PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_tvnews/ktr3b597af2-a6cb-4261-9f3f-3a23105ee55c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_tvnews/ktr3b597af2-a6cb-4261-9f3f-3a23105ee55c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌ఫుల్ మాట‌ల‌నే తూటాలుగా మార్చ‌గ‌ల నేత రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. బాల్ ను గోడకు కొడితే అది అంత‌క‌న్న వేగంతో వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు.. రేవంత్‌ను ఎవ‌రేమ‌న్నా వేగంగా విమ‌ర్శల‌తో మొహం ప‌గుల‌గొడుతారు. ఇప్పుడు అలాగే కేటీఆర్‌పై విరుచుకుపడ్డాడు. మొన్న‌టి వ‌ర‌కు కేటీఆర్ ను ఓ ఆటాడుకున్న రేవంత్‌ కోర్టు ఆదేశాల‌తో కొంచెం వెన‌క్కి త‌గ్గాడు. మ‌ళ్లీ ఇప్పుడు కేటీఆర్ పిలిచి క‌య్యం పెట్టుకోవ‌డంతో ఇక రేవంత్ ఆగ‌లేదు. మంత్రి కేటీఆర్ పిలిచి కాలు దువ్విన‌ట్ట‌యింది. రేవంత్ చిల‌క జోష్యం చెపktr vs revanth {#}KTR;revanth;Revanth Reddy;TPCC;Father;job;Congress;Minister;court;Partyకేటీఆర్ ను మ‌ళ్లీ ఇరికించిన రేవంత్‌రెడ్డి..!కేటీఆర్ ను మ‌ళ్లీ ఇరికించిన రేవంత్‌రెడ్డి..!ktr vs revanth {#}KTR;revanth;Revanth Reddy;TPCC;Father;job;Congress;Minister;court;PartyThu, 21 Oct 2021 13:03:27 GMTతెలంగాణ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌ఫుల్ మాట‌ల‌నే తూటాలుగా మార్చ‌గ‌ల నేత రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. బాల్ ను గోడకు కొడితే అది అంత‌క‌న్న వేగంతో వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు.. రేవంత్‌ను ఎవ‌రేమ‌న్నా వేగంగా విమ‌ర్శల‌తో మొహం ప‌గుల‌గొడుతారు. ఇప్పుడు అలాగే కేటీఆర్‌పై విరుచుకుపడ్డాడు. మొన్న‌టి వ‌ర‌కు కేటీఆర్ ను ఓ ఆటాడుకున్న రేవంత్‌ కోర్టు ఆదేశాల‌తో కొంచెం వెన‌క్కి త‌గ్గాడు. మ‌ళ్లీ ఇప్పుడు కేటీఆర్ పిలిచి క‌య్యం పెట్టుకోవ‌డంతో ఇక రేవంత్ ఆగ‌లేదు.


  మంత్రి కేటీఆర్ పిలిచి కాలు దువ్విన‌ట్ట‌యింది. రేవంత్ చిల‌క జోష్యం చెప్పుకుంటే మంచిది, హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్క‌య్యాయి.. అందుకే అక్క‌డ కాంగ్రెస్ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని పెట్టారని, డిపాజిట్ కూడా పార్టీకి రాద‌ని చెప్పారు. రేవంత్  టీపీసీసీ చీఫ్ అయిన త‌రువాత మొద‌టిసారి జ‌రుగుతున్న ఎన్నిక ద్వారా ప‌రువు పోతుంద‌ని వ్యాఖ్యానించారు. డ్ర‌గ్స్ విష‌యంలో కోర్టు సూచ‌న‌తో వెన‌క్కి త‌గ్గి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఏమో ఓ ప్రాంతీయ పార్టీకి చెందిన వాడు. నేను జాతీయ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని, కేటీఆర్ చిన్న‌పిల్ల‌గాడు అంటూ త‌న‌కు నాకు పోలిక అన్న‌ది ఉత్త మాట అని ఎద్దేవా చేశారు.

   
   నేను కింది స్థాయి నుంచి వ‌చ్చి ఈ పోజీష‌న్‌లో ఉన్నాని, కేటీఆర్ తండ్రిచాటు బిడ్డ‌ని.. ఎక్క‌డో అమెరికాలో  ఉద్యోగం చేసుకునే వాడిని తీసుకువ‌చ్చార‌ని, ఉద్య‌మంలో కాసేపు అటూ ఇటూ తిప్పార‌ని చెప్పారు. రాష్ట్రం అవ‌త‌రించి తండ్రి సీఎం అయిన త‌రువాత వెనుకు నుంచి కేటీఆర్ మంత్రి అయ్యాడ‌ని రేవంత్ గుర్తుచేశారు. ఇద్ద‌రి రాజ‌కీయ జీవితాల‌ని పోల్చి చూడాల‌ని చెప్పారు. రాజ‌కీయాలను, పార్టీల‌ను, ప‌ద‌వుల‌ను ఎక్క‌డ చూసినా కేటీఆర్ త‌న‌తో స‌మానం కాద‌ని, ఎప్ప‌టికీ కాడ‌ని చెప్పుకొచ్చాడు రేవంత్‌. న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌ని ఎక్క‌డైనా, ఎప్పుడైనా చ‌ర్చ‌కు సిద్ధం అని స‌వాల్ విసిరారు.



100 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ ఏమన్నారో తెలుసా?

బిగ్ బాస్ 5: ప్రియలో ఈ మార్పుకు అదే కారణమా?

నారా భువ‌నేశ్వ‌రిపై రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టీడీపీ ఖ‌జానా ఖాళీ... నెక్ట్స్ ఏంటి.. ఈ క‌ర్మేంటి...!

రాజ‌కీయాలంటే ఐప్యాక్‌లా ఉండ‌వు పీకే అంకుల్‌..?

తెలుగు తమ్ముళ్లలో అయోమయం !

గుంటూరు టీడీపీలో ఈ సీటు య‌మా హాట్ గురూ...!

గుంటూరు టీడీపీ ఎంపీ టిక్కెట్లు వీళ్ల‌కేనా ?

ధరల మోత... పాపం మిడిల్ క్లాస్ మ్యాన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>