PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban79f6d4f5-16d9-42a9-be38-af79cea59ac0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban79f6d4f5-16d9-42a9-be38-af79cea59ac0-415x250-IndiaHerald.jpgప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబాన్లు... ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇప్పటికే అక్కడ తమ చట్టాలను అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కూడా. అదే సమయంలో కఠిన నియమాలు కూడా అమలు చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అక్కడ తీవ్ర పౌష్టిక ఆహార లోపం తలెత్తినట్లు ఐక్య రాజ్య సమితి ఆహార భద్రతా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది కూడా. ఈ సమయంలో తమను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాల వైపు ఆఫ్ఘాన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.Taliban{#}Moscow;Santosham;Narendra Modi;India;Prime Ministerఆఫ్ఘాన్ల ఆకలి తీర్చనున్న భారత్...!ఆఫ్ఘాన్ల ఆకలి తీర్చనున్న భారత్...!Taliban{#}Moscow;Santosham;Narendra Modi;India;Prime MinisterThu, 21 Oct 2021 16:26:08 GMTప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబాన్లు... ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇప్పటికే అక్కడ తమ చట్టాలను అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కూడా. అదే సమయంలో కఠిన నియమాలు కూడా అమలు చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అక్కడ తీవ్ర పౌష్టిక ఆహార లోపం తలెత్తినట్లు ఐక్య రాజ్య సమితి ఆహార భద్రతా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది కూడా. ఈ సమయంలో తమను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాల వైపు ఆఫ్ఘాన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ భారత్ ముందుకు వచ్చింది. ఆఫ్ఘాన్ల ఆకలి తీర్చేందుకు తక్షణ సాయం కింద 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల్ని వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పంపాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. రవాణా సమస్యలు పరిష్కరం అయిన వెంటనే... మరింత సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చింది. దాదాపు రెండు నెలలుగా ఆఫ్ఘానిస్తాన్‌ దేశంలో తాలిబన్ల రాజ్యం కొనసాగుతోంది.

తాలిబన్ల తీరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... వారితో ఎలా వ్యవహరించాలనే అంశంపై భారత సర్కార్ ఓ క్లారిటీకి వచ్చింది. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు దఫాల చర్చలు విజయవంతమయ్యాయి కూడా. ఆఫ్ఘానిస్థాన్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న భారత్ సర్కార్... భారీ సాయం చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చర్చల సమయంలో అధికారులు స్పష్టం చేశారు. భారత్ హామీపై తాలిబన్లు సంతోషం వ్యక్తం చేశారు. భారత్ తరఫున విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్ చర్చల్లో పాల్గొనగా.... తాలిబన్ల తరఫున డిప్యూటీ ప్రధాని అబ్దుల్ సలామ్ హనాఫీ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలపై కీలకంగా చర్చలు జరిపారు. ఆఫ్ఘానిస్థాన్ ఉగ్రవాదులు, తీవ్ర వాదులకు అడ్డగా మారకూడదని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం తమ వంత సాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. భారత్ చేసే సాయం పూర్తిగా ఐక్య రాజ్య సమితి ద్వారా హామీ ఇచ్చారు జేపీ సింగ్. ఇదే సమయంలో గతంలో జరిగిన మాస్కో ఫార్మెట్ చర్చల్ని తిరిగి కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.



ప్రభాస్ కాబోయే భార్య తనే.. అసలు విషయం చెప్పిన కృష్ణంరాజు..!!

వాళ్ళను వదిలిపెట్టొద్దన్న జగన్...!

వాళ్లంతే! : జనం తిట్లను పట్టించుకోరు సర్?

తెలంగాణ నిరుద్యోగులకు శుభ‌వార్త‌..!

పార్టీలకు బీపి.. వణుకుతున్న ఏపీ.. కారణం..!

పాక్ ఆర్థిక సంక్షోభం: ఇమ్రాన్ గిఫ్ట్ ను కూడా అమ్ముకున్నాడా?

పవన్ కెరీర్ లో అల్ టైం హిట్ సాంగ్ ఇదే?

100 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ ఏమన్నారో తెలుసా?

అయ్యన్నకు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>