Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-470b261d-1bf8-486c-86b2-485ccd17d86a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-470b261d-1bf8-486c-86b2-485ccd17d86a-415x250-IndiaHerald.jpgసాధారణంగా టి20 ఫార్మాట్ అంటే కుర్రాళ్ళ ఆట అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ప్రతి బంతి కూడా వికెట్ పడగొట్టడానికే స్పందించాల్సి ఉంటుంది. ఇక టి20 మ్యాచ్ జరుగుతుంటే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉత్కంఠతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగిపోతుంది. అంతలా టి20 ఫార్మాట్ క్రికెట్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ప్రపంచ క్రికెట్కు ఎంతో మంది యువ ఆటగాళ్లను పరిచయం Ipl.{#}Jharkhand;Parugu;Heart;BCCI;Varsham;ishaan actor;Ishan Kishan;Cricket;INTERNATIONAL;Mumbai;Audience;Yuva;Indianఐపీఎల్ : బౌలర్లకు పిచ్చెక్కించిన యంగ్ ప్లేయర్?ఐపీఎల్ : బౌలర్లకు పిచ్చెక్కించిన యంగ్ ప్లేయర్?Ipl.{#}Jharkhand;Parugu;Heart;BCCI;Varsham;ishaan actor;Ishan Kishan;Cricket;INTERNATIONAL;Mumbai;Audience;Yuva;IndianWed, 06 Oct 2021 10:45:00 GMTసాధారణంగా టి20 ఫార్మాట్ అంటే కుర్రాళ్ళ ఆట అని చెబుతూ ఉంటారు.  ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ప్రతి బంతి కూడా వికెట్ పడగొట్టడానికే స్పందించాల్సి ఉంటుంది.  ఇక టి20 మ్యాచ్ జరుగుతుంటే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉత్కంఠతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగిపోతుంది. అంతలా టి20 ఫార్మాట్ క్రికెట్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది.  అయితే ముఖ్యంగా బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ప్రపంచ క్రికెట్కు ఎంతో మంది యువ ఆటగాళ్లను పరిచయం చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో సెలెక్టర్ల చూపులు ఆకర్షిస్తుంటారూ. అయితే గత రెండు మూడు సీజన్స్ నుంచి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఏకంగా భారత అంతర్జాతీయ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇలాంటి ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఒకరు.  గత కొన్ని సీజన్ల నుంచి ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇషాన్ కిషన్. బ్యాట్ తో అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నాడు.



 కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఊహించిన రీతిలో ఇషాన్ కిషన్ రాణించలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ యువ ఆటగాడు పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం కూడా మొదలయ్యాయి. అయితే ఇటీవల తనపై వస్తున్న విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు యంగ్ డైనమిక్ ప్లేయర్.  అద్భుతమైన టాలెంట్ వున్న ఈ ఝార్ఖండ్ ప్లేయర్ ఇటీవల జరిగిన మ్యాచ్లో బౌలర్లకు చుక్కలు చూపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఇషాన్ కిషన్ ఇటీవల జరిగిన మ్యాచ్లో కూడా ఒక ఓవర్లో ఒక్క పరుగు కూడా చేయలేదు. దీంతో అభిమానులు అందరూ నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత మాత్రం 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్సర్లు ఫోర్లు వర్షం కురిపించాడు. ఇక ఇషాన్ కిషన్ చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అటు ముంబై ఇండియన్స్ జట్టు కి అద్భుతమైన విజయాన్ని అందించింది అని చెప్పాలి.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>