PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-australia-9a6f9b99-9aa0-4bb7-a20e-776a430f4f31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-australia-9a6f9b99-9aa0-4bb7-a20e-776a430f4f31-415x250-IndiaHerald.jpgభారత్ లో మొదటి నుండి భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. ఎప్పుడో స్వార్ధ రాజకీయనేతలు కులాలు, మాటలపై పెట్టిన చిచ్చుతో కాస్త అల్లర్లు చేసుకోవడాన్ని చూసి మమ్మల్ని విడగొట్టి ఇష్టానికి పాచికలు వేయడం సాధ్యం కాదని ప్రతి భారతీయుడు చెప్పగలదని నిపుణులు అంటున్నారు. దానికి చిహ్నంగానే ఇటీవల జరిగిన ఒక సంఘటన, ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ కు చెందిన కొందరు ప్రత్యేక దేశం కావాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ భారత జాతీయజెండాను తగలబెట్టబోయారు. అప్పుడు అక్కడే ఉన్న హర్యానాకు చెందిన ఒక యువకుడు దానిని అడ్డుకున్నాindia-australia{#}Australia;Bharateeyudu;Athadu;Indians;India;INTERNATIONALభారత్ : మాలో దేశభక్తి.. తగ్గేదేలే..!భారత్ : మాలో దేశభక్తి.. తగ్గేదేలే..!india-australia{#}Australia;Bharateeyudu;Athadu;Indians;India;INTERNATIONALTue, 19 Oct 2021 17:04:00 GMTభారత్ లో మొదటి నుండి భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. ఎప్పుడో స్వార్ధ రాజకీయనేతలు కులాలు, మాటలపై పెట్టిన చిచ్చుతో కాస్త అల్లర్లు చేసుకోవడాన్ని చూసి మమ్మల్ని విడగొట్టి ఇష్టానికి పాచికలు వేయడం సాధ్యం కాదని ప్రతి భారతీయుడు చెప్పగలడని నిపుణులు అంటున్నారు. దానికి చిహ్నంగానే ఇటీవల జరిగిన ఒక సంఘటన, ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ కు చెందిన కొందరు ప్రత్యేక దేశం కావాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ భారత జాతీయజెండాను తగలబెట్టబోయారు. అప్పుడు అక్కడే ఉన్న హర్యానాకు చెందిన ఒక యువకుడు దానిని అడ్డుకున్నాడు. అతడిని అక్కడవారు కొట్టారు, నిందించారు. అటుపిమ్మట ఉద్యమం చేస్తున్న వారు తమకు అడ్డువచ్చాడని అతడిపై కేసు కూడా పెట్టారు. ఆస్ట్రేలియా అధికారులు కూడా తమ జండాను తగలబెట్టడం లేదు కదా అనే ఉద్దేశ్యంతో అతడిపైనే చర్యలు తీసుకున్నారు.

సార్వభౌమత్వానికి చిహ్నంగా ఒకదేశ జాతీయ జండాను తగలబెట్టబోవటం చుసిన ఏదేశమైన ఖచ్చితంగా దానిని ఖండించాలి, ఎందుకంటే దానికి ఒక దేశపతాకం ఉంది, దానికో గౌరవం ఉంది, వాళ్ళ పతాకానికి గౌరవం ఉందన్నప్పుడు అదే ప్రతి జాతీయ పతాకానికి ఉంటుందన్నది కనీస సంస్కారం, అది లోపించిన ఆస్ట్రేలియాలో అధికారులు భారతీయుడిపైనే చర్యలు తీసుకున్నాయి. అక్కడ ఉన్న నియమాలు ఏమైనా కావచ్చు, ఒకరి జాతీయ జండాను గౌరవించినప్పుడు, మరొకరి జాతీయజండాకు కూడా కనీస గౌరవం ఇవ్వడం అత్యవసరం. అది ప్రపంచ దేశాలలో లోపిస్తే, అదే తీవ్రవాదులు అలుసుగా చేసుకొని ఒక్కోదేశంపై ఇంకొకళ్ళను ఉసిగొలుపుతూ వాళ్ళు చోద్యం చూస్తూ సంతోషపడతారు. ఆ అవకాశం ప్రపంచదేశాలు ఇవ్వకుండా, ఉమ్మడిగా ఉండేందుకు, ఒకరిని ఒకరు గౌరవించుకునే విధంగా ప్రవర్తించడం అవసరం. అదే లోపించినప్పుడు ఒక ఐక్యరాజ్యసమితి కావచ్చు మరొకటి కావచ్చు అంతర్జాతీయ సంస్థలు అన్ని ఉండి దండగ. అవన్నీ ఉమ్మడి ప్రయోజనాల కోసమేగా ఏర్పాటు చేసుకుంది.

భారతీయుడిని ఖైదు చేయడంపై స్పందించిన విదేశాంగమంత్రి జయశంకర్ జోక్యంతో అతడిని విడిచిపెట్టారు. అతడు ఆస్ట్రేలియా వదిలి భారత్ వస్తే అభిమానులు అతడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మొత్తం మీద అతడిని ప్రజలు రోడ్ షో నిర్వహిస్తూ ఇంటివరకు తీసుకెళ్లారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు భారత్ ను ఎంత తొక్కేయాలని ప్రయత్నించినా, ఇంకాస్త పై పైకి వెళ్తుంది తప్ప తగ్గేదేలే. నేడు సమాజంలో దేశం గురించి కాస్త మాట్లాడితే ఎక్కిరించే వాళ్ళు ఉండొచ్చు కానీ, ఇప్పుడిప్పుడే ఆ మొహమాటం నుండి భారతీయులు బయటకు వస్తున్నారు.


డీజీపీకి ప్రతీ ఒక్కటి తెలుసు, ఛీ ఇదేం రాజకీయం: చంద్రబాబు

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>