PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-295748a4-1053-41bf-9348-8c89be9d7a9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-295748a4-1053-41bf-9348-8c89be9d7a9e-415x250-IndiaHerald.jpgఈసీ పుణ్యమా అని నాయకులకు ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఖర్చు మిగిలింది. అలా మిగిలిన ఖర్చు ఉపఎన్నికలో ఇంకోలా వినియోగించే వెసులుబాటు పార్టీలకు చిక్కింది. పైకి సభలు, రోడ్ షోలు లేవని నేతలు విచారం వ్యక్తం చేస్తున్న అంతరంగిక సమావేశాల్లో మాత్రం ఎన్నికల సంఘం తమ నెత్తిన పాలు పోసిందని సంతోష పడుతున్నారట. అందుకే ఈసి ఆంక్షలు, వాటి వల్ల కలుగుతున్న ఆనందాల పై రాత్రయ్యేసరికి ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.Political {#}Election Commission;Huzurabad;Yatra;Petta;CM;Coronavirus;Bharatiya Janata Party;Hyderabadహుజూర్ ఉప ఎన్నికపై ఆంక్షల దెబ్బ.. ఏం..!హుజూర్ ఉప ఎన్నికపై ఆంక్షల దెబ్బ.. ఏం..!Political {#}Election Commission;Huzurabad;Yatra;Petta;CM;Coronavirus;Bharatiya Janata Party;HyderabadSun, 24 Oct 2021 15:56:00 GMTLసాధారణ ఎన్నికలయినా, ఉప ఎన్నికలయిన రోడ్ షోలు, బహిరంగ సభలు కామన్. ఈ రెండూ లేకుండా సాగుతుంది హుజురాబాద్ బై ఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు ఈసీ నో చెప్పడంతో ప్రత్యామ్నాయాల మీద పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీ గా ఉన్నాయా లేక బాధ పడుతున్నాయా? అంతరంగిక చర్చల్లో  జరుగుతున్న సంభాషణ లేంటి? హుజరాబాద్ లో ఈ నెల 30 న పోలింగ్. ఈ నెల 27 తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్ది రోజులనే కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే హైదరాబాద్ ను చుట్టేసిన టిఆర్ఎస్, బిజెపి లు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి.

అయితే ఓటర్ల అటెంక్షన్ తీసుకొచ్చేందుకు, లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు సభలకు ప్లాన్ వేసినా ఈసీ చెక్ పెట్టింది. దీంతో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై ప్రధాన పార్టీలలో చర్చ జరుగుతోంది. కరోనా సమయంలో నిర్వహించిన ఎన్నికల్లో కొన్ని చోట్ల వైరస్ ఉద్ధృతికి ప్రచార సభలు, రోడ్ షోలు కారణమయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈసీ తీరుపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి . దాంతో ఈ నెల 30న నిర్వహించే ఉప ఎన్నికపై ఆంక్షల కొరడా ఝుళిపించింది ఎన్నికల కమిషన్. ప్రచారంలో కీలకంగా భావించే రోడ్ షోలను బ్యాన్ చేసింది. 1000 మంది తోనే బహిరంగ సభ పెట్టుకోవాలి ఒక పెద్ద నేత ని తీసుకువచ్చి రోడ్ షో లు లేకుండా 1000 మందితో సభ అంటే తేలిపోతుంది. అందుకే ఇంటింటి ప్రచారానికి ఇతర మార్గాల కు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు. షెడ్యూల్ రాకముందే హుజరాబాద్ లో దళిత  బంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించి టిఆర్ఎస్ ప్రచారానికి కిక్కిచ్చారు సీఎం కేసీఆర్ . ఈ నెల 27న హుజురాబాద్ ను ఆనుకొని ఉండే పెంచికల్ పేట లో భారీ సభ కు ప్లాన్ చేసిన ఈసీ కొత్తగా జారీచేసిన ఆదేశాలతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది అధికార పార్టీ. హుజరాబాద్ లో ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ముగించి భారీ సభ కు ప్లాన్ చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నాడు ఎన్నికల కోడే అడ్డంకిగా మారింది. దాంతో హుస్నాబాద్లో సభ నిర్వహించి మమ అనిపించారు. అప్పట్లో హుజురాబాద్ కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కోడ్ పై ఆదేశాలు లేకపోవడంతో బిజెపి సభకు ఆటంకం లేకుండా పోయింది. ఇప్పుడు వారికి లేదు వీరికి లేదు. సాధారణంగా పెద్ద నేతల రోడ్ షో, బహిరంగ సభ అంటే భారీగా జనసమీకరణ చేయాలి.

 ఈసీ పుణ్యమా అని నాయకులకు ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఖర్చు మిగిలింది. అలా మిగిలిన ఖర్చు ఉపఎన్నికలో ఇంకోలా వినియోగించే వెసులుబాటు పార్టీలకు చిక్కింది. పైకి సభలు, రోడ్ షోలు లేవని నేతలు విచారం వ్యక్తం చేస్తున్న అంతరంగిక సమావేశాల్లో మాత్రం ఎన్నికల సంఘం తమ నెత్తిన పాలు పోసిందని సంతోష పడుతున్నారట. అందుకే ఈసి ఆంక్షలు, వాటి వల్ల కలుగుతున్న ఆనందాల పై  రాత్రయ్యేసరికి ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.



విశాల్ కి తెలుగు లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా పందెం కోడి..!!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>