PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pattabhifcfc0014-2006-46f7-8c5b-129dea2415c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pattabhifcfc0014-2006-46f7-8c5b-129dea2415c5-415x250-IndiaHerald.jpgబొషిడికే..అనే ఒకే ఒక పదం ఏపీ రాజకీయాలని కుదిపేస్తుంది. మీడియా సమావేశంలో టి‌డి‌పి నేత పట్టాభి...సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి అలా తిట్టారని చెప్పి వైసీపీ శ్రేణులు బీపీ పెంచుకుని టీడీపీ ఆఫీసులపై దాడి చేశాయి. ఇక ఆ పదానికి అనేక అర్ధాలు చెబుతున్నారు. జగన్ సైతం ఆ పదానికి అర్ధం చెప్పి మరీ..తనని టీడీపీ వాళ్ళు తిడుతున్నారని, అలాగే తన తల్లిని తిడుతున్నారని మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు కూడా మా నాయకుడునే తిడతారని చెప్పి...పట్టాభిని, చంద్రబాబుని పచ్చి బూతులు తిడుతున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా అదే పనిలో ఉన్నారుpattabhi{#}Andhra Pradesh;media;YCP;TDP;Jagan;Raccha;Tadepalli;Prashant Kishorసూపర్ ట్విస్ట్: పట్టాభి అన్నది సజ్జలని.. మరి ఆ క్రియేషన్ ఎవరిది?సూపర్ ట్విస్ట్: పట్టాభి అన్నది సజ్జలని.. మరి ఆ క్రియేషన్ ఎవరిది?pattabhi{#}Andhra Pradesh;media;YCP;TDP;Jagan;Raccha;Tadepalli;Prashant KishorSun, 24 Oct 2021 00:00:00 GMTబొషిడికే..అనే ఒకే ఒక పదం ఏపీ రాజకీయాలని కుదిపేస్తుంది. మీడియా సమావేశంలో టి‌డి‌పి నేత పట్టాభి...సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి అలా తిట్టారని చెప్పి వైసీపీ శ్రేణులు బీపీ పెంచుకుని టీడీపీ ఆఫీసులపై దాడి చేశాయి. ఇక ఆ పదానికి అనేక అర్ధాలు చెబుతున్నారు. జగన్ సైతం ఆ పదానికి అర్ధం చెప్పి మరీ..తనని టీడీపీ వాళ్ళు తిడుతున్నారని, అలాగే తన తల్లిని తిడుతున్నారని మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు కూడా మా నాయకుడునే తిడతారని చెప్పి...పట్టాభిని, చంద్రబాబుని పచ్చి బూతులు తిడుతున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య రచ్చ జరుగుతుంది...మధ్యలో జనాలు అన్యాయం అవుతున్నారు.

కానీ ఇక్కడే సరికొత్త ట్విస్ట్ వచ్చి పడింది...అసలు పట్టాభి బొషిడికే అని తిట్టింది...సజ్జల రామకృష్ణారెడ్డిని అని చెప్పి, అందుకు సంబంధించిన పట్టాభి మీడియా సమావేశం వీడియోలని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెడుతున్నాయి. అందులో తాడేపల్లి పాలేరు అని మాట్లాడుతూ..బొషిడికే అని పట్టాభి మాట్లాడారు. అలాగే జగన్‌ని పబ్జీ దొర అని కామెంట్ చేశారు.

అయితే ఇక్కడ ఎవరిని తిట్టిన తప్పు తప్పే...కానీ వైసీపీ శ్రేణులు జగన్‌నే తిట్టారని హైలైట్ చేసేశాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలైట్ అయిపోయింది. పైగా ఎక్కడ తిట్టామని ఒప్పుకోవాల్సి వస్తుందని టి‌డి‌పి నేతలు సైతం పట్టాభి అన్నది సజ్జలని అని చెప్పడం లేదు. కానీ టీడీపీ శ్రేణులు పట్టాభికి మాట్లాడిన వీడియోల్లో అదే స్పష్టమవుతుంది.

పట్టాభి ఎవరిని తిట్టిన అది తప్పే...కానీ వైసీపీ శ్రేణులు అది జగన్‌నే అనుకుని...ఏకకాలంలో టీడీపీ ఆఫీసులపై దాడి చేశాయి. అలాగే ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో మరింత రచ్చ జరుగుతుంది. రెండు పార్టీలు ప్రజలని వదిలేసి...ఒకరినొకరు తిట్టుకోవడమే సరిపోతుంది. అసలు ఇలా రచ్చ క్రియేట్ చేసి, రాష్ట్రంలో అశాంతికి కారణం ప్రశాంత్ కిషోర్ టీం అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ రచ్చకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.  



సూపర్ ట్విస్ట్: పట్టాభి అన్నది సజ్జలని.. మరి ఆ క్రియేషన్ ఎవరిది?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>