PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-300d565f-4946-4cd9-a970-d40938c5d61c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-300d565f-4946-4cd9-a970-d40938c5d61c-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తెలంగాణ రాజ‌కీయాల స‌మీక‌ర‌ణ‌ల‌కు వేదిక‌గా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. హుజురాబాద్ ఎన్నిక‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ రెచ్చ‌గొడుతున్న ఆ దిశ‌గా స్పందిచ‌ని రేవంత్ రాష్ట్ర వ్యాప్తం స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రేవంత్ ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఓట‌మికి మ‌హాకూట‌మిని మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. mahakutami{#}Telangana Rashtra Samithi TRS;revanth;Revanth Reddy;Congress;Huzurabad;Telangana;Partyతెలంగాణ‌లో మ‌రోసారి మ‌హాకూట‌మి.. ఈసారి విజ‌య‌మేనా..?తెలంగాణ‌లో మ‌రోసారి మ‌హాకూట‌మి.. ఈసారి విజ‌య‌మేనా..?mahakutami{#}Telangana Rashtra Samithi TRS;revanth;Revanth Reddy;Congress;Huzurabad;Telangana;PartyThu, 21 Oct 2021 14:05:06 GMT హుజురాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తెలంగాణ రాజ‌కీయాల స‌మీక‌ర‌ణ‌ల‌కు వేదిక‌గా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. హుజురాబాద్ ఎన్నిక‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ రెచ్చ‌గొడుతున్న ఆ దిశ‌గా స్పందిచ‌ని రేవంత్ రాష్ట్ర వ్యాప్తం స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రేవంత్ ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఓట‌మికి మ‌హాకూట‌మిని మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.


  అయితే, దాదాపు 2 ఏళ్ల నుంచి అధికార పార్టీపై పోరాడేందుకు శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నాలు చేస్తుంటే. తీరా ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి పొత్తులు, కూట‌మి ఏర్ప‌డితే త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని స‌ద‌రు నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కూట‌మితో క‌లిసి పోరాటం చేస్తే బ‌లియ‌మైన శ‌క్తిగా అధికార పార్టీని ఎదుర్కొవ‌డం  సుల‌భం అవుతుంద‌న్న ఆలోచ‌న బాగానే ఉన్నా. గ‌త ఎన్నిక‌ల అనుభవం వెంటాడుతూనే ఉంది. 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌నస‌మితితో క‌లిసి పొత్తులో భాగంగా గెలిచే సీటును వేరే పార్టికి ఇచ్చి న‌ష్ట‌పోయిన విష‌యాన్ని కాంగ్రెస్‌లో కొంద‌రు ప్ర‌స్తావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


     అయితే, పొత్తు-కూట‌మి వ‌ల్ల కాంగ్రెస్ గెలిచే సీట్లను కూడా న‌ష్ట‌పోయింద‌ని ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు అంటున్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు ఉమ్మ‌డి పోటి వ‌ల్ల జ‌రిగే న‌ష్టంపైనే ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతున్న‌ట్టు అనిపిస్తోంది. కూటిమి పేరుతో ప్ర‌జ‌ల్లో బ‌లం లేని పార్టీల‌ను క‌లుపుకుని పోతే పార్టీకి న‌ష్టం త‌ప్పా లాభం లేద‌నే భావ‌న హ‌స్తం పార్టీలో వినిపిస్తోంది. అందుకే పార్టీని న‌మ్ముకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుత‌న్న నేత‌లు పొత్తుల లెక్క‌లు ఎలా ఉంటాయో చెబితే అందుకు త‌గ్గ‌ట్టు తాము సిద్దంగా ఉంటామ‌ని చెబుతున్నారు.


   కానీ, కూట‌మి పై రాష్ట్రా స్థాయి నేత‌లు కాకుండా అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుంది కాబ‌ట్టి .. త‌మ తాము చేసుకుంటూ పోతే మంచిద‌ని కొంద‌రు అనుకుంటున్నార‌ట‌. అయితే, రేవంత్ మాత్రం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త  ఓటు చీల‌కుండా బ‌లంగా ఉండాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.



మోడీ 007.. అసలు నిజాలు దాస్తున్న మమత?

వాళ్ళను వదిలిపెట్టొద్దన్న జగన్...!

వాళ్లంతే! : జనం తిట్లను పట్టించుకోరు సర్?

తెలంగాణ నిరుద్యోగులకు శుభ‌వార్త‌..!

పార్టీలకు బీపి.. వణుకుతున్న ఏపీ.. కారణం..!

పాక్ ఆర్థిక సంక్షోభం: ఇమ్రాన్ గిఫ్ట్ ను కూడా అమ్ముకున్నాడా?

పవన్ కెరీర్ లో అల్ టైం హిట్ సాంగ్ ఇదే?

100 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ ఏమన్నారో తెలుసా?

అయ్యన్నకు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>