PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drones0bc59631-3f6c-46e2-99a4-43890397910c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drones0bc59631-3f6c-46e2-99a4-43890397910c-415x250-IndiaHerald.jpgభారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పుడు టెక్నాలజీ వార్ జరుగుతోంది. ఇప్పటి వరకు అక్రమ చొరబాట్లకు తెరలేపిన ఉగ్ర మూకలు... ఇప్పుడు కొత్త తరహా దాడులకు తెరలేపారు. టెక్నాలజీ సాయంతో భారత భూభాగంలో పరిస్థితులను పరిశీలించి... వారిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఉగ్రవాదులు. ప్రస్తుతం బోర్డర్‌లో డ్రోన్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ దాడులు ఎటు వైపు నుంచి జరుగుతాయో అని... గస్తీ దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి జరిగిన నాటి నుంచి... డ్రోన్ల కదలికలు కPakistan Border{#}Army;Terrorists;Balloon;Punjab;Pakistan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;District;Cheque;Apple;Indianబోర్డర్‌లో డ్రోన్‌ల కలకలం... జవాన్ల కాల్పులు..!బోర్డర్‌లో డ్రోన్‌ల కలకలం... జవాన్ల కాల్పులు..!Pakistan Border{#}Army;Terrorists;Balloon;Punjab;Pakistan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;District;Cheque;Apple;IndianWed, 06 Oct 2021 17:03:33 GMTభారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పుడు టెక్నాలజీ వార్ జరుగుతోంది. ఇప్పటి వరకు అక్రమ చొరబాట్లకు తెరలేపిన ఉగ్ర మూకలు... ఇప్పుడు కొత్త తరహా దాడులకు తెరలేపారు. టెక్నాలజీ సాయంతో భారత భూభాగంలో పరిస్థితులను పరిశీలించి... వారిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఉగ్రవాదులు. ప్రస్తుతం బోర్డర్‌లో డ్రోన్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ దాడులు ఎటు వైపు నుంచి జరుగుతాయో అని... గస్తీ దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి జరిగిన నాటి నుంచి... డ్రోన్ల కదలికలు కలకలం రేపుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో డ్రోన్ దాడులు ప్రస్తుతం కలవర పెడుతున్నాయి కూడా. రెండు రోజుల క్రితం కూడా... పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ జిల్లా బమియాల్ సెక్టార్ పరిధిలోని జైత్‌పూర్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ డ్రోన్ కలకలం రేపింది. గస్తీ నిర్వహిస్తున్న సైనిక దళాలు డ్రోన్ ను గుర్తించాయి.

బమియాల్ సెక్టార్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డ్రోన్ పై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పుల అనంతరం డ్రోన్ మాయమైంది. దీంతో ఆ ప్రాంతంలో డ్రోన్ కోసం ఆర్మీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్ కెమెరా ద్వారా పరిస్థితులు గమనించడంతో పాటు... ఆయుధాలు చేరవేయడం, పేలుడు పదార్థాలు రవాణా చేయడం వంటి చర్యలకు ఉగ్రవాదులు పాల్పడుతున్నారు. అలాగే తమ అనుచరులకు సందేశాలను కూడా డ్రోన్ ద్వారా పంపిస్తున్నారు. ఈ కోణంలో కూడా ఆర్మీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏదైనా కుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారా అని అధికారులు అనుమానిస్తున్నారు. పఠాన్‌కోట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా బెలూన్ ఎగిరిన నెల రోజులకు జమ్ములోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై డ్రోన్‌తో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత వారం రోజులకే ఓ డ్రోన్ కొరియర్‌ను ఆర్మీ అధికారులు‌ ధ్వంసం చేశారు. ఈ పార్శిల్‌లో ఏకే-47 రైఫిల్, బుల్లెట్లు, టెలిస్కోప్ కూడా గుర్తించారు అధికారులు. ఉగ్రదాడులు జరుగుతాయనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో... డ్రోన్‌ల కదలికపై కూడా దృష్టి సారించారు అధికారులు.





ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>