Wife: ఉద్యోగం చెయ్యాలని చెప్పిన భార్య, స్పాట్ లో విడాకులు ఇచ్చిన భర్త, భార్య మనుసు మార్చుకుంటే !
అహమ్మదాబాద్: ఇంట్లో చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న యువతి అతనితో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగించాలని భార్య అనుకుంది. గతంలో ఆటో నడుపుతూ భార్య, పిల్లలను పోషిస్తున్న భర్త ఇటీవల చెడు వ్యసనాలకు బానిసై జల్సాలు చేస్తున్నాడు. భర్త ఎలాంటి పని చెయ్యకుండా కాలం గడిపేస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం చెయ్యాలని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని కొంతకాలం నుంచి భార్య ఆమె భర్తకు చెబుతోంది. భార్య బుద్దిమాటలు చెప్పడం ఆమె భర్త జీర్ణించుకోలేకపోయాడు. నాకే బుద్దిమాటలు చెబుతావా ? నీకు ఎంత ధైర్యం అంటూ భర్త వీరంగం చేశాడు. భార్య పెద్దలకు విషయం చెప్పి పంచాయితీ పెట్టింది. పంచాయితీలు పెట్టి నా పరువు బజారుకు ఈడుస్తావా అంటూ రగిలిపోయిన భర్త స్పాట్ లో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. భర్తను వేడుకున్న భార్య తనకు విడాకులు ఇవ్వకూడదని అతని కాళ్లు పట్టుకునింది. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అనుకున్నాడో ఏమో భర్త మనసు మార్చుకోలేదు. భార్య ఆమె భర్త మీద మనసు మార్చుకోవడంతో పోటుగాడికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.

హ్యాపీలైఫ్ అనుకుంది
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో షఫీవుల్లా (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని షఫీవుల్లాకు ఇచ్చి వివాహం చెయ్యాలని కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు నిర్ణయించారు. ఇంట్లో చూపించిన షఫీవుల్లాను వివాహం చేసుకున్న రజియా బేగం అతనితో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకుంది.

విలాసాలకు బానిసైన భర్త
షఫీవుల్లా, రజియా బేగం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగించాలని రజియా బేగం అనుకుంది. గతంలో ఆటో నడుపుతూ భార్య, పిల్లలను పోషిస్తున్న షఫీవుల్లా ఇటీవల చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. జల్సాలు చేస్తున్న షఫీవుల్లా ఎలాంటి పని చెయ్యకుండా ఇప్పుడు కాలం గడిపేస్తున్నాడు.

బుద్దిమాటలు చెప్పిన భార్య
భర్త షఫీవుల్లా ఎలాంటి పని చెయ్యకుండా కాలం గడిపేస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం చెయ్యాలని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని కొంతకాలం నుంచి షఫీవుల్లాకు అతని భార్య రజియా బేగం చెబుతోంది. పదేపదే భార్య రజియా బేగం బుద్దిమాటలు చెప్పడం ఆమె భర్త షఫీవుల్లా ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు.

స్పాట్ లో విడాకులు ఇచ్చిన భర్త
నాకే బుద్దిమాటలు చెబుతావా ? నీకు ఎంత ధైర్యం అంటూ షఫీవుల్లా ఆమె భార్య రజియా బేగం ముందు వీరంగం చేశాడు. భార్య రజియా బేగం కుటుంబ పెద్దలకు విషయం చెప్పి పంచాయితీ పెట్టింది. పంచాయితీలు పెట్టి నా పరువు బజారుకు ఈడుస్తావా అంటూ రగిలిపోయిన భర్త షఫీవుల్లా నానా హంగామా చేశాడు. పెద్దలు షఫీవుల్లాకు నచ్చచెప్పినా అతను ఎవ్వరిమాట వినలేదు. పెద్దలు పంచాయితీలు చేస్తున్న సమయంలో ఊగిపోయిన షఫీవుల్లా అతని భార్య రజియా బేగం మీద దాడి చెయ్యడమే కాకుండా స్పాట్ లో ఆమెకు తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు చెప్పి విడాకులు ఇచ్చేశాడు.

పోటుగాడి మీద ఎఫ్ఐఆర్
భర్త తలాక్ చెప్పి విడాలకులు ఇవ్వడంతో అతని భార్య రజియా బేగం షాక్ అయ్యింది. షఫీవుల్లాను వేడుకున్న అతని భార్య రజియా బేగం తనకు విడాకులు ఇవ్వకూడదని, తన పిల్లలకు అన్యాయం చెయ్యకూడదని అతని కాళ్లు పట్టుకునింది. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అనుకున్నాడో ఏమో షఫీవుల్లా అతని భార్య మాట వినలేదు. చివరికి రజీయా బేగం మనసు మార్చుకుని ఆమె భర్త మీద పోలీసు కేసు పెట్టింది. తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం నేరం కావడంతో పోలీసులు భర్త మీద కేసు నమోదు చెయ్యడంతో పోటుగాడికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.