TechnologyPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drugs-in-space-1086ee1a-c9bd-4e99-8a65-40b6ed00320d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drugs-in-space-1086ee1a-c9bd-4e99-8a65-40b6ed00320d-415x250-IndiaHerald.jpgఅంత‌రిక్షంలో ప్ర‌యోగాలు చేస్తున్న శాస్త్ర‌వేత్త‌లు ఇక ముందు మందులు, వ్యాక్సిన్‌లు, వైద్య ప‌రిక‌రాలు త‌యారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మ‌నుషుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచే ఔష‌దాలు త‌యారీ ల్యాబుల్లో, ఫ్యాక్టిరీల్లో త‌యార‌వుతాయ‌ని అందరికీ తెలిసిందే.. కొన్ని కొన్ని వ్యాక్సిన్లు ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేసిన మెడిక‌ల్ ల్యాబోరెట‌రీలో ప్ర‌యోగాలు చేసి త‌యారు చేస్తుంటారు. మ‌రి ఇదేంటి రోద‌సిలో మందులు, వ్యాక్సిన్‌లు త‌యారు చేయ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారా..! అవును ఇది నిజ‌మే రాబోయే రోజుల్లో drugs in space {#}Avunu;jeevitha rajaseskhar;Shaktiఇక అంత‌రిక్షంలో ఔష‌ధాల త‌యారీ..!ఇక అంత‌రిక్షంలో ఔష‌ధాల త‌యారీ..!drugs in space {#}Avunu;jeevitha rajaseskhar;ShaktiMon, 04 Oct 2021 13:11:16 GMTఅంత‌రిక్షంలో ప్ర‌యోగాలు చేస్తున్న శాస్త్ర‌వేత్త‌లు ఇక ముందు మందులు, వ్యాక్సిన్‌లు, వైద్య ప‌రిక‌రాలు త‌యారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మ‌నుషుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచే ఔష‌దాలు త‌యారీ ల్యాబుల్లో, ఫ్యాక్టిరీల్లో త‌యార‌వుతాయ‌ని అందరికీ తెలిసిందే.. కొన్ని కొన్ని వ్యాక్సిన్లు ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేసిన మెడిక‌ల్ ల్యాబోరెట‌రీలో ప్ర‌యోగాలు చేసి త‌యారు చేస్తుంటారు. మ‌రి ఇదేంటి రోద‌సిలో మందులు, వ్యాక్సిన్‌లు త‌యారు చేయ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారా..! 


అవును ఇది నిజ‌మే రాబోయే రోజుల్లో మాన‌వుని ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉప‌యోగించే మందులు, వ్యాక్సిన్‌లు, ఔష‌ధాలు మ‌రింత  స్వ‌చ్ఛంగా త‌యారు చేయాల‌నే ఉద్దేశ్యంతో వాటిని అంద‌రిక్షంలో త‌యారు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. త్వ‌రలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభ కానుంద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు `  రోద‌సిలో త‌యారీ ` అని నామ‌క‌ర‌ణం చేశారు.



   రోదసిలో తయారీ’ అంటే..

   భూమి మీద ప్రయోగశాలల్లో తయారు చేసే  ఔషధాలు, వ్యాక్సిన్‌లు, వైద్య పరికరాలు  ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మెడిక‌ల్  ల్యాబ్‌లలో ఉత్ప‌త్తి చేస్తారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ స్పేస్‌ ఫోర్జ్ ’తో కలిసి స‌మ‌యుక్తంగా ఈ ` రోద‌సి త‌యారీ ` ప్రాజెక్టును చేపట్టింది. ల్యాబోరేట్స్  నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఫోర్జ్‌స్టార్ ఒక‌ వ్యోమనౌకనూ త‌యారు చేస్తోంది.  2022 లేదా 2023 సంవ‌త్స‌రంలో ఈ ప్రయోగం  చేపట్టనున్నార‌ని తెలుస్తోంది.

అస‌లు రోదసిలో ఎందుకు..?

    అంత‌రిక్షంలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉండవన్న సంగ‌తి అంద‌రికీ విధిత‌మే.  రోగాలను త‌గ్గించే మందులు, ఔషధాలు, వ్యాక్సిన్లను అంతరిక్షంలో ఉన్న‌  స్వచ్ఛమైన పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తే వాటిపై సూక్ష్మజీవుల ప్రభావం ప‌డే అవ‌కాశం అస‌లే ఉండదు. దీంతో ఔషధాల పనితీరుతో పాటు జీవిత కాలం ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉంటుంది. ఔషధ సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు వీలుంటుంది. అలాగే.. సున్నితమైన వైద్య పరికరాల తయారీలో వినియోగించే లోహాలను వివిధ మోతాదుల్లో కలపాల్సి ఉంటుంది. భూమి మీద ఉన్న పీడనం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఆ ప్రక్రియకు చాలా సందర్భాల్లో అంతరాయం ఏర్ప‌డుతున్న‌ది. అయితే.. రోద‌సిలో వీటిని ఉత్ప‌త్తి చేస్తే ఈ స‌మ‌స్య‌ల‌న్ని తొల‌గిపోతాయి.



స్ట్రాటజీ మారుస్తున్న పవన్.. వాళ్ళని తిప్పేస్తారు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>