రఘరామరాజులా చేస్తారేమో- శరీరం చూపిస్తూ పట్టాభి : ఒక్క సంఘటన చాలంటూ రెబల్ ఎంపీ..!!
రెండు రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఆయన పైన కేసు నమోదు చేసారు. పట్టాభి ఇంటి వద్ద బుధవారం మధ్నాహ్నం నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి..మంత్రులు..డీజీపీ అందరూ తప్పు బట్టారు. చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, తన అరెస్ట్ ఖాయమని నిర్ధారణకు వచ్చిన పట్టాభి ఒక వీడీయో విడుదల చేసారు.

రఘురామ రాజు అంశాన్ని ప్రస్తావించిన పట్టాభి
అందులో...పోలీసులు అర్ధరాత్రి అయినా నన్ను అరెస్టు చేస్తారు. బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి జిమ్మిక్కులైనా చేస్తుంది. ఆధారాలను ఎలాగైనా మార్పు చేస్తుంది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు ఉదంతం చూసిన తర్వాత ఈ వీడియోను విడుదల చేయాల్సి వస్తోంది. నన్ను పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టడానికి సీఎం కుట్ర పన్నాడు. అందుకే నా శరీరం మొత్తాన్ని చూపిస్తున్నాం'' అని ఆ వీడియోలో పట్టాభి పేర్కొన్నారు. ఇక, పట్టాభి అరెస్ట్ సమయంలో పోలీసులు ఆయన సతీమణికి నోటీసు ఇచ్చారు.

అరెస్ట్ కు ముందు పట్టాభి వీడియో
పట్టాభిపై నమోదైన కేసులతో పాటు, ఆయనను అరెస్టు చేసి విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చుతున్నట్టు పేర్కొన్నారు. అనంతరం భారీ కాన్వాయ్ మధ్య పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎస్ లో కేసు నమోదైంది. ఇక, పట్టాభి అరెస్ట్ పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. పట్టాభి వీడియోలో తన పేరు ప్రస్తావించటం... ఆయన ఆవేదన చూస్తుంటే బాధ కలిగిందన్నారు.

సీఎంకు రఘురామ రాజు సలహా
అర్డ్రరాత్రి అరెస్ట్ చేయటాన్ని ఖండించారు. పార్టీకి..ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఒక్క సంఘటన చాలని..మొత్తం ప్రభుత్వానికి నష్టం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి... సజ్జల.. పోలీసులు సంయమనం పాటించాలని రఘురామ సూచించారు. పట్టాభిని పోలీస్ కస్టడీకి కాకుండా.. జ్యూడీషియల్ రిమాండ్ కు పంపాలని రఘురామ పేర్కొన్నారు. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ నేత లోకేశ్ ఖండించారు. ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యతని.. తక్షణం పట్టాభిని కోర్టు ముందు హాజరుపర్చాలని లోకేశ్ డిమాండ్ చేసారు.