PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఈ టైం అంతా బాబు కెరీర్ లోనే పెద్ద గడ్డుకాలమే అని చెప్పాలి. ఆయన ఇటు పార్టీని బలోపేతం చేయాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని త‌ప్ప‌కుండా గెలిపించాలి.. అయితే ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే ముందుగా ఎన్నికల ఖర్చు కోసం నిధులను సమీకరించాల్సి ఉంది. కానీ అధికారంలో లేని టీడీపీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అన‌డం క‌న్నా.. ఆ పార్టీ దీన‌స్థితి చూసి బాబు అంటే ఎంతో న‌మ్మ‌కం ఉన్నా పారిశ్రామిక వేత్త‌లే కాదు.. ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త‌లు సైతం చేయి విదిల్చే ప‌రిస్థితి లేదు. chandrababu tdp{#}Hanu Raghavapudi;Telugu Desam Party;TDP;Party;CBN;Cinemaటీడీపీ ఖ‌జానా ఖాళీ... నెక్ట్స్ ఏంటి.. ఈ క‌ర్మేంటి...!టీడీపీ ఖ‌జానా ఖాళీ... నెక్ట్స్ ఏంటి.. ఈ క‌ర్మేంటి...!chandrababu tdp{#}Hanu Raghavapudi;Telugu Desam Party;TDP;Party;CBN;CinemaThu, 21 Oct 2021 12:30:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముందు ఉంది అంతా అగ్ని గుండాలే. ఆయ‌న వ‌చ్చే రెండేళ్ల‌లో చాలా క‌ష్ట‌ప‌డాలి. ఈ టైం అంతా బాబు కెరీర్ లోనే పెద్ద గడ్డుకాలమే అని చెప్పాలి. ఆయన ఇటు పార్టీని బలోపేతం చేయాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని త‌ప్ప‌కుండా గెలిపించాలి.. అయితే ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే ముందుగా ఎన్నికల ఖర్చు కోసం నిధులను సమీకరించాల్సి ఉంది. కానీ అధికారంలో లేని టీడీపీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అన‌డం క‌న్నా.. ఆ పార్టీ దీన‌స్థితి చూసి బాబు అంటే ఎంతో న‌మ్మ‌కం ఉన్నా పారిశ్రామిక వేత్త‌లే కాదు.. ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త‌లు సైతం చేయి విదిల్చే ప‌రిస్థితి లేదు.

పార్టీ కి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంటే ఎవ‌రైనా ఖ‌ర్చు పెట్టేందుకు ముందుకు వ‌స్తారు. టీడీపీ కి గ‌తంలో ఎప్పుడూ లేనంత గా ఇప్పుడు ఆర్థిక వ‌న‌రుల స‌మ‌స్య ఎదుర‌వు తోంది. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌భించేందుకు కూడా ఖ‌ర్చులు లేని ప‌రిస్థితి. 2019 ఎన్నిక‌ల్లో టీడీ పీ ఏపీలో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే ... రెండేళ్లుగా నిధుల సమస్యతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంద‌ని ఆ పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. అందుకే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వ‌దిలేశార‌ని అంటున్నారు.

పార్టీ 2004, 2009లో అధికారం కోల్పోయినప్పుడు కూడా పార్టీకి భారీగానే విరాళాలు ఇచ్చారు. ఇక మీ కోసం పాద‌యాత్ర లో కూడా భారీగా నిధులు వ‌చ్చాయి. సినిమా వాళ్లు సైతం చంద్ర‌బాబుకు 2014 ఎన్నిక‌ల కు ముందే భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వారు ఎవ్వ‌రూ కూడా టీడీపీ లేదా చంద్ర‌బాబు మొఖం చూసేందుకు కూడా ఇష్ట‌ప డ‌డం లేదు. మ‌రో వైపు రెండేళ్లుగా టీడీపీ ఖ‌జానా బోసిపోయింద‌ని అంటున్నారు. టీడీపీ వాళ్ల ఆర్థిక మూలాల‌పై కూడా జ‌గ‌న్ దెబ్బ కొడుతుండ‌డం మ‌రింత ఇబ్బంది గా మారింది. దీంతో చంద్ర‌బాబు ఆర్థికంగా తీవ్రంగా స‌త‌మ‌త మ‌వుతోన్న ప‌రిస్థితే ఉంది.

 



జగన్ ఇలాకా : పైకి అత్యుత్సాహం లోపల కలవరం

తెలుగు తమ్ముళ్లలో అయోమయం !

గుంటూరు టీడీపీలో ఈ సీటు య‌మా హాట్ గురూ...!

గుంటూరు టీడీపీ ఎంపీ టిక్కెట్లు వీళ్ల‌కేనా ?

ధరల మోత... పాపం మిడిల్ క్లాస్ మ్యాన్..!

ఏపీలో పెరిగిన విద్యుత్ ఉత్ప‌త్తి

ఆయ‌న దెబ్బ‌కు వైసీపీకి ద‌బిడి దిబిడేనా..?

మోడీ మదిలో మాస్టర్ ప్లాన్.. ఏం..!

జగన్ ఇలాకా : బాబు దీక్షతో జనం మద్దతు వచ్చేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>