Cheating: రాత్రి శోభనం, ఉదయం పెళ్లి కూతురు ఎస్కేప్, ఐదు మంది లేడీస్ సర్వనాశనం చేశారని !
చెన్నై/ తిరుప్పూర్: సొంతపోలంలో వ్యవసాయం చేయిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న యువకుడు చాలా సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతమంది అమ్మాయిలను చూసినా అతనికి పెళ్లి సెట్ కాలేదు. నీకు ఈ జన్మలో పెళ్లి జరగదని, ఏ అమ్మాయి నీకు సెట్ కాదని అతన్ని స్నేహితులు ఆటపట్టించారు, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. పెళ్లిళ్లు చేయిస్తున్న ఓ లేడీని కలిసిన అతను తనకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలని చెప్పాడు. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని, నాకు రూ. 1.50 లక్షలు కమీషన్ ఇవ్వాలని ఆ లేడీ చెప్పింది. అనుకున్నట్లు ఓ అమ్మాయిని చూసి నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి వెంటనే జరిగిపోవాలని పెళ్లి కొడుకు పట్టబట్టాడు. పెళ్లి కూతురికి కావలసిన బంగారు నగలు, పట్టుచీరలు, పెళ్లి ఖర్చులకు డబ్బు మొత్తం పెళ్లి కొడుకే ఇచ్చాడు. గుడిలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు ఐదు మంది సమక్షంలో పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి చేసి ఆంటీకి పెళ్లి కొడుకు రూ. 1.30 లక్షలు ఇచ్చాడు. పెళ్లి జరిగిన రోజు శోభనం జరిగింది. మరుసటి రోజు పెళ్లి కూతురు నగలు మొత్తం వేసుకుని పట్టుచీర కట్టుకుని పెళ్లి కొడుక్కి కనపడింది. నా భార్య చాలా అందంగా ఉందని మరిసిపోయాడు. అంతే తరువాత పెళ్లి కూతురు అడ్రస్ లేదు. పెళ్లి కొడుకు ఆమె కోసం గాలించి విసిగిపోయాడు. తరువాత తెలిసింది అతనికి అసలు మ్యాటర్. ఐదు మంది లేడీస్ కలిసి నా జీవితం సర్వనాశనం చేశారని తెలుసుకున్న పెళ్లి కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ లో అసలు కథ మొదలైయ్యింది.
Illegal affair: భర్త మేనల్లుడితో భార్య ?, ఇంటర్ విద్యార్థికి ఆడదాని రుచి చూపించింది, క్లైమాక్స్ లో !

పెళ్లి చేసుకోవాలని ఆశ
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని గున్నత్తూరులో నివాసం ఉంటున్న మారప్పన్ కు రాజేంద్రన్ (34) అనే కుమారుడు ఉన్నాడు. సొంతపోలంలో వ్యవసాయం చేయిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న రాజేంద్రన్ కొన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతమంది అమ్మాయిలను చూసినా రాజేంద్రన్ కు పెళ్లికూతురు సెట్ కాలేదు.

నీకు ఈజన్మలో పెళ్లికాదని ఎగతాలి చేసిన ఫ్రెండ్స్
నీకు ఈ జన్మలో పెళ్లి జరగదని, ఏ అమ్మాయి నీకు సెట్ కాదని రాజేంద్రన్ ను అతని స్నేహితులు ఆటపట్టించారు, కనపడిన ప్రతిసారి నీకు ఫెళ్లి ఎప్పుడురా ? అంటూ ఫ్రెండ్స్ ఎగతాలి చెయ్యడంతో రాజేంద్రన్ రగిలిపోయాడు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని రాజేంద్రన్ డిసైడ్ అయ్యాడు. పెళ్లిళ్లు చేయిస్తున్న ఈరోడ్డు జిల్లాలోని సిరువల్లూరులో నివాసం ఉంటున్న అంబిక (38) అనే లేడీని కలిసిన రాజేంద్రన్ తనకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలని ఆమెను ప్రాదేయపడ్డా

చూసి తట్టుకోలేకపోయాడు
ఈరోడ్డుకు చెందిన అంబిక మరో పెళ్లిళ్ల బ్రోకర్ వల్లియమ్మాళ్ అనే మహిళను రాజేంద్రన్ కు పరిచయం చేసింది. అంబిక, వల్లియమ్మాల్ కలిసి రీసా (27) అనే అమ్మాయిని చూపించారు. రీసాను చూసిన రాజేంద్రన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు, రీసా కూడా రాజేంద్రన్ ను వివాహం చేసుకుంటానని అందరి ముందు చెప్పింది.

