BusinessChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/olaleasingissue-4a4d6228-e003-4421-b712-1b8989015bf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/olaleasingissue-4a4d6228-e003-4421-b712-1b8989015bf3-415x250-IndiaHerald.jpgఓలా నగరాలలో ప్రయాణాన్ని సులభతరం చేసిందనే చెప్పాలి. అయితే తాజాగా వాళ్ళు ఇతర పోటీదారులతో పోటీ పడలేక కొత్త గా ఓలా లీజింగ్ పద్దతిని తీసుకువచ్చారు. అయితే ఈ పద్దతి వలన సంస్థకు, వాహన డ్రైవర్ కు ప్రయోజనం చేకూరుతుందని మొదటిలో చెప్పడం జరిగింది. అయితే అదంతా కేవలం వాహన డ్రైవర్ లను మోసం చేయడానికే తప్ప మరేమి లేదని కార్మిక సంఘం తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ లీజింగ్ పద్దతి కేవలం డ్రైవర్ లను మోసం చేయడానికే ఏర్పాటు చేయబడిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొదటిలో సంస్థ ప్రత్యేక భాగస్వామిగా ఉండటానికి, అలాగే వారు నడolaleasingissue;{#}OLA;Two-wheeler drivers;Driver;contractఓలా లీజింగ్.. లీకేజీలు ఏమిటో..!ఓలా లీజింగ్.. లీకేజీలు ఏమిటో..!olaleasingissue;{#}OLA;Two-wheeler drivers;Driver;contractWed, 06 Oct 2021 09:02:32 GMTఓలా నగరాలలో ప్రయాణాన్ని సులభతరం చేసిందనే చెప్పాలి. అయితే తాజాగా వాళ్ళు ఇతర పోటీదారులతో పోటీ పడలేక కొత్త గా ఓలా లీజింగ్ పద్దతిని తీసుకువచ్చారు. అయితే ఈ పద్దతి వలన సంస్థకు, వాహన డ్రైవర్ కు ప్రయోజనం చేకూరుతుందని మొదటిలో చెప్పడం జరిగింది. అయితే అదంతా కేవలం వాహన డ్రైవర్ లను మోసం చేయడానికే తప్ప మరేమి లేదని కార్మిక సంఘం తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ లీజింగ్ పద్దతి కేవలం డ్రైవర్ లను మోసం చేయడానికే ఏర్పాటు చేయబడిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొదటిలో సంస్థ ప్రత్యేక భాగస్వామిగా ఉండటానికి, అలాగే వారు నడుపుతున్న వాహనాన్ని సొంతం చేసుకోడానికి అంటూ ఈ ఒప్పందం ఉండేది. దానికోసం సంస్థతో నాలుగేళ్లు ఒప్పందం చేసుకున్నారు డ్రైవర్లు. దీనిప్రకారం రోజు 700-1150 రూ. వరకు సంస్థకు చెల్లించాల్సి వచ్చేది. పేద, మధ్యతరగతి డ్రైవర్లు చాలామంది ఈ పద్దతిలో ఉన్న లోపాలు తెలియక కేవలం ఆకర్షితులై ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

కానీ ఇటీవల సంస్థ తన లీగల్ సెల్ పూర్తిగా తీసేస్తున్న నేపథ్యంలో లీజింగ్ ఒప్పందం వెనుక మోసాలు బహిర్గతం అయ్యాయని కార్మిక సంఘం విమర్శిస్తోంది. ఓలా సంస్థ మరియు ఏఎన్ ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా భారీ  కుంభకోణానికి పాల్పడ్డట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. దేశంలోనే మొదటిసారిగా షేరింగ్ పద్దతిలో దాదాపు అన్ని పట్టణాలు, నగరాలలో చిన్న ప్రయాణ ఏజంట్లు లేకుండా చేసుకుంది సంస్థ. అనంతరం క్యాబ్ యజమానులను  వారి డ్రైవర్ భాగస్వాములుగా చేర్చుకుంది, అలాగే టాక్సీలలో డిటెక్టింగ్ నిబంధనలు ప్రారంభించింది అని వారు ఆరోపించారు. ఇటీవల కాలంలో కొందరి పోటీదారులతో ఓలా డ్రైవర్లు పోటీ పడలేకపోతున్నట్టు తెలుసుకున్న సంస్థ తన సొంత వాహనాలను నడపడానికి ఓలా లీజింగ్ పద్దతిని తెచ్చుకుంది.

ఇలా ఏదో ఒక సంస్థ వచ్చి కొత్త ఆఫర్లు ఇస్తుందని తెలియగానే కొందరు ఆకర్షితులవుతున్నారని, అనంతరం మోసపోయినట్టు తెలుసుకుంటున్నారు. ఆయా సంస్థలు తమకు కావాల్సినంత కాలం వీళ్ళను వాడుకొని తరువాత నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తుంది. దీనితో వాళ్లకు వేరే దారిలేక ఆర్థికంగా నే కాకుండా అన్నివిధాలుగా చితికిపోతున్నారు. దీనిపై ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ఇలాంటి సంస్థలను దూరంగా పెట్టి చిన్న సన్నకారు జీవితాలను రక్షించాలని కార్మిక సంఘం అన్నది.



బద్వేలు పోరు: నోటాతోనే ఆ పార్టీల పోటీ?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>