MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-dubbing-moviesea992087-b98e-4f95-be8f-b88652e98b80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-dubbing-moviesea992087-b98e-4f95-be8f-b88652e98b80-415x250-IndiaHerald.jpgఒక బాషలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలు ఇతర బాష లలో డబ్ అవ్వడం లేదా ఆ భాషలలో క్రేజీ హీరోలతో అనువదించబడటం సహజంగా జరిగేదే. అయితే స్టార్ హీరోల చిత్రాలు కనుక హిట్ అందుకుంటే ఎక్కువగా ఇతర బాషల్లో డబ్ అవుతుంటాయి. ముఖ్యంగా తమిళంలో హిట్ అయినవి తెలుగులో, తెలుగులో సక్సెస్ అందుకున్నవి తమిళంలో డబ్ అవుతుంటాయి.TOLLYWOOD-DUBBING-MOVIES{#}Prakash Raj;vivek;Ghajini;surya sivakumar;Tollywood;sree;local language;Telugu;Tamil;Success;Heroine;Hero;Chitram;Cinema;Traffic policeసూర్య కెరీర్ లో "యముడు" ఒక మైల్ స్టోన్...సూర్య కెరీర్ లో "యముడు" ఒక మైల్ స్టోన్...TOLLYWOOD-DUBBING-MOVIES{#}Prakash Raj;vivek;Ghajini;surya sivakumar;Tollywood;sree;local language;Telugu;Tamil;Success;Heroine;Hero;Chitram;Cinema;Traffic policeSun, 24 Oct 2021 11:37:51 GMTఒక బాషలో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలు ఇతర బాష లలో డబ్ అవ్వడం లేదా ఆ భాషలలో క్రేజీ హీరోలతో అనువదించబడటం సహజంగా జరిగేదే. అయితే స్టార్ హీరోల చిత్రాలు కనుక హిట్ అందుకుంటే ఎక్కువగా ఇతర బాషల్లో డబ్ అవుతుంటాయి. ముఖ్యంగా తమిళంలో హిట్ అయినవి తెలుగులో, తెలుగులో సక్సెస్ అందుకున్నవి తమిళంలో డబ్ అవుతుంటాయి. అలా రిలీజ్ అయినవి ఇక్కడ కూడా ఎక్కువగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో "యముడు" చిత్రం ఒకటి. తమిళ స్టార్ హీరో సూర్య అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. గజిని మొదలు ఆయన నటించిన ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సంచలన విజయాలను అందుకున్నాయి.

అలాగే యముడు సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల మెప్పు పొంది సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇందులో హీరోయిన్ గా చేయడంతో సినిమాకి మరింత ప్లస్ అయ్యింది.  సూర్య హీరోయిజం, ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్ కొత్తగా అనిపించడం, వివేక్ కామెడీ టైమింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని అలరించి సినిమా సక్సెస్ కి దోహదపడ్డాయి. అన్ని ఎమోషన్స్ సమపాళ్ళలో పడటం స్టార్ హీరో చిత్రం కావడంతో తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది యముడు చిత్రం.

ప్రధానంగా హీరో సూర్య పోలీస్ ఆఫీసర్ గా చేసిన యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ బాగా రక్తి కట్టించాయి. అలాగే డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది ఎక్కడ ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ప్రకాష్ రాజ్ పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే తెలుగులో ఈయన డైలాగ్ డెలివరీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఆయన డైలాగ్స్ కి ఆయన స్వరం లేకపోవడం పూర్తిగా  కనెక్ట్ అవ్వ లేకపోయారనే చెప్పాలి. అయినప్పటికీ ఆయన యాక్టింగ్ కవర్ చేసింది అది వేరే విషయం. ఇక మొత్తానికి ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.



కేసీఆర్, కేటీఆర్‌ నాన్ లోక‌లే?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>