PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpe6eff85a-2c6a-4ca1-baad-fcc5b4dcd7d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpe6eff85a-2c6a-4ca1-baad-fcc5b4dcd7d4-415x250-IndiaHerald.jpgతెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉర్రూత‌లూగిస్తోంది. ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆయా పార్టీల త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఎలాగైనా గెలువాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌మ అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. ఏం చేసి అయినా స‌రే ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌ని అధికార టీఆర్ఎస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో అధికార టీఆర్ఎస్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుందా అనే అనుమానం క‌లుగుతుంది. గ‌తంలోనూ హుజురాబాద్ ఉప ఎన్నిక త‌మ‌కు చిన్న విష‌యం అని టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. అప్పుడే త‌మ గెలుపుపై ఆశ‌లు వ‌దిలేసుకుంద‌ని రాhujurabad bjp{#}Google pay app;Bharatiya Janata Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Minister;Partyహుజురాబాద్‌లో బీజేపీ కొత్త టెక్నాల‌జీ వాడుతుందా..?హుజురాబాద్‌లో బీజేపీ కొత్త టెక్నాల‌జీ వాడుతుందా..?hujurabad bjp{#}Google pay app;Bharatiya Janata Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Minister;PartySat, 23 Oct 2021 08:43:02 GMTతెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉర్రూత‌లూగిస్తోంది. ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆయా పార్టీల త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఎలాగైనా గెలువాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌మ అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. ఏం చేసి అయినా స‌రే ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌ని అధికార టీఆర్ఎస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో అధికార టీఆర్ఎస్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుందా అనే అనుమానం క‌లుగుతుంది. గ‌తంలోనూ హుజురాబాద్ ఉప ఎన్నిక త‌మ‌కు చిన్న విష‌యం అని టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. అప్పుడే త‌మ గెలుపుపై ఆశ‌లు వ‌దిలేసుకుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అనుకున్నాయి.


   ఈట‌ల రాజేంద‌ర్ గెలుపున‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడ‌నే అంచనాకు వ‌చ్చేసిందా ఏమో తెలియ‌దు గానీ. మాజీ మంత్రి బీజేపీ పార్టీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కొత్త టెక్నాల‌జీని వాడుతున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే క్రాంతికిర‌ణ్ అలాగే మాజీ ఎమ్మెల్సీ శ్రీ‌నివాస్‌రెడ్డి, నాయ‌కుడు రామ‌చంద్ర‌రావు ఫిర్యాదు చేశారు. వాళ్లు మాట్లాడుతూ కొత్త టెక్నాల‌జీ ద్వారా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెడుతున్నారంటూ.. చాలామంది పేర్ల‌తో బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేయించార‌ని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేత‌లు.


ఆ అకౌంట్ల నుంచి ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచేందుకు స‌న్నాహ‌లు జ‌రుగ‌తున్నాయంటూ కూడా ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎన్ని ఖాతాలు ఓపెన్ చేశార‌నేదానిపై విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీని కోరారు. ఇక మ‌రోవైపు బీజేపీ సోష‌ల్ మీడియాను వాడుకోవ‌డంలో పీహెచ్‌డీ చేసిందంటున్నారు. గ‌తంలో దుబ్బాకలో ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డ‌బ్బులు పంపిణీ చేసిన‌ట్టే ఇక్క‌డ కూడా ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం రావ‌డంతో సీఈఓ కు ఫిర్యాదు చేశామంటోంది టీఆర్ఎస్‌.  ఇక ద‌ళిత‌బంధు అమ‌లుతో హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుస్తుంద‌నే భ‌యంతోనే బీజేపీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు ఈట‌ల గెలుపు భ‌యంతోనే టీఆర్ఎస్ నేత‌లు కంప్లైంట్ చేస్తున్నార‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు.





మేల్కొన్న ఏపీ టీడీపీ కేడర్... కారణం అదేనా?

''టీ'' తో ఎలాంటి లాభాలని పొందచ్చంటే?

T20 WORLD CUP: కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

బ్రేకింగ్‌: వైసీపీ కీల‌క నేత మృతి

ప్రభాస్ పేరు వెనుక రహస్యం ఇదే !

ఆలస్యం కానున్న నీట్-2021 ఫలితాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. NFL లో ఉద్యోగాలు..

కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !

క‌ళా 'మా' త‌ల్లి: రోజుకో 'మా'ట‌.. పూట‌కో 'మా'ట‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>