ఒత్తిడి చేసిన పెళ్లి కొడుకు
రీసా తల్లిదండ్రులు చనిపోయారని, ఆమెకు పెద్దమ్మ ఉందని అంబిక రాజేంద్రన్ కు చెప్పింది. రిసా చిన్నమ్మ అంటూ పెరియమ్మదేవి అనే మహిళను, రిసా కజిన్ అని తంగం (36) అనే మహిళను రాజేంద్రన్ కు పరిచయం చేశారు. గత నెల 22వ తేదీన రాజేంద్రన్, రిసా నిశ్చితార్థం జరిగింది. రాజేంద్రన్ కుటుంబ సభ్యులు, రీసా వైపు నుంచి కొంత మంది మహిళలు నిశ్చితార్థానికి హాజరైనారు. పెళ్లి త్వరగా జరిగిపోవాలని రాజేంద్రన్ పట్టుబట్టాడు.

పెళ్లికి A to Z ఇచ్చిన పెళ్లి కొడుకు
గత నెల 22వ తేదీ నిశ్చితార్థం చేసుకున్న రాజేంద్రన్ రెండు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని రిసా మీత ఒత్తిడి చేశాడు. నీకు రిసాతో త్వరగా పెళ్లి చేస్తానని, మాకు రూ. 1.50 లక్షలు కమీషన్ ఇవ్వాలని అంబిక పెళ్లి కొడుకు రాజేంద్రన్ కు చెప్పింది. డబ్బులు ఇస్తానని రాజేంద్రన్ అంబిక, మరో మహిళకు చెప్పాడు. పెళ్లి కూతురు రీసాకు కావలసిన బంగారు నగలు, పట్టుచీరలు, పెళ్లి ఖర్చులకు డబ్బు మొత్తం పెళ్లి కొడుకు రాజేంద్రన్ ఇచ్చాడు.

రూ. 1.30 లక్షలు కమీషన్ తీసుకున్న ఆంటీ
నిశ్చితార్థం జరిగిన రెండు రోజుల్లోనే (గత నెల 24వ తేదీ)న పచ్చంపాలయంలోని శ్రీ సెల్లండియమ్మన్ ఆలయంలో రాజేంద్రన్, రీసాల వివాహం జరిగింది. గుడిలో పెళ్లి కొడుకు రాజేంద్రన్ కుటుంబ సభ్యులు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు ఐదు మంది మహిళల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. పెళ్లి చేసిన అంబిక ఆంటీకి పెళ్లి కొడుకు రాజేంద్రన్ రూ. 1.30 లక్షలు ఇచ్చాడు.

రాత్రి శోభనం.... ఉదయం పెళ్లి కూతురు ఎస్కేప్
పెళ్లి జరిగిన రోజు రాజేంద్రన్, రీసా శోభనం జరిగింది. మరుసటి రోజు పెళ్లి కూతురు రీసా పెళ్లి కొడుకు రాజేంద్రన్ తీసిచ్చిన నగలు మొత్తం వేసుకుని పట్టుచీర కట్టుకుని రాజేంద్రన్ కు కనపడింది. నా భార్య రీసా చాలా అందంగా ఉందని రాజేంద్రన్ మరిసిపోయాడు. తరువాత సొంత ఊరికి వెళ్లడానికి రాజేంద్రన్ కారు సిద్దం చేశాడు. తరువాత పెళ్లి కూతురు రీసాతో కలిసి ఊరికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం రీసా మాయం అయిపోయింది. రీసా కోసం పెళ్లి కొడుకు రాజేంద్రన్ వెతికినా ఆమె ఆచూకి చిక్కలేదు.

పెళ్లి కూతురు కాదు..... పిల్లల తల్లి
నా భార్య రీసా కనపడటం లేదని రాజేంద్రన్ పెళ్లి చేసిన అంబికకు చెప్పాడు. పెళ్లి చెయ్యడం వరకు నా భాద్యత, తరువాత నీ ఖర్మనీది అంటూ అంబిక నిర్లక్షం చేసింది, పెళ్లి కూతురు రీసాతో పాటు ఆమె పెద్దమ్మ పెరియమ్మదేవి, తంగం మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. కొంపమునిగిందని తెలుసుకున్న రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో రీసాకు ఇంతకు ముందే శ్రీధరన్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని వెలుగు చూసింది.