Doctor: నిధి కోసం ఇంట్లో భార్యను నరబలి ఇచ్చిన క్రిమినల్ డాక్టర్, భూతవైద్యాలు, అర్దరాత్రి పూజల పిచ్చి !
బెంగళూరు/దావణగెరె: డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తికి ఆ ప్రాంతంలో మంచి వైద్యుడు అనే పేరు ఉంది. డాక్టర్ కు వివాహం అయ్యింది. వివాహం సమయంలో సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు డాక్టర్ కు కట్నంగా ఇచ్చారు. డాక్టర్ కు 38 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. శ్రీమంతుడైన డాక్టర్ విలాసాలకు అలవాటు పడ్డాడు. డాక్టర్ గా పని చేస్తున్న అతనికి భూత వైద్యాలుల మీద నమ్మకంతో విచిత్రమైన పూజలు చేసేవాడు. ఎప్పుడంటే అప్పుడు రాత్రి పూట ఇంటికి ఎవరెవరినో మంత్రాలు వేసే పూజారులను పిలుచుకుని వచ్చి ఇంట్లో మంత్రాలు, తంత్రాలు వేసి పూజలు చేసేవాడు. నీ సొంత భూమిలో నిధి ఉందని, ఆ నిధి నీకు సొంతం కావాలంటే నరబలి ఇవ్వాలని ఓ మంత్రగాడు ఆ డాక్టర్ కు చెప్పాడు. ఎలాగైనా నిధి సొంతం చేసుకుని రాత్రికి రాత్రే వందల కోట్లు సంపాధించాలని డాక్టర్ స్కెచ్ వేశాడు. 9 నెలల క్రితం డాక్టర్ భార్య ఇంట్లో శవమై కనిపించింది. తన భార్య అనారోగ్యంతో మరణించిందని ఇంతకాలం డాక్టర్ అందరిని నమ్మిస్తూ వచ్చాడు. ఫోరెన్సిక్ రిపోర్టుతో డాక్టర్ భార్య ఎలా చనిపోయిందో అనే అసలు నిజం బయటకు వచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్టుతో క్రిమినల్ డాక్టర్ అతని భార్యను ఎలా హత్య చేశాడు అనే బండారం మొత్తం బయటకు వచ్చింది.

ఫేమస్ డాక్టర్
0కర్ణాటకలోని దావణగెరెలో చెన్నకేశప్ప అనే డాక్టర్ ఉన్నాడు. దావణగెరె తాలుకా బెళగుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెన్నకేశప్ప డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న చెన్నకేశప్పకు ఆ పరిసర ప్రాంతంలో మంచి వైద్యుడు అనే పేరు ఉంది. చెన్నకేశప్ప ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ఇంటి దగ్గర వైద్యం అందిస్తున్నాడు.

భారీ మొత్తంలో కట్నం ఇచ్చారు
చెన్నకేశప్పకు 18 సంవత్సరాల క్రితం శిల్పా అనే మహిళతో వివాహం జరిగింది. వివాహం సందర్బంగా శిల్పా కుటుంబ సభ్యులు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు డాక్టర్ చెన్నకేశప్పకు కట్నంగా ఇచ్చారు. తరువాత కూడా డాక్టర్ చెన్నకేశప్పకు భార్య శిల్పా కుటుంబ సభ్యులు ఆర్థికంగా సహకారం అందించారు. అంతేకాకుండా డాక్టర్ చెన్నకేశప్పకు 38 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది.

మూడనమ్మకాలు.... అర్దరాత్రి ఇంట్లో పూజలు
డాక్టర్ గా పని చేస్తున్న చెన్నకేశప్పకు మూడనమ్మకాలు ఎక్కువని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. డాక్టర్ గా పని చేస్తున్న చెన్నకేశప్పకు భూత వైద్యాలుల మీద నమ్మకంతో విచిత్రమైన పూజలు చేసేవాడు. డాక్టర్ చెన్నకేశప్ప ఎప్పుడంటే అప్పుడు అర్దరాత్రి పూట ఇంటికి ఎవరెవరినో మంత్రాలు వేసే పూజారులను పిలుచుకుని వచ్చి ఇంట్లో మంత్రాలు, తంత్రాలు వేసి పూజలు చేసేవాడు.

పొలంలో నిధి ఉంది..... నరబలి ఇవ్వాలి
భర్త చెన్నకేశప్ప తీరుతో విసిగిపోయిన అతని భార్య శిల్పా చాలాసార్లు ఇంట్లో ఇలాంటి పూజలు చెయ్యకూడదని అభ్యంతరం చెప్పిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. నీ సొంత భూమిలో నిధి ఉందని, ఆ నిధి నీకు సొంతం కావాలంటే నరబలి ఇవ్వాలని ఓ మంత్రగాడు డాక్టర్ చెన్నకేశప్పకు చెప్పాడు.

ఎవరో ఎందుకని భార్యనే నరబలి ఇచ్చిన శ్రీమంతుడు
ఎలాగైనా నిధి సొంతం చేసుకుని రాత్రికి రాత్రే వందల కోట్లు సంపాధించాలని డాక్టర్ స్కెచ్ వేశాడు. ఎవరినో నరబలి ఇస్తే లేనిపోని రామాయణాలు వస్తాయని, నా సొంత భార్య శిల్పాను నరబలి ఇస్తే పీడపోతుందని డాక్టర్ చెన్నకేశప్ప అనుకున్నాడు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన రాత్రి ఇంట్లో మంత్రగాళ్లతో పూజలు చేయించిన డాక్టర్ చెన్నకేశప్ప అదే రోజు అతని భార్య శిల్పాకు ఓవర్ డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆమెను చంపేశాడు. తరువాత పూజ జరుగుతున్న చోట శిల్పాను నరబలి ఇచ్చినట్లు ఆమె రక్తం అక్కడ పడేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

డ్రామాలు ఆడిన క్రిమినల్ డాక్టర్
తన భార్య శిల్పా అనారోగ్యంతో చనిపోయిందని డాక్టర్ చెన్నకేశప్ప అందరిముందు నాటకాలు ఆడాడు. మా అమ్మాయి శిల్పాను ఆమె భర్త చెన్నకేశవ చంపేసి ఉంటాడని, అతనికి మూడనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం అని శిల్పా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఆ సమయంలో శిల్పా శవానికి పోస్టుమార్టు నిర్వహించారు. సాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

ఫోరెన్సిక్ రిపోర్టుతో జైల్లో కిలాడి డాక్టర్
ఫోరెన్సిక్ రిపోర్టుతో డాక్టర్ చెన్నకేశవ అతని భార్య శిల్పాను ఓవర్ డోస్ ఇంజెక్షలు ఇచ్చి చంపేశాడనే అసలు నిజం బయటకు వచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్టుతో క్రిమినల్ డాక్టర్ చెన్నకేశప్ప అతని భార్య శిల్పాను ఎలా హత్య చేశాడు అనే బండారం మొత్తం బయటకు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిలిపోయారు. డాక్టర్ చెన్నకేశప్పను అరెస్టు చేసి దావణగెరె సెంట్రల్ జైలుకు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కన్నతల్లిదండ్రులు భూతవైద్యాల మీద మూడనమ్మకాలతో ఇద్దరు కన్న కూతుర్లను అతని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి మూడనమ్మకాలతో సొంత మనుషులను చంపేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించిన సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.