WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/viayam-meedhee76356ab-93f1-4b83-8b62-f853fe88edce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/viayam-meedhee76356ab-93f1-4b83-8b62-f853fe88edce-415x250-IndiaHerald.jpgకొన్ని సార్లు బ్రతకడం కూడా మన విజయమే అవుతుంది. అదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? అవును ఇది నిజమే జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఎన్నో అనుభవాలను పరిచయం చేస్తుంది. సంతోషంతో పాటు, దుఃఖం యొక్క రుచిని కూడా మనకు తెలిసేలా చేస్తుంది. కొన్ని సార్లు కాలం ఎంత కష్టంగా మారుతుంది అంటే ఊపిరి కూడా పీల్చుకోలేనంత కష్టాల ఊబిలోకి మనల్ని నెట్టేస్తుంది.VIAYAM MEEDHE{#}Avunu;Chiranjeevi;Manamవిజయం మీదే: దేవుడు తీసుకునే వరకు... ఈ జీవితం మీదే?విజయం మీదే: దేవుడు తీసుకునే వరకు... ఈ జీవితం మీదే?VIAYAM MEEDHE{#}Avunu;Chiranjeevi;ManamThu, 21 Oct 2021 21:00:00 GMTకొన్ని సార్లు బ్రతకడం కూడా మన విజయమే అవుతుంది. అదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? అవును ఇది నిజమే జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఎన్నో అనుభవాలను పరిచయం చేస్తుంది. సంతోషంతో పాటు, దుఃఖం యొక్క రుచిని కూడా మనకు తెలిసేలా చేస్తుంది. కొన్ని సార్లు కాలం ఎంత కష్టంగా మారుతుంది అంటే ఊపిరి కూడా పీల్చుకోలేనంత కష్టాల ఊబిలోకి మనల్ని నెట్టేస్తుంది. జీవితం అన్న తరువాత సుఖదుఃఖాలు సర్వ సాధారణం. ఎప్పుడూ వాతావరణం ఎలా అయితే ఒకటేలా ఉండదో, ఎలా అయితే పగలు రాత్రి కాలాలు మారుతుంటాయో అలాగే జీవితం లో కష్టసుఖాలు అనేవి వచ్చి పోతుంటాయి.

ఏవీ మన జీవితంలో ఎన్ని రోజులు ఉంటాయన్నది ఖచ్చితంగా చెప్పలేము. కానీ...ఏవీ శాశ్వతం  కాదన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి రోజుల్లో చాలా మంది యువత చిన్న చిన్న కష్టాలను కూడా భూతద్దంలో చూసి భయపడుతున్నారు. కొందరైతే తాత్కాలికమైన సమస్యలకు భయపడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన చుట్టూ అంధకారం అలుముకున్నప్పుడు చిరు దివ్వెను వెతుకుతూ దైర్యంగా ముందుకు సాగక తప్పదు. అలాంటిది ఏకంగా మన ప్రాణాలను తీసుకోవడం అంటే అది ఎంత తప్పో, ఎంత పెద్ద సరిదిద్దుకొలేని పొరపాటో ఒకసారి మీరే ఆలోచించండి.

ఎంత పెద్ద సమస్య అయినా కొన్ని సార్లు చిన్న పరిష్కారంతో పరిష్కారం అయిపోతుంది. మళ్ళీ మన జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది.అందుకోసం జీవించడం కోసం సమాజంలో నీ ఉనికి కోసం నీవు పోరాటం చేయక తప్పదు. ముందడుగు వేయక కుదరదు. అక్కడే ఆగి నిన్ను నువ్వు కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. నిజానికి అలా నడిచే మీ ప్రతి అడుగు మిమ్మల్ని మీ విజయానికి చేరువ చేస్తుంది. అదే మి విజయంగా మారుతుంది. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మళ్లీ అదే దేవుడు తీసుకునే వరకూ బ్రతకాలి అంతే..అదే సమంజసం.



ఉల్లిని చూస్తే పారిపోతున్న అమెరికన్లు..ఎందుకో తెలుసా..?

భారత్ తర్వాతి ఫిల్డింగ్ కోచ్ అతనే...!?

ఏపీలో పాలి'ట్రిక్స్‌': అసలేం జరుగుతోంది?

గంజాయి కేంద్రంగా ఏపీ?

క‌రోనా: వ‌చ్చే ఏడాది బూస్ట‌ర్‌డోస్‌?

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య.. నాగ్... ?

డీజీపీ పై నోరు పారేసుకున్న అచ్చెన్న...!

బొటనవేలి ఆకారాలు, అర్థాలు ఏంటో తెలుసా ?

భారత్ - పాక్ : జట్టును ప్రకటించిన సెహ్వాగ్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>