MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-krishna1b63fb3f-8a5b-4044-8e33-ca02aae7d992-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-krishna1b63fb3f-8a5b-4044-8e33-ca02aae7d992-415x250-IndiaHerald.jpgనటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తొలిసారిగా తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన కృష్ణ, ఆ తరువాత కన్నెమనసులు, గూఢచారి 116, సాక్షి వంటి సినిమాల ద్వారా నటుడిగా పలు సక్సెస్ లు అందుకున్నారు. అనంతరం హీరోగా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని సక్సెస్ లుగా మలచుకోవడంలో పూర్తిగా సఫలం అయిన కృష్ణ అనతికాలంలోనే సూపర్ స్టార్ గా గొప్ప క్రేజ్ గడించారు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ కి పోటీగా యువత, మాస్ ప్రేక్షకుల్లో సూపర్ ఇమేజ్ అందుకున్న కృష్ణ, ఒకsuperstar krishna{#}krishna;rajeev;Eluru;Sakshi;Goodachari;NTR;Rajani kanth;Success;Mass;Congress;Tollywood;Cinemaహీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేసిన కృష్ణ .... ??హీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేసిన కృష్ణ .... ??superstar krishna{#}krishna;rajeev;Eluru;Sakshi;Goodachari;NTR;Rajani kanth;Success;Mass;Congress;Tollywood;CinemaFri, 22 Oct 2021 13:25:51 GMTనటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తొలిసారిగా తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన కృష్ణ, ఆ తరువాత కన్నెమనసులు, గూఢచారి 116, సాక్షి వంటి సినిమాల ద్వారా నటుడిగా పలు సక్సెస్ లు అందుకున్నారు. అనంతరం హీరోగా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని సక్సెస్ లుగా మలచుకోవడంలో పూర్తిగా సఫలం అయిన కృష్ణ అనతికాలంలోనే సూపర్ స్టార్ గా గొప్ప క్రేజ్ గడించారు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ కి పోటీగా యువత, మాస్ ప్రేక్షకుల్లో సూపర్ ఇమేజ్ అందుకున్న కృష్ణ, ఒక ఏడాదిలో 18 సినిమాలు కూడా రిలీజ్ చేసారు.

ఆ విధంగా అందరి నుండి మంచి పేరు అందుకున్న కృష్ణ, అటు రాజకీయాల్లో కూడా పోటీ చేసారు. అప్పటి కాంగ్రెస్ అధినేత రాజీవ్ గాంధీతో మంచి సాన్నిహిత్యం కలిగిన కృష్ణ, అనంతరం ఆయన సహకారంతో కాంగ్రెస్ తరపున ఏలూరు నుండి ఎంపీగా తొలుత పోటీ చేసారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిమిత్తం పలు ప్రాంతాలు పర్యటించి ప్రజలకు తమ మ్యానిఫెస్టో, అలానే తాను గెలిస్తే చేయదలచిన కార్యక్రమాలను ప్రజలకు వివరించిన కృష్ణ, అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ఏలూరు ప్రజలకు ఎంపీగా తన సేవలందించిన కృష్ణ అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

రాజకీయాల ద్వారా ప్రజలతో తాను మరింతగా మమేకం అయ్యే అవకాశం దొరికిందని కృష్ణ చెప్తుంటారు.. తన జీవితంలో సినిమా అనేది విడదీయలేని అనుబంధం అని, ఇక మధ్యలో కొన్నాళ్ల పటు ఎంపీగా రాజకీయాల్లో కొనసాగిన అనంతరం తనకు కొన్ని కారణాల వలన ఇకపై అటువైపు వెళ్ళకూడదు అనిపించిందని పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు కృష్ణ. ఆ విధంగా అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకుని సూపర్ స్టార్ గా నిలిచారు కృష్ణ.  



ఆ స్టార్ హీరోతో విఫలమైన తమన్నా ప్రేమాయణం.. అసలు ఏం జరిగిందంటే..?

అమెజాన్ బాదుడు మొదలు...!

2024 టార్గెట్ సెట్ చేసిన జ‌గ‌న్‌..!

కార్తికేయ ఈ సారైనా గట్టెక్కేనా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌.. కేసీఆర్‌కు బిగ్ షాక్‌..!

పసుపు పూలు : స్వామి భక్తిలో నాయకులు!

టీకా కు అర్థం మార్చిన పాలకులు

బిగ్ బాస్ 5: బిగ్ బాస్ వ్యూహంతో చిత్తయిన త్రిమూర్తులు...

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి కొత్త సెటైర్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>