BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/srinagarb599aa46-4daa-403b-978b-f9c3e59059d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/srinagarb599aa46-4daa-403b-978b-f9c3e59059d4-415x250-IndiaHerald.jpg జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభ‌మైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం దీన్ని ప్రారంభించారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా క‌శ్మీర్‌లో పర్యటిస్తుండ‌టం ఇదే మొద‌టిసారి. శ్రీనగర్ విమానాశ్రయం టెర్మినల్ 25000 చదరపు మీటర్ల నుంచి 63000చదరపు మీటర్లకు విస్తరించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈమేర‌కు కsrinagar{#}Srinagar;police;Saturday;INTERNATIONAL;Amith Shah;Minister;central governmentషార్జాకు నేరుగా విమానంషార్జాకు నేరుగా విమానంsrinagar{#}Srinagar;police;Saturday;INTERNATIONAL;Amith Shah;Minister;central governmentSat, 23 Oct 2021 10:20:11 GMT
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభ‌మైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం దీన్ని ప్రారంభించారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా క‌శ్మీర్‌లో పర్యటిస్తుండ‌టం ఇదే మొద‌టిసారి. శ్రీనగర్ విమానాశ్రయం టెర్మినల్ 25000 చదరపు మీటర్ల నుంచి 63000చదరపు మీటర్లకు విస్తరించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈమేర‌కు కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివ‌రాలు వెల్ల‌డించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్రమంత్రి అమిత్షా అధికారులను ఆదేశించ‌డంతోపాటు ప్ర‌యాణికుల కోసం ఏర్పాటు చేసిన అన్నిసౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కశ్మీర్ లోయలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయ‌డంతోపాటు కీలకప్రాంతాల్లో షార్ప్ షూటర్లు, పోలీసు జాగిలాలను మోహరించారు. ఉగ్రదాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్ సిటీ సెంటరు నుంచి లాల్ చౌక్ వరకు ఎయిర్ ఫోర్స్ ద్వారా గగనతలంపై నిఘా వేశారు.



ఆసుపత్రులలో కూడా.. ఐదుకే భోజనం..!

షార్జాకు నేరుగా విమానం

బంగ్లాదేశ్ కంటే.. ఇజ్రాయెల్ నయం..!

శ్రీలీల కు అనుకోని మ్యానియా !

ఇస్లామిక్ రాజ్యం నుండి.. వాళ్ళే పారిపోతున్నారెందుకు..?

మ‌ళ్లీ పంజా విసురుతోన్న కొవిడ్‌?

బాబోరిని పట్టించుకోని.. కేంద్రం..!

ఈరోజు మోల్ డే.. చరిత్ర - ప్రాముఖ్యత తెలుసా..!

ఈ మూడు రాశుల వారికి అన్ని రహస్యమే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>