BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dgpd2471b32-2f64-479a-850b-a4505f0d0b55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dgpd2471b32-2f64-479a-850b-a4505f0d0b55-415x250-IndiaHerald.jpg రాబోయే రోజుల్లో తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత న‌క్కా ఆనంద్‌బాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. డీజీపీకి తెలిసే, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే తెదేపా కార్యాల‌యాలు, నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను హ‌రించివేస్తోంద‌ని, వాటిని కాల‌రాచేలా ప్ర‌భుత్వ ప‌నితీరు ఉందంటూ ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచ‌కాల‌కు పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని, భ‌విష్య‌త్తులో ఈ వ‌త్తాసుకు త‌గిన మూల్యం చెల్లించdgp{#}Y. S. Rajasekhara Reddy;Telugu Desam Party;Minister;police;Party;TDP;YCPడీజీపీకి తెలిసే దాడులు జ‌రిగాయా?డీజీపీకి తెలిసే దాడులు జ‌రిగాయా?dgp{#}Y. S. Rajasekhara Reddy;Telugu Desam Party;Minister;police;Party;TDP;YCPWed, 20 Oct 2021 12:14:14 GMT

రాబోయే రోజుల్లో తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత న‌క్కా ఆనంద్‌బాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. డీజీపీకి తెలిసే, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే తెదేపా కార్యాల‌యాలు, నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను హ‌రించివేస్తోంద‌ని, వాటిని కాల‌రాచేలా ప్ర‌భుత్వ ప‌నితీరు ఉందంటూ ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచ‌కాల‌కు పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని, భ‌విష్య‌త్తులో ఈ వ‌త్తాసుకు త‌గిన మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. క‌ళ్ల‌ముందే దాడులు జ‌రుగుతున్నా పోలీసులు నిలువ‌రించ‌డం మానేశార‌ని, వారికి ముంద‌స్తుగా స‌మాచారం ఉన్నా నిరోధించ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేద‌ని మంత్రి మండిప‌డ్డారు. ఎన్నిరోజులు ఈ అరాచ‌క పాల‌న సాగుతుందో అన్నిరోజులు అన్నివిష‌యాల‌ను ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకుంటార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో వీరికి త‌గిన గుణ‌పాఠం చెప్ప‌క త‌ప్ప‌ద‌ని, అందుకు ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ప‌నితీరు చూసి ఇత‌ర రాష్ట్రాల‌వారు న‌వ్వుకుంటున్నార‌న్నారు.



ఆ వైసీపీ ఎంపీకి ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌...!

బిగ్ బాస్ 5: ఆవేశమే ఆమె పాలిట శాపమవుతుందా?

ఎకానమీలో కూడా బుమ్రానే బెస్ట్...

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. వినోదం ఎవ‌రికి..? విషాదం ఎవ‌రికి...?

జ‌గ‌న్ అనుకుందే జ‌రుగుతోందా.. కొంప మునుగుతోందా...!

జ‌గ‌న్ ఎంత‌మంది ఎమ్మెల్యేల‌ను మార్చేస్తారు ?

ఈట‌ల‌ను బండి సంజ‌య్ ఇంత లైట్ తీస్కొన్నాడా ?

పడుకుని టీవీ చూస్తే చాలు... లక్షల్లో జీతం?

సంక్రాంతి పై ఫోకస్ పెట్టిన కింగ్ నాగార్జున..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>