రేపు ఏపీ బంద్ - ఇది ప్రజాస్వామ్యంపై దాడి : రాష్ట్రపతి పాలన తప్పదు - చంద్రబాబు..!!
టీడీపీ కార్యాలయాలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రణాళిక ప్రకారమే దాడులకు తెగబడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాడులకు నిరసనగా రేపు (బుధవారం) రాష్ట్ర బంద్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయం పైన దాడుల జరుగుతున్నా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ వ్యాఖ్యానించారు. అనేకే రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారని..రాష్ట్రంలో గంజాయి సాగు జరుగుతోందని ఆరోపించారు.

సీఎం - డీజీపీ పైన ఆగ్రహం
సీఎం..డీజీపీ కలిసి చేయించిన దాడులంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా విఫలమయ్యాయని ఫైర్ అయ్యారు. మతను భయబ్రాంతులకు గురి చేస్తారా అని ప్రశ్నించారు. మనల్ని మనం కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతామంటూ చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డ్రగ్ మాఫియాకు వత్తాపు పలుకుతారా అంటూ నిలదీసారు. కార్యకర్తలు ధైర్యంతో ఉండాలని సూచించారు. సీఎం నివాసం..డీజీపీ కార్యాలయం పక్కనే ఉండగా ఈ విధంగా దాడులు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రాణాలు పోయినా భయపడను
రౌడీలు వచ్చి రాజకీయం చేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ప్రాణాలు పోయినా భయపడను..ఇష్టానుసారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాజా సర్వే ప్రకారం 28.5 శాతం ఏపీలో ప్రజా ప్రతినిధుల పైన వ్యతిరేకత ఉందని తేలిందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసే హక్కు..మాట్లాడే స్వేచ్చ లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆఫీసులు..కాలేజీలు మూసివేసి మద్దతివ్వాలని కోరారు. ముఖ్యమంత్రి..డీజీ కలిసి ఈ దాడులు చేయించారు.

ప్రభుత్వం..పోలీసు కలిసి చేసిన దాడి
పోలీసు - ప్రభుత్వం కలిసి చేసిన వ్యవహారమని ఆరోపించారు. తాను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ తీయలేదని చెప్పారు. గవర్నర్..కేంద్ర హోం మంత్రి ఫోన్ తీస్తారు..ఈ డీజీపీ మాత్రం బిజీనా అని నిలదీసారు. ఇటువంటి ముఖ్యమంత్రి.. ఇటువంటి వ్యవస్థ తాను చూడలేదని చెప్పారు. ఆర్టికల్ 356 తాను ఎప్పుడూ సమర్ధించలేదని..ఇప్పుడు దీనిని ఎందుకు ఏపీలో ప్రయోగించకూడదని ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు వివరించారు. దీని పైన విచారించాలని గవర్నర్ ను కోరారనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసారని వివరించారు.

అన్ని పార్టీలు -ప్రజలు బంద్ కు సహకరించాలి
దాడులు చేస్తే భయపడతారా.. భయపడేది లేదని స్పష్టం చేసారు. డీజీపీ ఏం హెచ్చరిస్తారు.. తమాషాలు చేస్తారా..చేతైనతే లా అండ్ ఆర్డర్ మెయిన్ టెయిన్ చేయాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మాట్లాడితే నోటీసులు..అరెస్టులు చేస్తారా..ఎంత మందిని చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను..తమ నాయకుడిని ఎంత తిట్టినా ప్రజాస్వామ్యం కోసం భరించామని చెప్పుకొచ్చారు. రెండున్నారేళ్లుగా మీ వేధింపులు చూస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీలు..ప్రజలు బంద్ కు సహకరించాలని చంద్రబాబు కోరారు.