PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpb411e343-af91-4a64-9b36-c55ae0e6757d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpb411e343-af91-4a64-9b36-c55ae0e6757d-415x250-IndiaHerald.jpgఅయితే నిన్న మంగ‌ళ‌గిరి లో టీడీపీ ప్ర‌ధాన కార్యాల యంతో పాటు ప‌లు జిల్లా ల‌లో టీడీపీ కార్యాల‌యాల‌పై కొంద‌రు అల్ల‌రి మూక‌లు దాడి చేశారు. ఈ దాడి వైసీపీ ప‌నే అని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్ కి పిలుపునిచ్చింది. గ‌త రాత్రి పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి చేరుకున్న చంద్ర‌బాబు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.ఈ రోజు ఉద‌యం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. TDP{#}Press;District;TDP;Party;YCP;Houseఏపీలో టీడీపీ బంద్‌కు బిగ్ షాక్ ఇచ్చారుగా...!ఏపీలో టీడీపీ బంద్‌కు బిగ్ షాక్ ఇచ్చారుగా...!TDP{#}Press;District;TDP;Party;YCP;HouseWed, 20 Oct 2021 10:10:00 GMTఆంధ్ర ప్రదేశ్  లో అధికార వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై విప‌క్ష టీడీపీ ఏదో ఒక రూపంలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూనే ఉంది. అయితే నిన్న మంగ‌ళ‌గిరి లో టీడీపీ ప్ర‌ధాన కార్యాల యంతో పాటు ప‌లు జిల్లా ల‌లో టీడీపీ కార్యాల‌యాల‌పై కొంద‌రు అల్ల‌రి మూక‌లు దాడి చేశారు. ఈ దాడి వైసీపీ ప‌నే అని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్ కి పిలుపునిచ్చింది. గ‌త రాత్రి పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి చేరుకున్న చంద్ర‌బాబు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

ఈ రోజు ఉద‌యం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. అయితే ఈ రోజు ప్రతిపక్షం బంద్ అంటే ఎంతో కొంత ప్రభావం ఉండాలి. ఇంత జ‌రిగి.. స్వ‌యంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు బంద్ కు పిలుపు ఇచ్చినా కూడా బంద్ ప్ర‌భావం శూన్యంగా మారింది. టీడీపీ నాయకులు ఒక్క బస్సుని కూడా అడ్డుకోలేని దుస్థితి. చివ‌ర‌కు రోడ్డుపైకి వచ్చి నినాదాలు కూడా ఇవ్వలేని ప‌రిస్థితి.

పోలీసులు గ‌త రాత్రి నుంచే ప‌క్కా ప్లానింగ్ తో వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డా రాష్ట్రంలో  శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహ‌రించి టీడీపీ వాళ్ల‌ను  అడ్డుకున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి టీడీపీ నేత‌ల‌ను ముంద‌స్తుగానే హౌస్ అరెస్టులు చేసి టీడీపీ బంద్ ప్లాన్ కు పూర్తిగా షాక్ ఇచ్చారు. ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల‌ను హౌస్ అరెస్టులు చేయ‌డం తో పాటు వారిని బ‌య‌ట‌కు రానివ్వ‌క పోవ‌డంతో ఇక కార్య‌క‌ర్త‌లు కూడా రోడ్ల మీద‌కు రాలేదు.

ఇక కొన్ని చోట్ల ప్రైవేటు పాఠ‌శాల‌లు సెల‌వులు ఇచ్చా యి. అయితే చాలా చోట్ల మాత్రం ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు య‌ధావిధిగానే న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 



పిలుపు ఇచ్చారు... కనిపించలేదు... బాబులు ఎక్కడా...!

బ్రేకింగ్: కేసీఆర్ అర్జెంట్ మీటింగ్, కారణం ఏంటీ...?

పొగరు, ప్రేమ కలగలిపితే సిమ్రాన్

షారుఖ్‌తో సినిమా.. సమంత‌కు మైండ్ పోయే రెమ్యున‌రేష‌న్ ?

సమంత చూపు టాలీవుడ్ వైపు లేదా!!

టీడీపీ గ్రాఫ్ పెంచుతోన్న జ‌గ‌న్‌...!

బద్వేల్ లో బీజేపీ కష్టానికి ఫలితం ఉంటుందా..?

టీ 20 వరల్డ్ కప్: పాకిస్తాన్ ను ఢీ కొట్టే జట్టిదే?

టీడీపీ బంద్‌కు వీళ్లు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారుగా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>