PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-vijayasai71e9615d-12a5-4c5f-9e12-c27523e20050-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-vijayasai71e9615d-12a5-4c5f-9e12-c27523e20050-415x250-IndiaHerald.jpgవైసీపీ కీల‌క నేత‌, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఉత్త‌రాంధ్ర పార్టీ ఇన్ చార్జ్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ఉత్త‌రాంధ్ర లోని మూడు జిల్లాల్లో టిక్కెట్ల కేటాయింపు లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ఉత్త‌రాంధ్ర‌లో మంత్రుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి.. పార్టీ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం వ‌ర‌కు అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. అటు ఢిల్లీ లో కూడా ఆయ‌నే ప్ర‌ధానంగా చ‌క్రం తిప్పారు. అయితే కొద్ది రోజులుగా విజ‌య‌సాయి ని జ‌గ‌న్jagan vijayasai{#}Rajya Sabha;Vishakapatnam;Delhi;Evening;media;MP;YCP;District;Partyజ‌గన్‌కు దూరం దూరం.. విజ‌యసాయి షాకింగ్ డెసిష‌న్‌..!జ‌గన్‌కు దూరం దూరం.. విజ‌యసాయి షాకింగ్ డెసిష‌న్‌..!jagan vijayasai{#}Rajya Sabha;Vishakapatnam;Delhi;Evening;media;MP;YCP;District;PartySat, 23 Oct 2021 12:40:00 GMTవైసీపీ కీల‌క నేత‌, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఉత్త‌రాంధ్ర పార్టీ ఇన్ చార్జ్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ఉత్త‌రాంధ్ర లోని మూడు జిల్లాల్లో టిక్కెట్ల కేటాయింపు లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ఉత్త‌రాంధ్ర‌లో మంత్రుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి.. పార్టీ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం వ‌ర‌కు అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. అటు ఢిల్లీ లో కూడా ఆయ‌నే ప్ర‌ధానంగా చ‌క్రం తిప్పారు. అయితే కొద్ది రోజులుగా విజ‌య‌సాయి ని జ‌గ‌న్ దూరం పెడుతున్నార‌న్న వార్త‌లు మీడియా వ‌ర్గాల్లో నే కాకుండా.. ఇటు వైసీపీ వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

స‌రే ఏం జ‌రిగింది అన్న‌ది కాసేపు ప‌క్క‌న పెడితే ఇప్పుడు విజ‌య‌సాయి ఉత్త‌రాంధ్ర పై త‌న ప‌ట్టు త‌గ్గలేద‌ని నిరూపించుకు నే క్ర‌మంలోనే కొత్త నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిత్యం ప్రజా ద‌ర్బార్ ద్వార ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నారు. విజ‌య‌సాయి వారంలో ఏకంగా ఐదు రోజుల పాటు ప్ర‌జ‌ల్లోనే ఉంటూ ప్ర‌జా ద‌ర్బార్ లు నిర్వ‌హిస్తున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రైనా ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే విజ‌య‌సాయి క‌లిసే ప్లాన్ చేశారు.

కేవ‌లం విశాఖ న‌గ‌ర‌మే కాకుండా విశాఖ జిల్లా తో పాటు ఉత్త‌రాంధ్ర లోని ఏ జిల్లా , ఏ ప్రాంతం నుంచి అయినా ఎవ‌రైనా వ‌చ్చి ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌చ్చు. విజ‌య‌సాయి ప్లానింగ్ బాగున్నా ఆయ‌న దూకుడుతో అక్క‌డ మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు డ‌మ్మీలు అయిపోతార‌న్న చ‌ర్చ కూడా ఉంది. విజ‌య‌సాయి ప్ర‌జా ద‌ర్బార్ దెబ్బ‌తో త‌మ క్రేజ్ త‌గ్గుతుంద‌ని ఆ పార్టీ నేత‌లే వాపోతున్నారు.ఇప్ప‌టికే ఆరేళ్లుగా ఈ ప్రాంతాన్ని శాసిస్తోన్న విజ‌య‌సాయి ఇప్పుడు మ‌రింత‌గా ఇక్క‌డ ప‌ట్టు బిగించేలా ఉన్నారు.



చార్‌ధామ్ యాత్ర‌లో స‌మంత‌.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు..!

ఉల్లి చేసిన పనికి ఏకంగా 650 మందికి అస్వస్థత..!!

చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట.. ఏం..?

ప్రభాస్ అనుష్కలు ఒక్కటవ్వరా?

ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ విడుదల..!!

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఏంటీ వాద‌న‌లు..?

బాబోరికీ.. జగన్ పెన్షన్ కావాలంట..!

జేజెమ్మ ప్రేమ‌లో ఉన్నాడా?

మనీ: రూ.లక్ష కు రూ.8 లక్షలు ..కేవలం 6 నెలల్లోనే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>