MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies-03114a8c-2dab-4cfc-8a7e-f3b43f3f186f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies-03114a8c-2dab-4cfc-8a7e-f3b43f3f186f-415x250-IndiaHerald.jpgనేటి తరం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీ అనగానే గుర్తొచ్చే మూవీ "రాజా రాణి". నిడివి ఎక్కువగా ఉందేమో అనిపించినా ఆ ఎమోషన్స్ కు, డ్రామాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ రొమాంటిక్ డ్రామాను తెలుగులో కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఆ సోల్ ఎక్కడ మిస్ అవుతుందేమో అని భావించి మేకర్స్ రీమేక్ కు ధైర్యం చేయకుండా డబ్బింగ్ మాత్రమే చేశారు. అయినప్పటికీ ఈ డబ్బింగ్ చిత్రమే తెలుగులో సంచలన విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. "రాజా రాణి" తెలుగు వెర్షన్ సినిమా ప్రారంభ వారాంతంలోనే రూ.2.01 కోటTollywood Dubbing Movies;{#}atlee kumar;nazriya nazim;sathyan;september;Audience;Box office;Romantic;Remake;Blockbuster hit;March;Telugu;Tamil;Chitram;Cinemaనేటి తరం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీ "రాజా రాణి"నేటి తరం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీ "రాజా రాణి"Tollywood Dubbing Movies;{#}atlee kumar;nazriya nazim;sathyan;september;Audience;Box office;Romantic;Remake;Blockbuster hit;March;Telugu;Tamil;Chitram;CinemaSun, 24 Oct 2021 11:00:00 GMTనేటి తరం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీ అనగానే గుర్తొచ్చే మూవీ "రాజా రాణి". నిడివి ఎక్కువగా ఉందేమో అనిపించినా ఆ ఎమోషన్స్ కు, డ్రామాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ రొమాంటిక్ డ్రామాను తెలుగులో కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఆ సోల్ ఎక్కడ మిస్ అవుతుందేమో అని భావించి మేకర్స్ రీమేక్ కు ధైర్యం చేయకుండా డబ్బింగ్ మాత్రమే చేశారు. అయినప్పటికీ ఈ డబ్బింగ్ చిత్రమే తెలుగులో సంచలన విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. "రాజా రాణి" తెలుగు వెర్షన్ సినిమా ప్రారంభ వారాంతంలోనే రూ.2.01 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును సృష్టించింది. ట్రేడ్ అనలిస్ట్ లను అద్భుతమైన కలెక్షన్లతో షాక్ కు గురి చేసింది. అప్పటికి తెలుగులో డబ్ అయిన తమిళ సినిమా హిట్ అయి చాలా కాలం అయ్యింది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్య, జై, నయనతార, నజ్రియా నజీమ్ నటించిన ఈ చిత్రం పెళ్లయిన తర్వాత రెండు జంటల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. ఏఆర్ మురుగదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ది నెక్స్ట్ బిగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా 'రాజా రాణి' చిత్రాన్ని నిర్మించారు.

2013లో విడుదలైన ఈ తమిళ భాషా రొమాంటిక్ డ్రామాలో సత్యరాజ్, సంతానం, సత్యన్ సహాయక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా ప్రధాన కథాంశం 1986 తమిళ చిత్రం 'మౌన రాగం' 2007 నుండి ఎక్కువగా ప్రేరణ పొందింది.కన్నడ చిత్రం 'మిలానా'. ఈ చిత్రం 27 సెప్టెంబర్ 2013న విడుదలైంది. విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు కూడా అదే టైటిల్ ను పెట్టారు. తెలుగులో ఈ చిత్రం 14 మార్చి 2014 న విడుదలైంది. దీనిని బెంగాలీలో 'శుధు తోమారి జోన్యో'గా 2015 లో రీమేక్ చేశారు., ఒడియాలో 2016 లో 'తు జె సీ'గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.



తైవాన్ ను టచ్ చేస్తే తాట తీస్తామంటున్న అమెరికా.. ఏం..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>