QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata3e4f592b-0054-44ad-8016-c235c6007228-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata3e4f592b-0054-44ad-8016-c235c6007228-415x250-IndiaHerald.jpgఅనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ,కీటకాలు ఉండేవి. వీటన్నిటితో పాటు ఒకఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు.. దానికి తేనె అంటే మహా ఇష్టం. ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది. తేనె కోసం అడవిలో అంగుళం అంగుళం గాలించేది. వెతగ్గా వెతగ్గా ఎక్కడైనా కనిపిస్తే ఇకఅంతే! మై మరిచిపోయేది తేనెపట్టు చిటారు కొమ్మలో ఉన్న సరే... చకచకా చెక్కి తేనె మొత్తం తాగేది. భల్లు బారినపడి తమ తేనె పట్టులన్ని నాశనం అయిపోతాయని తేనెటీగలు బాధపడసాగాయి. తేనెపట్టులకు కాపలా కాయాలని నిర్ణయింMANCHIMAATA{#}Mahaమంచిమాట: ఐకమత్యం ఉంటే ఎంతటి పెద్దవారినైనా ఓడించ వచ్చు..!?మంచిమాట: ఐకమత్యం ఉంటే ఎంతటి పెద్దవారినైనా ఓడించ వచ్చు..!?MANCHIMAATA{#}MahaFri, 22 Oct 2021 15:42:02 GMTఅనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ,కీటకాలు ఉండేవి. వీటన్నిటితో పాటు ఒకఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు.. దానికి తేనె అంటే మహా ఇష్టం. ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది. తేనె కోసం అడవిలో అంగుళం అంగుళం గాలించేది. వెతగ్గా వెతగ్గా ఎక్కడైనా కనిపిస్తే ఇకఅంతే! మై మరిచిపోయేది తేనెపట్టు చిటారు కొమ్మలో ఉన్న సరే... చకచకా చెక్కి తేనె మొత్తం తాగేది.

భల్లు బారినపడి తమ తేనె పట్టులన్ని నాశనం అయిపోతాయని తేనెటీగలు బాధపడసాగాయి. తేనెపట్టులకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నాయి. ఈ సంగతి పాపం భల్లుకి తెలియదు. ఒకచెట్టు మీద పెద్ద తేనెపట్టును చూసింది భల్లు. దాన్ని చూడగానే భల్లుకు నోరూరింది. నెమ్మదిగా చెట్టు ఎక్కి తేనే పట్టు దగ్గరికి వెళ్ళింది.

అక్కడ కాపలా ఉన్న ఒక తేనెటీగ భల్లును కసిగా కుట్టి తేనే పట్టు లోకి వెళ్లి దాక్కుంది. భల్లుకు కోపం వచ్చింది. తేనె పట్టును గట్టిగా చేత్తో కొట్టింది. అప్పటివరకు తేనె పట్టుకు కాపలా వున్నవి, అలాగే లోపల విశ్రాంతి తీసుకుంటున్న తేనెటీగలన్ని ఒక్కసారిగా బయటకు వచ్చి భల్లును ఒళ్లంతా కుట్టాయి. ఆ నొప్పికి తట్టుకోలేక భళ్ళు చెట్టు పై నుంచి కింద పడింది. కానీ తేనెటీగలు దాన్ని వదల్లేదు. కుడుతూనే ఉన్నాయి.. వాటి నుంచి తప్పించుకునేందుకు భల్లు వేగంగా పరుగెత్తింది. కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూనే వచ్చాయి. పరిగెడుతూ ఉన్న భల్లుకు ఒక సదస్సు కనిపించింది. హమ్మయ్య! ఇందులో దూకి ఈ తేనెటీగల నుంచి తప్పించుకుంటా! నీళ్లలోకి తేనెటీగలు రావు అనుకుంటూ వేగంగా పరిగెత్తి గబుక్కున ఆ సదస్సులో కి దూకింది. తేనెటీగలన్ని కాసేపు ఆ సదస్సు చుట్టూ మూగాయి.
 

"ఏయ్ భల్లు! మళ్లీ మా తేనె దగ్గరకు వస్తే ఊరుకోం జాగ్రత్త!"అని హెచ్చరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తరువాత సదస్సు నుంచి బయటకు వచ్చి నొప్పితో మూలుగుతూ ఇంటిముఖం పట్టింది భల్లు!.



క‌ళా 'మా' త‌ల్లి: ద‌స‌రా సెల‌వులు ముగిశాయి?

కొత్త ఐపీఎల్ టీం కోసం హీరో, హీరోయిన్ బిడ్ ..?

రాజకీయ నాయకురాలుగా తన సత్తా చాటిన జయప్రద..!!

లోకేష్ గోల్డెన్ గోల్‌ మిస్స‌య్యారే..!

వైసీపీలో ఉక్క‌బోత‌... వీళ్లంతా జంపింగ్‌కు రెడీ..!

చంద్ర‌బాబు ప్లెక్సీకి అంత్య‌క్రియ‌లు

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం..

తగ్గేదేలే :రాకేట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు..!

"హరి హర వీరమల్లు"లో పవన్ కళ్యాణ్ కొడుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>