 2021 10:00:00 GMT"బిచ్చగాడు" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సౌత్ చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిపోయింది. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించారు. ఆయన దీనిని తన హోమ్ బ్యానర్‌లో అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెలుగులో డబ్ చేయబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బిచ్చగాడు 20 కోట్ల షేర్ సాధించి, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సెన్సేషనల్ హిట్‌ని హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి స్పందనే వచ్చింది.

"పిచైక్కారన్" టైటిల్ తో తమిళ భాషలో 2016లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామెడీ చిత్రానికి శశి రచన సహకారంతో పాటు దర్శకత్వం వహించారు. దీనిని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. విజయ్ ఆంటోని, సాత్నా టైటస్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో భగవతి పెరుమాళ్, వజక్కు ఎన్ ముత్తురామన్, ధీపా రామానుజం సహాయక పాత్రల్లో నటించారు. ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం కూడా అందించాడు. ఒక బిలియనీర్ వ్యాపారవేత్త అరుల్ గురించి ఈ కథ, అనారోగ్యంతో చనిపోబోతున్న తన తల్లిని కాపాడుకోవడానికి ఒక గురువు సూచించిన విధంగా కోటీశ్వరుడైన అరుళ్ 48 రోజులు బిచ్చగాడిగా రహస్య జీవితాన్ని గడుపుతాడు. అలా తన తల్లిని కాపాడుకంటాడు. ఈ చిత్రం 4 మార్చి 2016 న విడుదలైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అనే బిచ్చగాడు 13 మే 2016 న విడుదల చేశారు. 2017 లో ఈ సినిమా డబ్బింగ్ లోకి విడుదలైంది. హిందీలో 'రోడ్సైడ్ రౌడీ' , ఒడియాలో 'బేబీ', మరాఠీలో 'బికారి', కన్నడలో 'అమ్మ ఐ లవ్ యు'గా డబ్ అయ్యింది.



ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>