PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagane03e6271-6af7-492e-bec1-b85dbe13469a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagane03e6271-6af7-492e-bec1-b85dbe13469a-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి...ప్రజల కష్టాలని తొలగించాల్సిన నాయకులు...రోడ్లపైకి వచ్చి బూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేసేశారు. అసలు విమర్శలు చేయకుండా...తిడతామని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు...తిడితే కొడతామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వెరసి మొత్తం రాష్ట్రంలో రచ్చ చేస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సి‌ఎం జగన్ సైతం...దాడులని పరోక్షంగా ప్రోత్సహించడం చాలా దారుణమైన విషయం. jagan{#}politics;Jagan;Raccha;Telugu;YCP;CBNఆ బూతులు వినలేదంటున్న జగన్... బాబుకు అదే పని...!ఆ బూతులు వినలేదంటున్న జగన్... బాబుకు అదే పని...!jagan{#}politics;Jagan;Raccha;Telugu;YCP;CBNThu, 21 Oct 2021 01:00:00 GMTఏపీ రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి...ప్రజల కష్టాలని తొలగించాల్సిన నాయకులు...రోడ్లపైకి వచ్చి బూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేసేశారు. అసలు విమర్శలు చేయకుండా...తిడతామని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు...తిడితే కొడతామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వెరసి మొత్తం రాష్ట్రంలో రచ్చ చేస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సి‌ఎం జగన్ సైతం...దాడులని పరోక్షంగా ప్రోత్సహించడం చాలా దారుణమైన విషయం.

టి‌డి‌పి నేత పట్టాభి...జగన్‌ని దూషించడం చాలా తప్పు. ఒక సి‌ఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా అనకూడదు. మరి ఇటు చూస్తే 14 ఏళ్ళు సి‌ఎం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని వైసీపీ నేతలు ఎన్ని రకాల బూతులతో తిట్టారో జనాలకు బాగా తెలుసు. అలా తిట్టడం కరెక్ట్ కాదు. కానీ జగన్ ఏకపక్షంగా...తమని టి‌డి‌పి నేతలు దారుణంగా తిడుతున్నారని, అలాంటి బూతులు కూడా ఎప్పుడూ వినలేదని, అవి తట్టుకోలేకే తన అభిమానులు బీపీ పెంచుకుని దాడులకు దిగారన్నట్లుగా మాట్లాడుతున్నారు.

అంటే జగన్‌కు బూతులు తెలియవు...అలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. ఇక చంద్రబాబు నిత్యం బూతులు మాట్లాడుతున్నారు...టి‌డి‌పి నేతలకు అదే పని..కానీ వైసీపీ నేతలకు బూతులు అంటే తెలియవు...ఎప్పుడూ మాట్లాడలేదు. అని చెబితే నమ్మడానికి జనాలు చెవుల్లో పువ్వులు లేవనే చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్...చంద్రబాబుని ఉద్దేశించి ఎలా మాట్లాడారు...అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎలా బూతులు మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు. ఆ విషయం జగన్‌కు తెలియకపోవడం కాస్త వింతే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

సరే పట్టాభి బూతులు తిడితే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు గానీ, బీపీ వచ్చి దాడులు చేశారని, దాన్ని సమర్ధించుకోవడం పట్ల జగన్ సమాజనికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. అటు చంద్రబాబు అయినా, ఇటు జగన్ అయినా తమ తమ నాయకులని కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరముంది. అలా కాకుండా బూతులు మాట్లాడితే జనమే గడ్డి పెడతారు.



ఆ బూతులు వినలేదంటున్న జగన్... బాబుకు అదే పని...!

ఆ విషయం లో రవితేజ నిర్ణయమే కరక్ట్!!

సూపర్ స్టార్ తప్పుకుంటే రెబెల్ స్టార్... ?

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న చంద్రబాబు... ?

లవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!

అద్భుతం.. పంది మూత్రపిండాలు మనిషికి?

శర్వా.. ఏమైందయ్యా నీకు..!

' శ్యామ్ సింగ రాయ్ ' కు క‌ళ్లు చెదిరిపోయే డీల్‌...!

ప్రభాస్ కు తలనొప్పిగా మారిన భార్య భర్తలు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>