PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahulfe6a5ee7-3876-450f-a54e-587e9666abbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahulfe6a5ee7-3876-450f-a54e-587e9666abbe-415x250-IndiaHerald.jpgఇది రాజకీయం. ఎపుడైనా ఏమైనా జరిగేది ఇక్కడే. అయితే పాలిటిక్స్ లో టైమింగ్ ముఖ్యం. అనుకున్నది పండాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు హీరో అనుకున్న వారు రేపు జీరో అవుతారు. అందువల్ల ఎపుడు ఎవరికి ఎలా కలసి వస్తుందో చెప్పలేరు. అంతా పాలిట్రిక్స్ మరి. rahul{#}Vishakapatnamరైట్ టైం లో రాహుల్ ఎంట్రీ... ?రైట్ టైం లో రాహుల్ ఎంట్రీ... ?rahul{#}VishakapatnamWed, 06 Oct 2021 19:26:07 GMTఇది రాజకీయం. ఎపుడైనా ఏమైనా జరిగేది ఇక్కడే. అయితే పాలిటిక్స్ లో టైమింగ్ ముఖ్యం. అనుకున్నది పండాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు హీరో అనుకున్న వారు రేపు జీరో అవుతారు. అందువల్ల ఎపుడు ఎవరికి ఎలా కలసి వస్తుందో చెప్పలేరు. అంతా పాలిట్రిక్స్ మరి.

ఇవన్నీ పక్కన పెడితే ఒకనాడు కాంగ్రెస్ కి ఏపీలో నో చాన్స్ అన్నట్లుగా సీన్ ఉండేది. ఉమ్మడి ఏపీని రెండుగా విభజించింది కాంగ్రెస్. దాంతో ఆంధ్రుల కోపాగ్నిలో కాంగ్రెస్ దహించుకుని పోయింది. రెండు సార్లు పోటీ చేస్తే కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఆ పార్టీ తరఫున గెలవలేదు. ఇదిలా ఉంటే ఇపుడు కాంగ్రెస్ మీద ఏపీ జనాల మూడ్ ఎలా ఉంది. ఈ ప్రశ్న ఆసక్తికరమే. జవాబు మాత్రం తెలియదు అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ ఓడుతూనే ఉంది. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు, ధీటైన నేతలు లేరు అన్న మాట కూడా ఉంది.

మొత్తానికి కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్న వారు ఉన్నారు. కానీ రాజకీయాల‌లో నో ఎండ్. ఆడుతూనే ఉంటే గెలుపు ఏదో నాడు దూసుకురావడం ఖాయమే. అందుకే ఏపీలో తన పొజిషన్ ఏంటో చూసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. బద్వేల్ సహా ఏపీ అంతటా కాంగ్రెస్ కి మంచి బలం ఒకపుడు ఉండేది. ఆ భరోసాతోనే బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీకి రెడీ అవుతోంది.

అదలా ఉంటే ఇందిరా గాంధీ టైమ్ లో విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది. మరి ఇపుడు చూస్తే మోడీ దాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దాంతో రాహుల్ ఏపీ టూర్  లో ఉక్కు సంకల్పమే తీసుకుంటారని అంటున్నారు. విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ద్వారా ఆయన ఏపీకి గట్టి భరోసా ఇస్తారని చెబుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం రాహుల్ పోరాడితే కచ్చితంగా జనాలు ఎంతో కొంత టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా బీజేపీ ఏపీకి ఇవ్వని ప్రత్యేక హోదా సహా అనేక విభజన హామీల మీద కూడా రాహుల్ హామీ ఇవ్వనున్నారని అంటున్నారు. మరి 2024లో మాదే ఏపీలో అధికారం అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ధీమాగా చెబుతున్న వేళ రైట్ టైమ్ లోనే రాహుల్ ఏపీలో ఎంట్రీ ఇస్తున్నారు అనుకోవచ్చా. చూడాలి.







కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>