MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja79d48fb9-e608-45c7-9cbd-0f34e42f3295-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja79d48fb9-e608-45c7-9cbd-0f34e42f3295-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రాణించిన రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటిగానే కాకుండా మంచి నాయకురాలుగా రాణిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. రోజా వ్యక్తిగత విషయాలకు వెళ్తే.. ఆమె చిత్తూరు జిల్లాలో జన్మించినప్పటికీ హైదరాబాద్‌లో పెరిగారు. roja{#}Rangasthalam;Chandragiri;Shambo Siva Shambo;Venkatesh;Chitram;Nagari;Jabardasth;Roja;Industry;Hanu Raghavapudi;Heroine;Tamil;prema;Love;Assembly;Cinema;Chittoor;TDP;YCPఅటు వెండితెర.. ఇటు రాజకీయంలోనూ ట్రెండ్ సెట్ చేసిన రోజా..!!అటు వెండితెర.. ఇటు రాజకీయంలోనూ ట్రెండ్ సెట్ చేసిన రోజా..!!roja{#}Rangasthalam;Chandragiri;Shambo Siva Shambo;Venkatesh;Chitram;Nagari;Jabardasth;Roja;Industry;Hanu Raghavapudi;Heroine;Tamil;prema;Love;Assembly;Cinema;Chittoor;TDP;YCPFri, 22 Oct 2021 14:45:34 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రాణించిన రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటిగానే కాకుండా మంచి నాయకురాలుగా రాణిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. రోజా వ్యక్తిగత విషయాలకు వెళ్తే.. ఆమె చిత్తూరు జిల్లాలో జన్మించినప్పటికీ హైదరాబాద్‌లో పెరిగారు. ఇక రోజా నాగార్జున యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రం చేశారు.

ఆమెకి నటనపై ఆసక్తి ఉండటంతో ఆమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. రాజా, రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్ర పరిశ్రమకి పరిచయమైయ్యారు. ఆ తరువాత ఆమె స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. అంతేకాదు.. సినీ నిర్మాతగా మరి పలు సినిమాలను నిర్మించారు.

ఇక తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి చెంబరుతి చిత్రం ద్వారా పరిచయమైయ్యారు. ఈ సినిమా విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు గుర్తింపుని తీసుకొచ్చాయి. ఆమె తమిళ డైరెక్టర్ ఆర్.కె.సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజా రెండోసారి మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో వేడితెరపై కనిపించారు. రోజా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా జబర్దస్త్ (ఈ టీవి) , బతుకు జట్కబండి (జీ తెలుగు) , రంగస్థలం (జెమిని టి.వి) వంటి కర్యక్రమాలకు హోస్టుగా రాణిస్తున్నారు.

రోజా హీరోయిన్ గానే కాకుండా రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మొదట టీడీపీలో చేరి తన రాజకీయ ప్రవేశం మొదలు పెట్టారు. ఆమె టీడీపీలో మహిళా అధ్యక్షురాలిగా రాణించారు. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె టీడీపీని విడి వైసీపీలో చేరారు. ఇక 2014లో నగరి నియోజకవర్గం వైసీపీ తరపు నుండి పోటి చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు..  2019 మే నెలలో రెండవ సారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నారు.



పెట్రోల్ ధ‌ర‌ల‌పై బీజేపీ మంత్రి వింత ప్ర‌క‌ట‌న‌.. ప్ర‌జ‌ల‌కు మండిపోదా..!

కొత్త ఐపీఎల్ టీం కోసం హీరో, హీరోయిన్ బిడ్ ..?

రాజకీయ నాయకురాలుగా తన సత్తా చాటిన జయప్రద..!!

వైసీపీలో ఉక్క‌బోత‌... వీళ్లంతా జంపింగ్‌కు రెడీ..!

చంద్ర‌బాబు ప్లెక్సీకి అంత్య‌క్రియ‌లు

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం..

తగ్గేదేలే :రాకేట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు..!

"హరి హర వీరమల్లు"లో పవన్ కళ్యాణ్ కొడుకు?

అమ్మబాబోయ్ ఇంత పెరిగిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>