MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-f4f4f883-b478-441a-ad05-d8b8acc002cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-f4f4f883-b478-441a-ad05-d8b8acc002cb-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమకి మోహన్ బాబు తనయుడిగా పరిచయమైన మంచు విష్ణు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. ఇక మంచు విష్ణు అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో రాణిస్తున్నారు.Vishnu {#}movie artist association;manchu vishnu;mohan babu;Cheque;Samantha;you tubeయూట్యూబ్ ఛానెళ్లకు భారీ షాకిచ్చిన మంచు విష్ణు..!!యూట్యూబ్ ఛానెళ్లకు భారీ షాకిచ్చిన మంచు విష్ణు..!!Vishnu {#}movie artist association;manchu vishnu;mohan babu;Cheque;Samantha;you tubeSun, 24 Oct 2021 19:19:07 GMTతెలుగు చిత్ర పరిశ్రమకి మోహన్ బాబు తనయుడిగా పరిచయమైన మంచు విష్ణు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. ఇక మంచు విష్ణు అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో రాణిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు హద్దులు దాటి థంబ్ నైల్స్ పెడుతున్న సంగతి అందరికి తెల్సిందే. అంతేకాదు.. సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాల విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు హద్దులు దాటుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి మంచు విష్ణు రెడీ అయ్యారు. అంతేకాదు.. హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే అస్సలు ఉపేక్షించమని అన్నారు. కాగా.. యూట్యూబ్ ఛానెళ్ల నియంత్రణ కొరకు స్పెషల్ లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తామని మంచు విష్ణు వెల్లడించారు. ఇక మంచు విష్ణు వార్నింగ్ తో అభ్యంతరకర వీడియోలు పెడుతున్న యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు మారతారేమో చూడాలి మరి.

అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు విచిత్రమైన టైటిల్స్ ను పెట్టి ప్రేక్షకుల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు చెక్ పెట్టే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. సమంత సైతం తన పరువుకు భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యవహరించాయని పేర్కొన్న విషయం తెలిపారు. అంతేకాక.. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మహిళా భద్రత కొరకు కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ప్రముఖ సామాజిక కార్యకర్తలలో ఒకరైన సునీతా కృష్ణన్ ఈ కమిటీకి సలహాదారుగా రాణిస్తున్నారు. అంతేకాదు.. విమెన్ ఎంపవర్ మెంట్ ఆండ్ గ్రీవెన్స్ సెల్ పేరుతో ఈ కమిటీ ఏర్పాటు అవుతుంది. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరింత మంది మహిళలను భాగస్వాముల్ని చేయడం కొరకు కృషి చేస్తున్నానని మంచు విష్ణు తెలిపారు. అంతేకాదు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి చేయడానికి మంచు విష్ణు ఎంతగానో శ్రమిస్తున్నాట్లు తెలుస్తోంది.



నాగ్ అశ్విన్ ఆలోచనలు మామూలుగా లేవు!!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>