MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaithanya0ed34c1d-4391-4e37-b6ba-986c6cb1e72e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaithanya0ed34c1d-4391-4e37-b6ba-986c6cb1e72e-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున కొడుకులు, అక్కినేని వారసులు ఫుల్ ఫాంలో ఉన్నారు. తాజా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా చెరో హిట్ ను పొందారు. ల‌వ్ స్టోరి మూవీతో నాగ చైత‌న్య విజ‌యం సాధించ‌గా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఇంత‌వ‌ర‌కు హిట్ కొట్ట‌ని అఖిల్ మొద‌టి విజ‌యాన్ని అందుకున్నాడు. సమంతతో విడాకుల ప్రకటన చేసిన త‌రువాత నాగ‌చైత‌న్య‌ అందుకున్న ఈ విక్టరీ అక్కినేని అభిమానులకు సంతోషాన్ని పంచింది. అయితే అదే జోష్‌లో తాజాగా చైతూ మరో కొత్త అడుగు వేశార‌ని తెలుస్తోంది. నాగ‌చైత‌న్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలnaga chaithanya{#}nandini reddy;akhil akkineni;Vikram Kumar;vijay deverakonda;naga;Akkineni Nagarjuna;Director;Venkatesh;Reddy;House;Father;Cinemaఆమెకు ఓకే చెప్పిన నాగ‌చైతన్య‌..!ఆమెకు ఓకే చెప్పిన నాగ‌చైతన్య‌..!naga chaithanya{#}nandini reddy;akhil akkineni;Vikram Kumar;vijay deverakonda;naga;Akkineni Nagarjuna;Director;Venkatesh;Reddy;House;Father;CinemaSat, 23 Oct 2021 07:53:02 GMTకింగ్ నాగార్జున కొడుకులు, అక్కినేని వారసులు ఫుల్ ఫాంలో ఉన్నారు. తాజా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా చెరో హిట్ ను పొందారు. ల‌వ్ స్టోరి మూవీతో నాగ చైత‌న్య విజ‌యం సాధించ‌గా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఇంత‌వ‌ర‌కు హిట్ కొట్ట‌ని అఖిల్ మొద‌టి విజ‌యాన్ని అందుకున్నాడు. సమంతతో విడాకుల ప్రకటన చేసిన త‌రువాత నాగ‌చైత‌న్య‌ అందుకున్న ఈ విక్టరీ అక్కినేని అభిమానులకు సంతోషాన్ని పంచింది. అయితే అదే జోష్‌లో తాజాగా చైతూ మరో కొత్త అడుగు వేశార‌ని తెలుస్తోంది.

   నాగ‌చైత‌న్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూస సినిమా చేస్తున్నారు. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి న‌టిస్తున్న సినిమా 'బంగార్రాజు'లో తన పోర్షన్ కంప్లీట్‌ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీలో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండగానే తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డితో మరో మ‌వీకి ఓకే చెప్పార‌న‌ట నాగ‌చైత‌న్య. ఇటీవలే నాగ‌చైత‌న్య‌కు నందిని రెడ్డి ఓ కథ వినిపించిందని, అది చైతూకి నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతుందని స‌మాచారం.  ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా, నాగ‌చైత‌న్య‌తో నందినీ రెడ్డి చేయనున్న ఈ స్టోరీ గతంలో విజయ్ దేవరకొండ కోసం రాసి పెట్టిన కథ అనే మాట‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం నందినీ రెడ్డి సంతోష్ శోభ‌న్‌తో `అన్నీ మంచి శ‌కున‌ములే` అనే మూవీ చేస్తోంది.


మూవీ పూర్తి కాగానే నాగ‌చైత‌న్య కొత్త ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.  మ‌రోవైపు నాగ‌చైత‌న్య కూడా ప్ర‌స్తుతం త‌న‌కు ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి నందిని రెడ్డికి ఫుల్ డేట్స్ కేటాయించ‌నున్నార‌ని అనుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అఫీష‌య‌ల్ ప్ర‌క‌ట‌న ఇంత వ‌ర‌కు రాలేదు. నాగ‌చైత‌న్య నందినీ రెడ్డి కొత్త‌ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుంద‌నేది వేచి చూడాలి.



బ్రేకింగ్‌: వైసీపీ కీల‌క నేత మృతి

ఆలస్యం కానున్న నీట్-2021 ఫలితాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. NFL లో ఉద్యోగాలు..

కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !

క‌ళా 'మా' త‌ల్లి: రోజుకో 'మా'ట‌.. పూట‌కో 'మా'ట‌..!!

కాన్వాయ్ అదిరిందిగా...!!

పసుపు వేసిన నీళ్లను తాగితే...!

పెసర పిండితో అందమైన ముఖం మీ సొంతం...

క‌ళా 'మా' త‌ల్లి: ప్ర‌కాష్‌రాజ్ పోరాట స్ఫూర్తి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>