MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasarid4ae96ef-a4e6-459d-bf4b-d2a2c0f0bad2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasarid4ae96ef-a4e6-459d-bf4b-d2a2c0f0bad2-415x250-IndiaHerald.jpgఆయన నిరంతర శ్రామికుడు. ఒక వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారిన ధీశాలి. ఆయన బహుముఖ ప్రతిభా ధురీణుడు. ఆయనకు పరిచయం లేని రంగం లేదు. ఆయన ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. ఆయనకు ఆయనే సాటి. ఆయనే దాసరి నారాయణరావు. దర్శకరత్న అని ఆయనకు బిరుదు ఉంది. అభిమానులు ఆయన్ని అలాగే పిలుస్తారు. దాసరి సినిమా రంగానికి అరవై దశకం చివరలో వచ్చారు. ఆయన దర్శకుడు అవుదామని రాలేదు. నటించాలనే వచ్చారు. dasari{#}Wifeభార్య నగలు సైతం అమ్మేసిన దాసరి... ?భార్య నగలు సైతం అమ్మేసిన దాసరి... ?dasari{#}WifeThu, 21 Oct 2021 20:00:00 GMTఆయన నిరంతర శ్రామికుడు. ఒక వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారిన ధీశాలి. ఆయన బహుముఖ ప్రతిభా ధురీణుడు. ఆయనకు పరిచయం లేని రంగం లేదు. ఆయన ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. ఆయనకు ఆయనే సాటి. ఆయనే దాసరి నారాయణరావు.

దర్శకరత్న అని ఆయనకు బిరుదు ఉంది. అభిమానులు ఆయన్ని అలాగే పిలుస్తారు. దాసరి సినిమా రంగానికి అరవై దశకం చివరలో వచ్చారు. ఆయన దర్శకుడు అవుదామని రాలేదు. నటించాలనే వచ్చారు. అందెం కోసం పందెం అన్న మూవీలో చిన్న పాత్ర కోసం వచ్చిన ఆయనకు అక్కడ సరైన అవకాశం రాకపోవడంతో వెనక్కి వెళ్లడం ఇష్టం లేక అక్కడే తేల్చుకుందామనుకున్నారు. అలా సహాయ దర్శకుడిగా, మాటల రచయితగా చేరి 1974లో తాతా మనవడు మూవీ ద్వారా దర్శకుడు అయ్యారు. ఆ మూవీని కధే హీరోగా తీశారు. బ్లాక్ అండ్ వైట్ లో తీస్తే సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత వరసగా పన్నెండు సినిమాలు హిట్ల మీద హిట్లు కొట్టాయి.

ఇక దాసరికి తిరుగులేదు అనుకున్నారు అంతా. ఆయన వద్ద పదుల సంఖ్యలో నిర్మాతల అడ్వాన్సులు ఉండేవి. అయితే ఆయన తీసిన ముద్దబంతి పూవు మూవీ పరాజయం పాలు అయింది. అంతే దాసరి నుంచి నిర్మాతలు అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారు. ఒక దశలో దాసరి వద్ద డబ్బులు లేకపోతే భార్య పద్మ నగలు అమ్మేసి మరీ వారి సొమ్ము తిరిగి ఇచ్చేశారు. ఇది నిజంగా విధి విచిత్రమే అనుకోవాలి. ఆ టైమ్ లో దాసరి మళ్ళీ పులిలా గర్జించారు. కసి మీద సినిమాలు చేశారు. అలా తీసిన సినిమావే కటకటాల రుద్రయ్య. అంతే ఆ మూవీ తరువాత దాసరి వెనక్కి చూసుకోలేదు. ఇండస్టీలో ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ శోభన్, చిరంజీవి, బాలయ్య,నాగార్జున మోహన్ బాబు ఇలా అందరితోనూ మూవీస్ తీసి హిట్లు కొట్టిన ఘనత ఆయనదే అని చెప్పాలి. మొత్తానికి దాసరి లాంటి లెజెండ్ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని చెప్పడానికే ఇదంతా అని ఆయన వద్ద కో డైరెక్టర్ గా పనిచేసిన నందం హరిశ్చంద్రరావు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దటీజ్ దాసరి అనాల్సిందే కదా.





ఇంతకీ ఎవరి మైలేజ్ ఎంతెంత... ?

భారత్ తర్వాతి ఫిల్డింగ్ కోచ్ అతనే...!?

ఏపీలో పాలి'ట్రిక్స్‌': అసలేం జరుగుతోంది?

గంజాయి కేంద్రంగా ఏపీ?

క‌రోనా: వ‌చ్చే ఏడాది బూస్ట‌ర్‌డోస్‌?

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య.. నాగ్... ?

డీజీపీ పై నోరు పారేసుకున్న అచ్చెన్న...!

బొటనవేలి ఆకారాలు, అర్థాలు ఏంటో తెలుసా ?

భారత్ - పాక్ : జట్టును ప్రకటించిన సెహ్వాగ్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>