MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shah-rukh-in-depression-not-understanding-what-to-do5482b4a9-4a34-4fc5-86c9-4dca770cb5ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shah-rukh-in-depression-not-understanding-what-to-do5482b4a9-4a34-4fc5-86c9-4dca770cb5ea-415x250-IndiaHerald.jpgషారుఖ్ ఖాన్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒకవైపు సినిమాలు ఆడటం లేదు. మరోవైపు కొడుకు ఇష్యూతో పరువు పోతోంది. పర్సనల్, ప్రొఫెషనల్‌ కెరీర్స్ రెండూ ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు షారుఖ్ ఖాన్. Shah Rukh in depression not understanding what to do{#}Salman Khan;atlee kumar;Coronavirus;aryan;Cinema;Arrestడిప్రెషన్ లో షారుఖ్.. ఏం చేయాలో అర్థం కాక..!డిప్రెషన్ లో షారుఖ్.. ఏం చేయాలో అర్థం కాక..!Shah Rukh in depression not understanding what to do{#}Salman Khan;atlee kumar;Coronavirus;aryan;Cinema;ArrestWed, 06 Oct 2021 21:30:00 GMTకొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌ని దోషిలా చూస్తున్నారు. పిల్లలని సరిగా పెంచలేకపోయాడని, అవసరానికి మించి డబ్బులు ఇచ్చి కొడుకుని పాడు చేశాడని నెటిజన్లు ఘోరంగా ట్రోల్‌ చేస్తున్నాడు. ఆర్యన్‌ని విమర్శించడం ఆపమని చెప్పిన బాలీవుడ్‌ స్టార్స్‌ని కూడా టార్గెట్‌ చేస్తున్నారు నెటిజన్లు.ఆర్యన్ ఖాన్‌ కస్టడీలో ఉన్నప్పటి నుంచి షారుఖ్‌ ఖాన్‌ని ఓదార్చడానికి బాలీవుడ్‌ సెలబ్స్‌ అంతా మన్నత్‌కి బయల్దేరుతున్నారు. సల్మాన్ ఖాన్‌ కూడా షారుఖ్‌ని కలిశాడు. అయితే బీటౌన్‌ జనాలంతా ఇంటికిరావడంతో షారుఖ్‌ ఖాన్‌ కూడా విసిగిపోతున్నాడట. దీంతో మమ్మల్ని కలవడానికి ఎవరూ రావొద్దని బాలీవుడ్‌ సెలబ్స్‌కి రిక్వెస్టులు పెడుతున్నాడు బాద్‌షా.

షారుఖ్‌ ఖాన్‌ ఈ ఏడాది ఆర్యన్‌ ఖాన్‌ని హీరోగా లాంచ్‌ చేస్తాడనే ప్రచారం జరిగింది. షారుఖ్‌ ఫీచర్స్‌తో ఉన్న ఆర్యన్‌తో లవ్‌స్టోరీస్‌ తియ్యడానికి కరణ్‌ జోహార్‌ లాంటి దర్శకనిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ టైమ్‌లోనే డ్రగ్స్‌ కేసుతో ఆర్యన్‌ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. దీంతో వారసుడి కెరీర్‌ ఏం అయిపోతుందో అని టెన్షన్‌ పడుతున్నాడట షారుఖ్. షారుఖ్‌ ఖాన్‌ గ్రాఫ్‌ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తర్వాత షారుఖ్‌కి సరైన హిట్‌లేదు. ఎనిమిదేళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక 'జీరో' సినిమా అయితే షారుఖ్‌ని గట్టిగా దెబ్బకొట్టింది. షారుఖ్ సొంత బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. దీంతో మరో సినిమా చెయ్యడానికి రెండేళ్లకి పైగా గ్యాప్ తీసుకున్నాడు షారుఖ్.

షారుఖ్‌ ఖాన్‌ కరోనా ఫస్ట్‌ వేవ్‌ ముగిసాక మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 'పఠాన్' మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా అలా సెట్స్‌కి వెళ్లిందో లేదో సెకండ్‌ వేవ్‌తో బ్రేకులు పడ్డాయి. ఈ ప్రభావం నుంచి కోలుకొని మళ్లీ షూటింగులు గాడినపడగానే అట్లీ డైరెక్షన్‌లో సినిమా లాంచ్ చేశాడు. అయితే ఇప్పుడు కొడుకు కేసుతో ఇంటికే పరిమితమయ్యాడట షారుఖ్.సినిమాల్లో స్టార్డమ్‌ సంపాదించుకుంటాడు అని కలలు కంటోన్న కొడుకు కస్టడీలో ఉండడంతో షారుఖ్ ఖాన్‌ షూటింగులపై కాన్సన్‌ట్రేట్‌ చేయలేకపోతున్నాడట. ఆర్యన్ ఖాన్ బయటకొచ్చేవరకు షూటింగ్స్‌ అన్నింటికి బ్రేకులు ఇస్తున్నాడట షారుఖ్. మరి ఇన్ని ఎదురుదెబ్బలు తింటోన్న షారుఖ్‌ వీటినుంచి ఎప్పటికి బయటపడతాడో చూడాలి.







బాలకృష్ణ, రవితేజ కు మధ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదా..?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>